ఆన్‌లైన్ పేమెంట్ రంగంలో దూసుకుపోతున్న పేటీఎమ్ అమెజాన్ ప్రైమ్, ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌లా సరికొత్త కార్యక్రమాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘పేటీఎం ఫస్ట్’ పేరుతో ఒక వినూత్న రివార్డ్స్ , లాయల్టీ కార్యక్రమాన్ని యూజర్ల కోసం తీసుకొచ్చింది. దీనిద్వారా ఆన్ లైన్ పేమెంట్స్‌పై క్యాష్ బ్యాక్‌లు అందివ్వనుంది. ఈ కార్యక్రమం ద్వారా తన భాగస్వామ్య సంస్థల యూజర్ బేస్ ను మరింత పెంచుకోవాలని భావిస్తోంది.
ఇందుకోసం జొమాటో, గానా, ఉబర్‌తోపాటు ఓటీటీ ప్లాట్‌ఫారాలు సోనీ లివ్, ఎరోస్ నౌతో జట్టుకట్టింది. ఏడాదికి రూ.750 చెల్లించి పేటీఎం ఫస్ట్ మెంబర్‌షిప్ తీసుకుంటే పైన పేర్కొన్న సంస్థల సేవలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. సినిమా టికెట్లపై ప్రత్యేక ఆఫర్లు ఇస్తారు.
త్వరలో మరిన్ని కంపెనీల సేవలను పేటీఎం ఫస్ట్ ద్వారా అందిస్తామని పేటీఎం ఉన్నతాధికారి దీపక్ అబ్బాట్ వెల్లడించారు. పేటీఎం కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, జియో టీవీ మాదిరిగానే సొంత ఓటీటీ సర్వీసులను ప్రారంభించాలని భావిస్తున్నట్టు సమాచారం.
కాగా 'పేటీఎం ఫస్ట్' సబ్‌స్క్రిప్షన్ ధర రూ.750గా నిర్ణయించారు. ప్రారంభ ఆఫర్ కింద యూజర్లకు రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. పేటీఎం ఫస్ట్ కస్టమర్లు పేటీఎంతో పాటు పార్ట్‌నర్డ్ బ్రాండ్స్ నుంచి ప్రత్యేకమైన బెనిఫిట్స్ పొందొచ్చు.
పేటీఎం ఫస్ట్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌లో ఆన్-డిమాండ్ ఎంటర్‌టైన్‌మెంట్, టీవీ, లైవ్ క్రికెట్, మ్యూజిక్, షాపింగ్, మూవీస్, ఫుడ్ వంటి వాటిల్లో ప్రయోజనాలు పొందవచ్చు. సబ్‌స్క్రైబర్లకు 24x7 కస్టమర్ సపోర్ట్ ఉంటుంది, పేటీఎం మాల్‌లో ప్రయార్టీ షాపింగ్, రూ.12,000 కన్నా ఎక్కువ విలువైన ఆఫర్లు, అదనంగా రూ.1.500 క్యాష్‌బ్యాక్, సినిమా టికెట్లపై ప్రతీ నెల రూ.100 చొప్పున క్యాష్‌బ్యాక్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
ఒక్క పేటీఎం మాత్రమే కాకుండా యాన్యువల్ సోనీ లైవ్ సబ్‌స్క్రిప్షన్, జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్, యాన్యువల్ గానా మెంబర్‌షిప్, వ్యూ ప్రీమియం, ఎరోస్ నౌ యాన్యువల్ మెంబర్‌షిప్ బెనిఫిట్స్ లభిస్తాయి. దాంతో పాటు రూ.6,000 విలువైన ఊబెర్, రూ.2,400 విలువైన ఊబెర్ ఈట్స్ బెనిఫిట్స్ లభిస్తాయి