మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC)అనేది స్మార్ట్‌ఫోన్ రంగాన్ని మరింత కలర్ ఫుల్ గా మార్చే వేదిక. ప్రతియేటా ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ల ప్రదర్శనకు బార్సిలోనా వేదికగా మారుతుంది. ఈ ప్రదర్శనలో స్మార్ట్‌ఫోన్ రంగంలోని దిగ్గజకంపెనీలతోపాటు..చిన్నచిన్న కంపెనీలు కూడా తమ ప్రొడక్టులను ప్రదర్శిస్తాయి. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో కొత్త కొత్త ఆవిష్కరణలు ప్రదర్శించి...వాటికి మరింత స్మార్ట్ లుక్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఈ ఏడాది 2019 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా ఎలాంటి స్మార్ట్‌ఫోన్లు ప్రదర్శనకు రానున్నాయో తెలుసుకునేందుకు ఓ స్మార్ట్ లుక్కేద్దాం.
రెడ్ మ్యాజిక్....
చైనా మొబైల్ తయారీదారు సంస్థ ZTEతన నూతన స్మార్ట్‌ఫోన్ నుబియా రెడ్ మ్యాజిక్ మార్స్ ను చైనా మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రపంచవ్యాప్తంగా ఇంకా లాంచ్ కాలేదు. ఈ ఫోన్ను గేమింగ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. బార్సిలోనాలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఈ స్మార్ట్‌ఫోన్ను లాంచ్ చేయనున్నారు.
శాంసంగ్....
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మేకర్ శాంసంగ్ తన గెలాక్సీ ఎస్ సీరిస్ లో నూతన ఫ్లాగ్ షిప్ గెలాక్సీ ఎస్10 ఎండబ్ల్యూసీ వేదికగా రిలీజ్ కానుంది. తొలిసారిగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ను యూజర్ల ముందుకు తీసుకురానుంది. స్లీక్ డిజైన్ తోపాటు ఇన్ఫినిటి-Oడిస్ ప్లే తో వస్తుంది. దీంతోపాటుగా క్లాస్-లీడింగ్ కెమెరాలు వంటి ఫీచర్లతో ఈ ఫోన్ రానుంది. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎస్10 ఫిబ్రవరి 20న మార్కెట్లోకి రిలీజ్ అయ్యింది.
షియోమీ...
మొబైల్ తయారీదారు సంస్థ షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎంఐ 9ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్, అండర్ డిస్ ప్లే, ఫింగర్ ప్రింట్ స్కానర్ కలిగి ఉంటుంది. స్నాప్ డ్రాగెన్ 855 ప్రాసెసర్ పై ఆధారితమైంది. ఈ ఫోన్...స్మార్ట్ ఫోన్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇక ఫిబ్రవరి 24న ఎంఐ మిక్స్ 5జి వేరియంట్ ను MWCవేదికగా లాంచ్ చేయనుంది.
ఒప్పో....
మొబైల్ మార్కెట్లో దూకుడుమీదున్న చైనీస్ కంపెనీ ఒప్పో త్వరలోనే దిగ్గజాలకు షాక్ ఇవ్వనుంది. నివేదికల ప్రకారం ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆప్టికల్ జూమ్ కెమెరాతో రానున్న 10ఎక్స్ ఫిబ్రవరి 23న రిలీజ్ కానుంది.
నోకియా...
HMDగ్లోబల్ సంస్థ సరికొత్త నోకియా స్మార్ట్‌ఫోన్ నోకియా 9 ప్యూర్ వ్యూను ఫిబ్రవరి 24న రిలీజ్ చేనుంది. అదే రోజు బార్సిలోనాలో జరగనున్న MWC ప్రదర్శనలో ఈ ఫోన్ను ప్రదర్శించనున్నారు. ఈ ఫోన్ కు బ్యాక్ సైడ్ 5 కెమెరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ముందు భాగంలో ఇన్ స్క్రీన్ కెమెరా కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
హువాయి....
చైన స్మార్ట్ ఫోన్ దిగ్గజం హువాయి....పి20 సీరిస్ ఒక మేజర్ కెమెరా కెపబులిటీస్ కలిగి ఉంటుంది. పి30 ట్రిపుల్ లేదా క్వాడ్ కెమెరా సెటప్ తో రానుంది. హువాయి డివైజులు కొన్ని సంవత్సరాలుగా చాలా ఫేమస్ అయ్యాయి. హువాయి పి30 సిరీస్ ఫిబ్రవరి 24న రిలీజ్ కానుంది.
వన్ ప్లస్....
చైనాకు చెందిన మొబైల్ తయారీదారు సంస్థ వన్ ప్లస్ MWCలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్ల ప్రకారం వన్ ప్లస్ 5జీ ఫోన్ మార్కెట్లోకి రానుందని తెలుస్తోంది.
సోనీ...
ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీదారి సంస్థ సోనీ...తన నూతన ఫ్లాగ్ షిప్ ఎక్స్ పీరియా XZ4ను MWC వేదికగా ఆవిష్కరించనుంది. 21:9 డిస్ ప్లేతోపాటు, స్నాప్ డ్రాగెన్ 855, పెద్ద బ్యాటరీతో ఈ ఫోన్ రానుంది. సోనీ చాలాకాలం తర్వాత క్రియేటివిటికి ప్రయత్నిస్తోంది. ఫిబ్రవరి 25న సోనీ ఎక్స్ పీరియా XZ4రిలీజ్ కానుంది.