• తాజా వార్తలు

రైల్ దృష్టి వచ్చేసింది, రైల్వే సమస్త సమచారం ఇక మీ చేతుల్లో..

కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రయాణికులకు మంచి శుభవార్తను అందించింది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 'రైల్ దృష్టి' డ్యాష్‌బోర్డ్ పోర్టల్‌ను రైల్వే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఈ పోర్టల్ ని అట్టహాసంగా ప్రారంభించారు.రైల్ టైమ్ టేబుల్, మీరు ప్రయాణించాలనుకున్న రైలు ఎక్కడ ఉంది? ఐఆర్‌సీటీసీ కిచెన్‌లో వంటలు ఎలా వండుతున్నారు? ఇలా మొత్తం తెలుసుకోవచ్చు. 

దేశంలో ఉన్న అన్ని ఐఆర్‌సీటీసీ కిచెన్లలో అమర్చిన సీసీకెమెరా దృశ్యాలను మీరు ఈ పోర్టల్ ద్వారా లైవ్‌లో చూడొచ్చు. ప్రయాణికుల్లో ఉన్న అనుమానాలను తొలగించేందుకు, కిచెన్‌లో ఏం జరుగుతుందో ప్రయాణికులే చూసేందుకు కిచెన్ లోపలి దృశ్యాలను ప్రయాణికులు చూసే సౌకర్యం కల్పించింది రైల్వే. డిజిటల్ ఇండియా కాన్సెప్ట్‌లో భాగంగా భారతీయ రైల్వే 'రైల్ దృష్టి' డ్యాష్ బోర్డ్ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

దీని ద్వారా మీ కంప్యూటర్, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్స్, స్మార్ట్‌ఫోన్స్... ఎందులో అయినా 'రైల్ దృష్టి' డ్యాష్‌బోర్డ్ ఓపెన్ చేసి చూడొచ్చు. రైల్వేకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని రియల్‌టైమ్‌లో తెలుసుకోవచ్చు.
ఇంకో ముఖ్య విషయం  ఏంటంటే త్వరలో ఐఆర్‌సీటీసీ యాప్‌ను 'రైల్ దృష్టి' డ్యాష్ బోర్డుకు అనుసంధానించనున్నారు. ఆర్‌సీటీసీ కిచెన్‌ శుభ్రంగా ఉందా లేదా అన్నది లైవ్‌లో చూడొచ్చు. ఐఆర్‌సీటీసీ కిచెన్‌లో వంటలు ఎలా వండుతున్నారో చెక్ చేయవచ్చు.ఏదైనా కిచెన్‌లో పరిశుభ్రత కనిపించకపోతే మీరు నేరుగా raildrishti.org.in వెబ్‌సైట్‌లో మీరు కంప్లైంట్ చేయొచ్చు.

రైల్వే టైమ్ టేబుల్ తెలుసుకోవచ్చు. రైలు ఎక్కడ ఉందో లైవ్ లొకేషన్ ట్రాక్ చేయొచ్చు. పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. రైలులో ప్రతీ ఫుడ్ ప్యాకెట్‌పై బార్‌కోడ్, ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ బార్ కోడ్ స్కాన్ చేస్తే ఏ క్యాంటీన్‌లో ప్యాక్ చేశారో తెలుస్తుంది. 

జన రంజకమైన వార్తలు