అంతర్జాతీయ పేమెంట్ సొల్యూషన్స్ దిగ్గజం మాస్టర్‌కార్డ్ తాజాగా కొత్త పేమెంట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్ చెల్లింపు లావాదేవీలు సురక్షితంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా జరిగేందుకు ఈ ఫీచర్ తోడ్పడనుంది. ’ఐడెంటిటీ చెక్ ఎక్స్‌ప్రెస్’ పేరిట ప్రవేశపెట్టిన ఈ ఫీచర్‌తో చెల్లింపు ప్రక్రియ పూర్తి కావడంలో థర్డ్ పార్టీ వెబ్‌సైట్ అవసరం ఉండదని సంస్థ వెల్లడించింది. భారత్‌లో తొలిసారిగా నిర్వహించిన గ్లోబల్ మాస్టర్‌కార్డ్ సైబర్‌సెక్యూరిటీ సదస్సులో మాస్టర్‌కార్డ్ దీన్ని ఆవిష్కరించింది. సాధారణంగా 20 శాతం మొబైల్ ఈ–కామర్స్ లావాదేవీలు అవాంతరాల కారణంగా విఫలమవుతున్నాయని మాస్టర్‌కార్డ్ సైబర్ అండ్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ విభాగం ప్రెసిడెంట్ అజయ్ భల్లా తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాజా ఫీచర్‌ను తెచ్చినట్లు వివరించారు. మొబైల్‌తో పాటు డెస్క్‌టాప్‌ల ద్వారా జరిపే చెల్లింపులకూ ఇది ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు.
గ్లోబల్ సర్వర్లలో నిక్షిప్తమైన ఉన్న భారతీయులకు సంబంధించిన డేటాను తొలగించనున్నట్లు అంతర్జాతీయ కార్డు చెల్లింపుల సేవల సంస్థ మాస్టర్ కార్డు ఇది వరకే వెల్లడించింది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల లావాదేవీలకు సంబంధించిన వివరాలతో పాటు, భారతీయుల వివరాలను పేమెంట్ కంపెనీలు అంతర్జాతీయ సర్వర్ల నుంచి తొలగించాలని గతేడాది ఏప్రిల్‌లో ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబరు 16 నుంచి దీన్ని అమల్లోకి తేవాలని తెలిపింది. ఈ నేపథ్యంలో త్వరలోనే అంతర్జాతీయ సర్వర్లలో ఉన్న భారతీయుల వివరాలను తొలగించనున్నట్లు మాస్టర్‌కార్డ్ వెల్లడించనుంది. అంతేకాదు, భారతీయులు జరిపిన లావాదేవీలకు సంబంధించిన వివరాలను పుణెలోని తమ టెక్నాలజీ సెంటర్‌లో అక్టోబరు 6న భద్రపరిచినట్లు పేర్కొంది. ‘ఆర్‌బీఐ ప్రతిపాదనల మేరకు భారతీయులకు సంబంధించిన డేటా ఎక్కడ ఉన్నా దాన్ని తొలగిస్తాం. వారి సమాచార వివరాలను కేవలం భారత్‌లోనే భద్రపరుస్తామని తెలిపింది.
రానున్న అయిదేళ్లలో భారత్‌లో 1 బిలియన్ డాలర్లు (రూ.7,000 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు మాస్టర్‌కార్డ్ తెలిపింది. దీంతో భారత్‌లోని ఉద్యోగుల సంఖ్య రెండింతలు కానుందని తెలిపింది. ప్రస్తుతం 2,000గా ఉన్న ఉద్యోగులు రానున్న అయిదేళ్లలో 4,000కు చేరుకుంటుందని పేర్కొంది. 2013లో భారత్‌లో మాస్టర్‌కార్డ్ ఉద్యోగుల సంఖ్య 29గా ఉందని, ఇప్పుడు ఆ సంఖ్య 2,000కు చేరిందని, వీరంతా హైలీ టెక్నికల్ క్వాలిఫైడ్ స్టాఫ్ అని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాస్టర్‌కార్డ్ ఉద్యోగుల్లో భారత్‌లోని ఈ రెండువేల మందిది 14 శాతమని చెప్పారు.
తాము ఇలాగే పురోగతి సాధిస్తామని, రానున్న అయిదేళ్లలో ఉద్యోగుల సంఖ్య రెట్టింపు కానుందని తెలిపారు. ఇప్పటికే బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి దాదాపు 2,000 మంది ఉద్యోగులను నియమించామని, వచ్చే అయిదేళ్లలో మరో రూ.7వేల కోట్ల పెట్టుబడితో మరో 2,000 మందిని నియమించుకొంటామని దక్షిణాసియా విభాగపు సీనియర్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్ తెలిపారు.తాజాగా ప్రకటించిన పెట్టుబడుల్లో మూడో వంతు పుణేలో ఉంటాయని తెలిపారు. భవిష్యత్తులో రాబోయే రూ.7వేల కోట్ల పెట్టుబడుల్లో మూడొంతులు ఈ కేంద్రం అభివృద్ధికి ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
అమెరికా వెలుపల ఇలాంటి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి అని చెప్పారు. మరో రూ.2వేల కోట్లను ఐడెంటిఫికేషన్, టోకెనైజేషన్, సెక్యూరిటీ, అనలటిక్స్ సపోర్ట్ వంటి వ్యాల్యూ యాడెడ్ సర్వీస్‌ల కోసం 'సర్వీస్ హబ్' నిమిత్తం ఖర్చు చేస్తామన్నారు. ప్రస్తుతం దేశంలో 2.5 కోట్ల మంది డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారని, వచ్చే రెండేళ్లలో ఇది 12.5 కోట్లకు పెరగనుందన్నారు. అలాగే, మర్చంట్ యాక్సెప్టెన్సీ పాయింట్స్ (ఎంఏపీ) సంఖ్య మరో రెండేళ్లలో 52 లక్షల నుంచి కోటికి చేరనుందని, డిజిటల్ చెల్లింపుల విభాగంలో సౌత్ కొరియా, జపాన్, యూఎస్‌లను భారత్ అధిగమించినట్లవుతుందన్నారు.
బెంగళూరు, గురుగావ్‌లో కొత్త కార్యాలయాలు వచ్చాయి. పుణేలో మాస్టర్‌కార్డ్ ల్యాబ్ ఆపరేషన్స్ హబ్ ఉంది. వడోదరలో ఓ టెక్నాలజీ కేంద్రం ఉంది. ఇతర నగరాలకు కూడా కార్యకలాపాలు విస్తరించనుంది.