మోటోరాలా స్మార్టు ఫోన్ల విషయంలో ప్రపంచమంతా వచ్చే కంప్లయింట్ ఒకటుంది. అది... ఛార్జింగ్ ప్రాబ్లం. మోటోరాలా ఫీచర్ ఫోన్ల కాలం నుంచి ప్రస్తుత స్మార్టు ఫోన్ల కాలం వరకు అదే సమస్య. అందమైన రూపం... ఆకర్షణీయమైన డిజైన్లతో పాటు మంచి ఫీచర్లు కూడా ఉంటాయి కానీ ఎందుకనో ఛార్జింగ్ మాత్రం నిలవదు. దీంతో ఆ సమస్యను పరిష్కరిస్తూ మోటోరాలా త్వరలో మంచి బ్యాటరీ బ్యాకప్ ఉన్న ఒక ఫోన్ ను అందుబాటులోకి తేనుంది.
ఇండియాకూ వస్తుంది...
'మోటో ఈ4 ప్లస్’ పేరుతో విడుదల చేస్తున్న ఈ ఫోన్ లో ఏకంగా 5 వేల ఎంఏహెచ్ సామర్థ్త్యం ఉన్న బ్యాటరీ ఉంటుంది. దీనికి సంబంధించిన ఫోటోలో నెట్ లోచక్కర్లు కొడుతున్నాయి. మొదట యూరోప్ జోన్ లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇండియాలోనూ ఆ వెంటనే రావొచ్చని భావిస్తున్నారురిమూవబుల్ బ్యాక్ కవరతోరానున్న ఈ డివైస్ ధర సుమారు రూ.13,305గా నిర్ణయించవచ్చని అంచనా. .
ఫీచర్స్ అదుర్స్
5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే,
1280 x 720 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 7.1 నూగట్ఆపరేటింగ్ సిస్టమ్,
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2/3 జీబీ ర్యామ్16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
13 ఎంపీ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ