• తాజా వార్తలు

టెలికాం స‌ర్వీసుల‌పై 18% జీఎస్టీతో అన్‌లిమిటెడ్ ప్లాన్స్ తీసుకునేవాళ్లు పెరుగుతారా?

 

 

 

దేశ‌వ్యాప్తంగా ఒకే ప‌న్ను ఉండాల‌నే ఉద్దేశంతో కేంద్ర ప్ర‌భుత్వం జులై 1 నుంచి గూడ్స్‌, స‌ర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ)ని ప్ర‌వేశ‌పెట్టింది. దీనిలో 0%, 5%, 12%, 18%, 28% అనే ఐదు శ్లాబ్‌లు ఉంటాయి. టెలికం స‌ర్వీసుల‌ను 18% శ్లాబ్ లోకి తీసుకొచ్చారు. దీంతో సెల్‌ఫోన్ బిల్లు కొద్దిగా భార‌మ‌వుతుంది. 

భారం ఇలా పెరుగుతోంది..

జులై 1వ‌ర‌కు టెలికం స‌ర్వీసుల‌పై 15% ట్యాక్స్ ఉండేది. అంటే ఉదాహ‌ర‌ణ‌కు పోస్ట్‌పెయిడ్ క‌స్ట‌మ‌ర్‌కు నెల‌కు 100 రూపాయ‌ల బిల్లు వ‌స్తే దానికి 15 రూపాయ‌ల ట్యాక్స్ క‌లిపి 115 రూపాయ‌లు క‌ట్టేవారు. ఇప్పుడు 18% ప‌న్ను విధించ‌డంతో 118 రూపాయ‌లు చెల్లించాల్సి వ‌స్తుంది. అలాగే ప్రీ పెయిడ్ యూజ‌ర్ల‌పైనా ప్ర‌భావం ప‌డింది. ఇంత‌కు ముందు  100 రూపాయ‌ల‌తో రీఛార్జి చేయించుకుంటే 13.04 పైస‌ల స‌ర్వీస్ ట్యాక్స్‌, 3రూపాయ‌ల ప్రాసెసింగ్ ఫీజు పోగా 83.96 రూపాయ‌ల టాక్‌టైం వ‌చ్చేది. ఇప్పుడు రూ.81.75 మాత్ర‌మే వ‌స్తుంది.

అన్‌లిమిటెడ్ ప్లాన్స్ తో ఏంటి లాభం?

అయితే ఇవ‌న్నీ ఈ- రీఛార్జి చేయించుకున్న‌వారికి వ‌ర్తిస్తాయి. జులై 1కు ముందు పేప‌ర్ రీఛార్జి కూప‌న్లు కొనుక్కు్న్న‌వారికి 15% ట్యాక్స్ ప‌డింది. వాటిని ఉప‌యోగించుకున్నా అదే ప‌న్ను ప‌డుతుంది. కాబ‌ట్టి అలాంటి వోచ‌ర్ల‌తో రీ చార్జి చేసుకుంటే  పాత టాక్‌టైమే వ‌స్తుంది. అలాగే అన్‌లిమిటెడ్ ప్లాన్స్‌పై ఎలాంటి ట్యాక్స్ పెంపును జీఎస్టీ కౌన్సిల్ ప్ర‌క‌టించ‌లేదు.  వాటిపై అద‌నంగా టాక్స్ ప‌డ‌డం లేదు కాబ‌ట్టి ఎక్కువ మంది యూజ‌ర్లు వీటివైపు మొగ్గు చూపే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా. 

జన రంజకమైన వార్తలు