దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ వచ్చేవారం గెలాక్సీ ఎస్10 సీరిస్ లో మూడు స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయబోతోంది. ఫిబ్రవరి 20న శాన్ ప్రాన్సిస్కోలో జరగనున్న MWC 2019 ఈవెంట్లో ఈ మూడు వేరియంట్లను లాంచ్ చేయనుంది. ఈ డివైస్ ల గురించి ఇప్పటికే కొన్ని రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ మూడు స్మార్ట్ ఫోన్ల ఫీచర్లను ఓ సారి పరిశీలిస్తే..
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10 మూడు వేరియంట్లలో లాంచ్ కానుందని తెలుస్తోంది. Samsung Galaxy S10+, Galaxy S10, Galaxy S10 Lite (or S10E) వేరియంట్లలో ఈ ఫోన్ లాంచ్ కానుంది. వీటితో పాటుగా గెలాక్సీ ఎఫ్ ఫోల్డబుల్ ఫోన్ ని ఈ ఈవెంట్లో ప్రదర్శనకు ఉంచే అవకాశం ఉంది. లీకయిన వివరాల ప్రకారం గెలాక్సీ ఎస్ 10 6.1 ఇంచ్ 2K+ అమోల్డ్ డిస్‌ప్లేతో, గెలాక్సీ ఎస్10 ప్లస్ 6.3 ఇంచ్ లేక 6.4 ఇంచ్ డిస్‌ప్లేతో, గెలాక్సీ ఎస్10లైట్ 5.8 ఇంచ్ డిస్‌ప్లేతో రానున్నాయి. Galaxy S10 trioలో ముందు కెమెరాలో పంచ్ హోల్ స్క్రీన్ ఉండనుంది. ఈ రకమైన ఫీచర్ ని ఇంతకుముందు గెలాక్సీ ఎ8ఎస్ లో శాంసంగ్ పొందుపరిచింది. దీన్ని Infinity-O’ display అని పిలుస్తారు.
Galaxy S10+లో పిల్ ఆకారంలో రంధ్రంతో కూడిన రెండు ఫ్రంట్ కెమెరాలు ఉండనున్నాయి. S10,S10 Liteలు మాత్రం ముందుభాగంలో కేవలం ఒక కెమెరాతోనే రానున్నాయి.Galaxy S10, S10+లు కర్వ్డ్ డిస్‌ప్లేతో, ఎస్10 ఫ్లాట్ డిస్‌ప్లేతో రానున్నట్లు లీకులు చెబుతున్నాయి. హైయర్ వేరియంట్స్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని సపోర్ట్ చేయనున్నాయి. ఈ మోడళ్లు అన్నీడస్ట్, వాటర్ రిసిస్టింట్ ఫీచర్లతో రానున్నాయి.
GSMArenaలో వచ్చిన వివరాల ప్రకారం గెలాక్సీ ఎస్10 ప్లస్, గెలాక్సీ ఎస్10 ట్రిపుల్ రేర్ కెమెరాలతో రానున్నాయి. f/2.4 apertureతో కూడిన 12 ఎంపి టెలిఫోటో లెన్స్ ఓ కెమెరాలో, రెండు కెమెరాలో f/1.5 apertureతో కూడిన 12 ఎంపి వైడ్ కెమెరా, మూడవ దానిలో f/2.2 aperture కూడిన 16 ఎంపి ఆల్ట్రా వైడ్ కెమెరా ఉండనున్నాయి. కాగా లో ఎండ్ వర్షన్ ఎస్10లైట్ లో డ్యూయెల్ రేర్ కెమెరాలు ఉండనున్నాయి. f/1.5 apertureతో కూడిన 12 ఎంపి వైడ్ కెమెరా, f/2.2 aperture కూడిన 16 ఎంపి ఆల్ట్రా వైడ్ కెమెరాలు ఉండనున్నాయి.
సెల్ఫీ కెమెరాల విషయానికి వస్తే S10+లో రెండు సెన్సార్లతో కూడిన కెమెరాలు ఉన్నాయి. f/1.9 apertureలో కూడిన 10 ఎంపి, f/2.2 apertureతో కూడిన 8 ఎంపి కెమెరాలు ముందు భాగంలో పొందుపరిచారు. ఈ మోడల్స్ అన్నీ ఆల్ట్రా సోనిక్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్లతో రాగా, లో బడ్జెట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్10 లైట్ వర్షన్ మాత్రం రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తోంది.
బ్యాటరీ విషయానికి వస్తే శాంసంగ్ గెలాక్సీ ఎస్10 ప్లస్ లో 4100 mAh బ్యాటరీ , Galaxy S10లలో 3400 mAh బ్యాటరీ, Galaxy S10 Liteలో 3100 mAh బ్యాటరీ ఉండనున్నాయి. అన్ని మోడల్స్ శాన్ ప్రాన్సిస్కోలో జరగనున్న MWC 2019 ఈవెంట్లో కనువిందు చేయనున్నాయి.