• తాజా వార్తలు

ధ‌ర‌లు పెరిగాక 1.5 జీబీ, 2జీబీ, 3జీబీ డేటా ప్లాన్స్ ఎలా ఉన్నాయి? 

ఇండియాలో మేజ‌ర్ టెలికం కంపెనీల‌న్నీ టారిఫ్‌లు పెంచేశాయి.  గ‌తంతో కంపేర్ చేస్తే క‌నీసం 20% ప్రైస్ పెరిగింది. ఈ ప‌రిస్థితుల్లో జియో, వొడాఫోన్‌, ఎయిర్‌టెల్‌లో  డేటా ప్లాన్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.  వీటి ప్లాన్స్‌లో రోజుకు 1.5 జీబీ, 2జీబీ, 3 జీబీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను ఎక్కువ‌మంది వినియోగిస్తున్నారు.  పెరిగిన ధ‌ర‌ల‌తో ప్ర‌స్తుతం జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా టారిఫ్‌ల‌న్నీ దాదాపు స‌మాన‌మైపోయినట్లే క‌నిపిస్తున్నాయి. అయితే టారిఫ్‌ప‌రంగా ఇప్ప‌టికీ ఇందులో ఏది బెస్ట్ అనే డౌట్ ఉంటే ఈ ఆర్టిక‌ల్ ఓ లుక్కేయండి. 

2 జీబీ ప్లాన్ 
జియో:
 ప్లాన్ ఖ‌రీదు 129 రూపాయ‌లు.  వ్యాలిడిటీ 28 రోజులు.  రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ. జియో టు జియో అన్‌లిమిటెడ్ ఫ్రీ.  ఇత‌ర నెట్‌వ‌ర్క్‌లకు చేసే కాల్స్ 1000 నిముషాలు ఫ్రీ.  28 రోజుల‌కు మొత్తం క‌లిపి 2జీబీ డేటా ఇస్తారు.

ఎయిర్‌టెల్‌: ప్లాన్ ఖ‌రీదు 148 రూపాయ‌లు.  వ్యాలిడిటీ 28 రోజులు.   ఎయిర్‌టెల్ టు ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ ఫ్రీ.  ఇత‌ర నెట్‌వ‌ర్క్‌లకు చేసే కాల్స్ 1000 నిముషాలు ఫ్రీ. 300 ఎస్ఎంఎస్‌లు ఉచితం. 28 రోజుల‌కు మొత్తం క‌లిపి
 2జీబీ డేటా ఇస్తారు. 
 

వొడాఫోన్ ఐడియా:  ప్లాన్ ఖ‌రీదు 149 రూపాయ‌లు.  వ్యాలిడిటీ 28 రోజులు.   వొడాఫోన్ ఐడియా టు వొడాఫోన్ ఐడియా అన్‌లిమిటెడ్ ఫ్రీ.  ఇత‌ర నెట్‌వ‌ర్క్‌లకు చేసే కాల్స్ 1000 నిముషాలు ఫ్రీ. 300 ఎస్ఎంఎస్‌లు ఉచితం.  28 రోజుల‌కు మొత్తం క‌లిపి 2జీబీ డేటా ఇస్తారు.

1.5 జీబీ/ 2జీబీ  ప్లాన్ 
జియో:
 ప్లాన్ ఖ‌రీదు 199 రూపాయ‌లు.  వ్యాలిడిటీ 28 రోజులు.  రోజుకు 1.5 జీబీ డేటా,  100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ. జియో టు జియో అన్‌లిమిటెడ్ ఫ్రీ.  ఇత‌ర నెట్‌వ‌ర్క్‌లకు చేసే కాల్స్ 1000 నిముషాలు ఫ్రీ. 

ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియాల్లో 200 రూపాయ‌ల్లోపు ధ‌ర‌లో ఇలా రోజూ డేటా ఇచ్చే ప్లాన్సేమీ లేవు.  అయితే ఎయిర్‌టెల్ 248 ప్లాన్‌లో పై సౌక‌ర్యాల‌న్నీ ఇస్తుంది.   వొడాఫోన్ 249 రూపాయ‌ల ప్లాన్‌లో కూడా ఇలాగే రోజూ 1.5 జీబీ డేటాతో ఈ సౌక‌ర్యాల‌న్నీ వ‌స్తాయి. 

రోజూ 2జీబీ డేటా
జియోలో 249 రూపాయ‌లు పెడితే  రోజూ 2 జీబీ డేటా వ‌స్తుంది. వ్యాలిడిటీ 28 రోజులు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ. జియో టు జియో అన్‌లిమిటెడ్ ఫ్రీ. ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు చేసే కాల్స్ 1000 నిముషాలు ఫ్రీ.
ఎయిర్‌టెల్‌లో రోజూ 2జీబీ డేటా ఇచ్చే సేమ్ ప్లాన్ 298 రూపాయ‌ల‌కు దొరుకుతుంది. వొడాఫోన్ ఐడియా 299 రూపాయ‌ల‌కు ఈ ప్లాన్‌ను అందిస్తోంది.  

జియోలో 3జీబీ డేటా ప్లాన్ 349కే 
జియోలో 349 రూపాయ‌ల ప్లాన్ తీసుకుంటే వ్యాలిడిటీ 28 రోజులు.  రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ. జియో టు జియో అన్‌లిమిటెడ్ ఫ్రీ.  ఇత‌ర నెట్‌వ‌ర్క్‌లకు చేసే కాల్స్ 1000 నిముషాలు ఫ్రీ.  అయితే రోజూ 3 జీబీ డేటా ఫ్రీగా ఇస్తుంది. 

1.5జీబీ/ 2జీబీ డైలీ డేటాతో మూడు నెల‌ల ప్లాన్స్‌
జియో:
 599 రూపాయ‌ల ప్లాన్ తీసుకుంటే వ్యాలిడిటీ 84 రోజులు.  రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ. జియో టు జియో అన్‌లిమిటెడ్ ఫ్రీ.  ఇత‌ర నెట్‌వ‌ర్క్‌లకు చేసే కాల్స్ 3000 నిముషాలు ఫ్రీ.  రోజూ  2 జీబీ డేటా ఫ్రీగా ఇస్తుంది. 

ఎయిర్‌టెల్‌: ప్లాన్ ఖ‌రీదు 598 రూపాయ‌లు.  వ్యాలిడిటీ 84 రోజులు.   రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ. ఎయిర్‌టెల్‌ టు ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్  కాల్స్ ఫ్రీ.  ఇత‌ర నెట్‌వ‌ర్క్‌లకు చేసే కాల్స్ 3000 నిముషాలు ఫ్రీ. రోజూ 1.5 జీబీ డేటా ఇస్తారు. 

వొడాఫోన్ ఐడియా:  ప్లాన్ ఖ‌రీదు 599 రూపాయ‌లు.  వ్యాలిడిటీ 84 రోజులు.   వొడాఫోన్ ఐడియా టు వొడాఫోన్ ఐడియా అన్‌లిమిటెడ్ కాల్స్ ఫ్రీ.  ఇత‌ర నెట్‌వ‌ర్క్‌లకు చేసే కాల్స్ 3000 నిముషాలు ఫ్రీ. రోజూ  100 ఎస్ఎంఎస్‌లు, 1.5  జీబీ డేటా ఇస్తారు.

జన రంజకమైన వార్తలు