వాహనాలు నడుపుతూ డ్రైవింగ్ చేయొద్దని ఆర్టీఏ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు నిత్యం చెబుతుంటారు. కానీ... ఇండియన్స్ మాత్రం ఏమాత్రం వినడం లేదట. తాజాగా వొడాఫోన్, సేవలైఫ్ ఫౌండేషన్లు చేసిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. భారత దేశంలో 41 శాతం మంది వాహనాలు డ్రైవింగ్ చేస్తూనే ఆఫీస్ కు సంబంధించిన పనులు ఫోన్లలో చక్కబెడుతుంటారట. అయితే.. మొత్తం యూజర్లలో 94 శాతం మందికి అలా డ్రైవింగ్ చేస్తూ ఫోన్ వాడడం చాలా ప్రమాదకరమని కూడా తెలుసట. కానీ.. తమ అలవాటును మాత్రం మార్చుకోవడం లేదు.
మరి... దీన్ని అరికట్టడం ఎలా అన్న ప్రశ్నకు వారే సమాధానం చెబుతున్నారు. నిఘా కెమేరాలు వాడాలని, అప్పుడు డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడేవారు దొరికిపోతారని 68 శాతం మంది సూచిస్తున్నారు. డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫోన్ వస్తే సురక్షితమైన ప్లేస్ లో ఆపి మాట్లాడుకునే అవకాశం ఉండడం లేదన్నది 60 శాతం మంది కంప్లయింట్.
ప్రమాదమని తెలిసినా..
మరోవైపు ఇలాంటి అలవాటు వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. 20 శాతం మంది ఇలాంటి ప్రమాదాల నుంచి కొద్దిలో తప్పించుకుంటున్నారు. 96 శాతం మంది బండి నడుపుతూ ఫోన్ వాడుతున్నప్పుడు అభద్రతగానే ఫీలవుతున్నారట.
రోడ్ సేఫ్ యాప్ చాలా యూజ్ ఫుల్
కాగా వొడాఫోన్, సేవ్ లైఫ్ ఫౌండేషన్లు కలిసి రోడ్ సేఫ్ అనే ఒక యాప్ ను రిలీజ్ చేశాయి. ఇది వాడితే వాహనం నడిపేవారి ఫోన్ కు బండి వేగం 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు కాల్స్, ఎస్సెమ్మెస్ లు రావు.