• తాజా వార్తలు

జియో యూజర్లకు శుభవార్త: రూ.399తో జియో ధన్ ధనాధన్ ఆఫర్ కొనసాగింపు

 

రిలయన్స్ జియో ఆఫర్ ఈ నెలతో ముగిసిపోతున్న తరుణంలో రిలయన్స్ మళ్లీ తన ఆఫర్లను కొనసాగించడానికి సిద్ధమైంది. పలు పాత ప్లాన్లు రివైజ్ కాగా ప్రస్తుతం కూడా రూ.19 నుంచే బేసిక్ ప్లాన్ మొదలవుతుండడం విశేషం. అత్యధికంగా రూ.9999 వరకు ప్లాన్లు ఉన్నాయి. కొన్ని ప్లాన్లు మాత్రం స్వల్పంగా మారాయి.. కొన్నిటి వేలిడిటీ మారింది.
    కొత్తగా రూ.349.. రూ.399 ప్లాన్లు యాడ్ అయ్యాయి. ధనాధన్ ఆఫర్లో ఉన్న 309, 509 ప్లాన్లు వేలిడిటీ మారింది. అయితే... ప్రస్తుతం ధనాధన్ ఆఫర్ కేవలం రూ.399 ప్లానులో మాత్రమే ఉంటుంది. 

ఇవీ ప్రీపెయిడ్ ప్లాన్లు..
* రూ.309: 
పాత ప్లానులో ఉన్న అన్ని బెనిఫిట్లూ ఇందులో ఉంటాయి. వ్యాలిడిటీ మాత్రం 28 రోజుల నుంచి 56 రోజులకు పెంచారు. 
* రూ.509:
ఇందులోనూ బెనిఫిట్లన్నీ పాత ప్లానులో ఉన్నట్లు ఉంటాయి. వ్యాలిడిటీ 56 రోజులకు పెంచారు. డాటా యూసేజ్ విషయానికొస్తే రోజుకు 2జీబీ పరిమితి ఉంది.
* రూ.349:
ఇది కొత్త ప్లాను.. ఇందులో 56 రోజుల పాటు 20 జీబీ 4జీ డాటా వస్తుంది. డాటా కంజప్షన్లో రోజుకింత అని పరిమితి ఏమీ లేదు. 
* రూ.399 ప్లాను:
ఇది దాదాపు రూ.309 ప్లాను వంటిదే అయితే, దీనికి 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.

ప్రీపెయిడ్ ప్లాన్లు విషయానికొస్తే... 
* రూ.19 ప్లానులో వేలిడిటీ ఒక్క రోజు మాత్రమే ఉంటుంది. 200 ఎంబీ 4జీ డాటా వస్తుంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్ బెనిఫిట్లు ఉంటాయి.
*  రూ.49 ప్లానులో 3 రోజుల కాలపరిమితి ఉంటుంది. 600 ఎంబీ డాటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్ బెనిఫిట్లు ఉంటాయి.
* రూ.96 ప్లానులో 7 రోజుల వేలిడిటీ, రోజుకు 1 జీబీ డాటాతో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్ బెనిఫిట్లు ఉంటాయి.
* రూ.149 ప్లాను... 28 రోజుల వాలిడిటీ. రోజుకు 2 జీబీ.. 300 ఫ్రీ ఎస్సెమ్మెస్.
* రూ.999.... 90 రోజుల కాలపరిమితి. 90 జీబీ డాటా
* రూ.1999 ప్లాను... 120 రోజుల వేలిడిటీ.. 155 జీబీ డాటా
* రూ.4999 ప్లాను.. 210 రోజుల వేలిడిటీ 380 జీబీ డాటా
* రూ.9999 ప్లాను.. 390 రోజుల వేలిడిటీ... 780 జీబీ డాటా

పోస్టు పెయిడ్ ప్లాన్లు..
రూ.309.. 349.. 399.. 509.. 999 డినామినేషన్లలో ఈ ప్లాన్లు ఉన్నాయి. వీటిలో కొన్ని మూడు నెలల కాలపరిమితి ఉన్నవే. ఇక్కడ నెల అంటే నాలుగువారాలు.. అంటే 28 రోజులు. ఆ లెక్క ప్రకారం 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.
* ఇందులో 349 ప్లానుకు రెండు నెలలు అంటే 56 రోజుల వాలిడిటీతో పాటు 20 జీబీ డాటా ఉంటుంది. 
* 399 ప్లానుకు మూడు నెలలు అంటే 84 రోజులు ఉంటుంది. రోజుకు 1 జీబీ డాటా వస్తుంది.
 

జన రంజకమైన వార్తలు