• తాజా వార్తలు

కరెంటుతో సైబర్ అటాక్స్ నుంచి రక్షణ


* మిషిగాన్ యూనివర్సిటీ సైంటిస్టుల ప్రయోగాలు



సైబర్ అటాక్స్ నుంచి రక్షణ కోసం వ్యక్తుల నుంచి సంస్థల వరకు అందరూ చాలా ముందుజాగ్రత్త చర్యలు, రక్షణ చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఎన్ని చేసినా సైబర్ అటాక్స్ మాత్రం ఆగడం లేదు. అందుకే వీటిని అడ్డుకోవడం ఎలా అనే విషయంపైనా నిత్యం పరిశోధనలు జరుగుతున్నాయి. లేటెస్టుగా అమెరికాలోని మిషిగాన్ టెక్నలాజికల్ యూనివర్సిటీ స్కాలర్లు ఒక కొత్త మెథడ్ ను డెవలప్ చేశారు. అదిప్పుడు ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.

గ్రిడ్ నుంచే మొదలు
హ్యాకింగ్ తో మన కంప్యూటర్లు, ఫోన్లలోని సమాచారాన్ని దొంగిలించుకుపోయేవారిని అడ్డుకునేందుకు కరెంటే కరెక్టని అంటున్నారు మిషిగాన్ యూనివర్సిటీ స్కాలర్లు. సమాచారాన్ని దోచుకోవడానికి హ్యాకర్లు దాడి చేసే అవకాశం ఉన్న గ్యాడ్జెట్లు, పరికరాలకు విద్యుత్తు సరఫరా ద్వారానే సైబర్‌ దాడుల నుంచి రక్షణ కల్పించడం ఈ సాంకేతికత విధానం. విద్యుత్తును అందించే గ్రిడ్ల నుంచే ఈ రక్షణ ప్రక్రియ మొదలవుతుంది.

వన్ యియర్లో వచ్చేస్తుంది
దీని కోసం పవర్‌ గ్రిడ్లలో చేయాల్సిన మార్పులను కూడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సూచించారు. బ్లడ్‌ ప్రెజర్‌ను పర్యవేక్షించేంత సులభంగా ఈ ప్రక్రియ ఉంటుందని విశ్వవిద్యాలయ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ సాంకేతికత ను మరో సంవత్సర కాలంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.

జన రంజకమైన వార్తలు