• తాజా వార్తలు

ప్రివ్యూ - తొలిసారిగా షియోమి నుంచి రూ.4.80 లక్షల స్మార్ట్‌ఫోన్

సాధారణంగా చైనా దిగ్గజం షియోమీ నుంచి వచ్చే ఫోన్లు చాలా తక్కువ ధరను కలిగి ఉంటాయి. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే బడ్జెట్‌లో ఆ కంపెనీ స్మార్ట్‌ఫోన్లను ఎల్లప్పుడూ విక్రయిస్తుంటుంది. అయితే షియోమీ తాజాగా విడుదల చేసిన ఈ ఫోన్ ఖరీదు మాత్రం అక్షరాలా.. రూ.4.80 లక్షలు. నమ్మలేకపోయినా ఇది నిజం. షియోమి భారత మార్కెట్‌లో రెడ్‌మీ కె20, కె20 ప్రొ పేరిట రెండు నూతన స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసిన విషయం విదితమే. కాగా వీటిలో రెడ్‌మీ కె20 ప్రొ ఫోన్‌కు గాను సిగ్నేచర్ ఎడిషన్‌ను ఆ కంపెనీ విడుదల చేసింది. ఈ వేరియెంట్ ధరను రూ.4.80 లక్షలుగా నిర్ణయించారు. దీన్ని బంగారంతో తయారు చేయడం విశేషం. అలాగే ఈ ఫోన్‌పై వజ్రాలను పొందు పరిచారు. అందుకే దీనికి అంత ధరను నిర్ణయించారు. ఈ ఫోన్‌ను వచ్చే వారం నుంచి భారత మార్కెట్‌లో విక్రయిస్తారు. ఫీచర్లను ఓ సారి చూద్దాం.

రెడ్‌మీ కె20 ప్రొ సిగ్నేచర్ ఎడిషన్‌ ఫీచర్లు 
6.39 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 8, 13 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ పాపప్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

రెడ్‌మీ కె20 ప్రొ ఫీచర్లు 
ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.27,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.30,999గా ఉంది. 
6.39 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 8, 13 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ పాపప్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

రెడ్‌మీ కె20 ఫీచర్లు 
ఈ ఫోన్‌కు చెందిన 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.21,999 ఉండగా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.23,999 గా ఉంది. 
రెడ్‌మీ కె20 స్మార్ట్‌ఫోన్‌లో 6.39 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 730 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 8, 13 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

జన రంజకమైన వార్తలు