• తాజా వార్తలు

300 రూపాయ‌ల లోపు ఉన్న వాయిస్ ఓరియంటెడ్ మొబైల్ టారిఫ్‌ల‌పై ఓ చిన్న రివ్యూ

వొడాఫోన్‌తో మెర్జ‌ర్ కోసం చాలాకాలంగా సైలెంట్‌గా ఉన్న ఐడియా ఇప్పుడు ఆ ప్ర‌క్రియ పూర్త‌వ‌డంతో మ‌ళ్లీ కాంపిటీష‌న్‌లోకి వ‌చ్చింది. వొడాఫోన్‌తో క‌ల‌వ‌డంతో ఐడియాకు ఇప్పుడు 35% మార్కెట్ వాటా. ఓ వైపు జియో, మ‌రోవైపు ఎయిర్‌టెల్ టెలికం సెక్టార్‌లో హోరాహోరీగా పోరాడుతుండ‌గా ఇప్పుడు ఐడియా కూడా బ‌రిలోకి దిగింది. 300 రూపాయ‌ల్లోపు వాయిస్ ఓరియంటెడ్ ప్లాన్‌ను కొత్త‌గా ఇంట్ర‌డ్యూస్ చేసింది. ఇప్ప‌టికే జియో, ఎయిర్‌టెల్ నుంచి కూడా ఇలాంటి టారిఫ్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప‌రిస్థితుల్లో 300 రూపాయ‌ల్లోపు వాయిస్ ఓరియంటెడ్ ప్లాన్స్‌లో ఏది బెస్టో చూద్దాం.

ఐడియా 295 ప్రీపెయిడ్ ప్లాన్‌
ఐడియా తీసుకొచ్చిన ఈ కొత్త టారిఫ్‌లో ఎలాంటి డైలీ డేటా బెనిఫిట్స్ ఉండ‌వు. 42రోజుల వ్యాలిడిటీతో 5జీబీ (2జీ/ 3జీ / 4జీ) బండిల్డ్ డేటా ఇస్తుంది. దీన్ని ఈ వ్యాలిడిటీ పీరియ‌డ్‌లో ఎప్పుడైనా వాడుకోవ‌చ్చు. 5జీబీ త‌ర్వాత డేటా వాడుకోవాలంటే 10కేబీకి 4పైస‌లు క‌ట్ అవుతుంది. ఒక ఎంబీకి ఏకంగా 4 రూపాయ‌లు ఖ‌ర్చ‌వుతుంది. 

* వాయిస్ కాల్స్ అన్‌లిమిటెడ్ ఫ్రీ. అయితే రోజుకు 250 నిముషాలు, వారానికి 1000 నిముషాలు మించ‌కూడ‌దు. 

* ఒక వారంలో 100 నెంబ‌ర్ల‌కు మాత్ర‌మే కాల్ చేసుకోవ‌డానికి అవ‌కాశం ఉంది.
* వాయిస్ కాల్స్ లిమిట్ దాటాక కూడా చేస్తే నిముషానికి 1పైసా చొప్పున బిల్ ప‌డుతుంది.

* రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ. 

అలాగే 149 రూపాయ‌ల‌తో మ‌రో ప్లాన్ ఉంది. దీనిలో అన్‌లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాల్స్‌, రోజూ 100 ఎస్ఎంస్‌లు ఫ్రీ. వాలిడిటీ 21 రోజులు. 

ఎయిర్‌టెల్ 299 వాయిస్ ఓన్లీ ప్లాన్‌
ఈ ప్లాన్‌లో ఎలాంటి డేటా బెనిఫిట్స్ ఉండ‌వు. అన్‌లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాల్స్ చేసుకోవ‌చ్చు. ఎలాంటి లిమిట్ లేదు. వ్యాలిడిటీ 45 రోజులు. రోజుకు 100 ఎస్ఎంస్‌లు ఫ్రీ. 
* ఎయిర్‌టెల్ 199 ప్లాన్‌లో ఇదే ఆఫ‌ర్ 28 రోజ‌లు వ‌ర్తిస్తుంది. అయితే రోజుకు 1.4 జీబీ డేటా కూడా ఇస్తుంది.  

జియో 299 ప్లాన్ 
జియో కూడా 299 రూపాయ‌ల టారిఫ్‌తో ఓ ప్లాన్ తీసుకొచ్చింది.  ఫ్రీ వాయిస్ కాల్స్‌తోపాటు భారీగా డేటా ఆఫ‌ర్ చేస్తోంది.

* అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవ‌చ్చు.   ఎలాంటి లిమిట్ లేదు

* రోజుకు 3జీబీ డేటా ,100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ. 

* జియో మ్యూజిక్‌, జియో టీవీ లాంటి జియో యాప్స్ అన్నింటికీ సబ్‌స్క్రిప్ష‌న్ ఫ్రీ. 

*వ్యాలిడిటీ 28 రోజులు  

 

జన రంజకమైన వార్తలు