సొంతంగా డబ్బులు పెట్టి కొనుక్కున్నది ఏదైనా ఇతరులకి ఇవ్వాలంటే మనసొప్పదు. అది పుస్తకమైనా, వస్తువైనా, గేమ్స్ అయినా.. చివరకు గూగుల్ ప్లే స్టోర్‌లో కొనుక్కున్న యాప్ అయినా సరే! ఒక్కోసారి మన కుటుంబసభ్యులకు ఇవ్వాలన్నా.. కొంచెం ఆలోచిస్తాం! కానీ ఇక నుంచి మీరు ప్లే స్టోర్‌లో డబ్బులు పెట్టి కొనుక్కున్న యాప్.. కుటుంబసభ్యులతో నిరభ్యంతరంగా పంచుకోవచ్చు. ఇందుకోసం గూగుల్ ఒక సరికొత్త ఫీచర్‌ను ప్లే స్టోర్ ప్రవేశపెట్టింది. అదే గూగుల్ ప్లే ఫ్యామిలీ లైబ్రెరీ!! ఒక్క యాప్‌నే కాడు.. పుస్తకాలు, టీవీ షోలు, సినిమాలు ఇలా.. ఏదైనా ఐదుగురు కుటుంబ సభ్యులకు మాత్రం షేర్ చేయవచ్చు. మరి ఏమిటీ గూగుల్ ప్లే ఫ్యామిలీ లైబ్రెరీ అనేగా మీ సందేహం! మరి దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం!
ఏమిటీ గూగుల్ ప్లే ఫ్యామిలీ లైబ్రెరీ..
మీరు గూగుల్ ప్లే ఫ్యామిలీ లైబ్రెరీ గురించి తెలసుకోవడానికి ముందు ఎయిర్‌టెల్ ఫ్యామిలీ ప్లాన్ గురించి కొద్దిగా తెలుసుకోవాలి! ఈ ప్లాన్ గురించి వినే ఉంటారు! ఒక పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుని.. కుటుంబంలోని కొంత మంది సభ్యులతో షేర్ చేసుకోవచ్చు. తద్వారా కుటుంబ ఖర్చులు కూడా తగ్గుతాయి! సరిగ్గా ఇలానే గూగుల్ ఫ్యామిలీ లైబ్రెరీ కూడా పనిచేస్తుంది. అక్కడ రీచార్జ్ ప్లాన్స్.. ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్‌లో కొనుక్కున్న పుస్తకాలు, యాప్స్, టీవీ కార్యక్రమాలు, ఆటలు, సినిమాలు అంతే తేడా! ఒకసారి కొనుగోలు చేస్తే వాటిని గరిష్టంగా ఐదుగురు కుటుంబసభ్యుల వరకూ షేర్ చేసుకోవచ్చు. కానీ ఇందులోనూ కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఉచితంగా లభించే యాప్స్, ఇన్- యాప్ పర్చేజెస్‌ను షేర్ చేయలేం. మొదటిగా ఇందులో ఉచితంగా ఓనర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఐదుగురు కుటుంబ సభ్యులను ఇందులో జత చేయాలి.
ఫ్యామిలీ లైబ్రెరీలోకి సైన్ ఇన్ అవ్వాలంటే..
Step 1: స‌్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్‌ను ఓపెన్ చేయాలి
Step 2: ఎడమవైపు ఉన్న హామ్‌బర్గర్(మూడు అడ్డ గీతలు) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
Step 3: తర్వాత Account > Family > Sign up for Family Library ఆప్షన్‌లోకి వెళ్లాలి.
Step 4: Sign up మీద క్లిక్ చేసి.. తర్వాత స్క్రీన్‌పై వచ్చే ఆప్షన్లు నింపాలి.
Step 5: తర్వాత family payment methodని ఎంచుకోవాలి.
అకౌంట్ క్రియేట్ చేసిన వారు ఓనర్‌గా ఉంటారు. గ్రూపులోని కుటుంబసభ్యులు కొన్న వస్తువులపై పర్యవేక్షించవచ్చు. వీటిని నియంత్రించవచ్చు. కొన్నపుస్తకాలు, సినిమాలు షేర్ చేయాలంటే..(Play Store, Play Books or Play Movies & TV ఏదో ఒక ఆప్షన్‌ని ఎంచుకోవాలి > hamburger(మూడు గీతలు)ఆప్షన్ పైన క్లిక్ చేసి > My apps & games > Installed యాప్స్‌లోకి వెళ్లి.. షేర్ చేయాలనుకున్న కంటెంట్‌ని సెలెక్ట్ చేయాలి > content’s details pageలో Family Library ఆప్షన్‌ని ఎంచుకోవాలి.