• తాజా వార్తలు

జూన్ 10 నుంచి ఒప్పో ఆర్ 11, ఆర్ 11 ప్లస్ రిలీజ్

సెల్ఫీ కెమేరాలకు ప్రసిద్ధిగాంచిన చైనా స్మార్టు ఫోన్ మేకర్ ఒప్పో మరోసారి సెల్ఫీ ఫోకస్డ్ ఫోన్ ను మార్కెట్ కు పరిచయం చేయడానికి రెడీ అవుతోంది. ఒప్పో ఆర్ 11, ఆర్ 11 ప్లస్ పేర్లతో రెండు సెల్ఫీ ఫోకస్డ్ ఫోన్లను ఇండియన్ మార్కెట్లో జూన్ 10న లాంఛ్ చేయడానికి సిద్ధమవుతోంది. కాగా లాంఛింగ్ కు ఇంకా రెండు వారాలు ఉండగానే వీటి వివరాలు లీకయ్యాయి.
సెల్ఫీ కెమేరాయే హైలైట్
ఒప్పో ఆర్11 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ అమోలెడ్ డిస్ ప్లేతో తీసుకొస్తున్నారు. ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128జీబీ వరకు ఎక్స్పాండబుల్ మెమొరీ దీని ప్రత్యేకతలు. ఆండ్రాయిడ్ నోగట్ 7.1 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేస్తుంది. 2900 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం దీనికి ఉంది. దీని సెల్ఫీ కెమేరా ఎంతో తెలుసా... ఏకంగా 20 మెగా పిక్సెళ్ల కెమేరా ఇందులో వినియోగించారు. ఇక వెనుక వైపు కెమేరా విషయానికొస్తే 20ఎంపీ, 16ఎంపీలతో రెండు కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది ఒప్పో ఆర్11 ప్లస్ లోనూ సుమారుగా ఇవే ఫీచర్లున్నాయి. అయితే... ఆర్ 11 ప్లస్ లో డిస్ ప్లే సైజు, ర్యామ్, బ్యాటరీ సామర్థ్యం మరింత ఎక్కువ.
ఆర్ 11 ప్లస్ లో ఇవి అదనం
ఆర్ 11 ప్లస్ లో 6 అంగుళాల డిస్ ప్లే, 6జీబీ ర్యామ్, 3880ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. మిగతా ఫీచర్లన్నీ సేమ్ టు సేమ్.
ఇండియన్ మార్కెట్ పై కన్ను
కాగా ఒప్పో మొన్న మార్చి నెలలోనే ఆర్9, ఆర్9 ప్లస్ అనే రెండు మోడళ్లు విడుదల చేసింది. భారత మార్కెట్ పై ఎక్కువగా దృష్టిపెట్టిన ఒప్పో, కొత్తకొత్త స్మార్ట్ ఫోన్లతో ఇక్కడే తన మార్కును చూపించుకుంటోంది. ఇప్పుడు ఆర్11, ఆర్11 ప్లస్ లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

జన రంజకమైన వార్తలు