రిలయన్సు జియో దెబ్బకు దొరకని టెలికాం ఆపరేటర్లు లేరు. కానీ... అందరిలోనూ అతి తక్కువ ప్రభావితం అయిన సంస్థ ఏదైనా ఉందంటే అది బీఎస్సెన్నెల్ ఒక్కటే. జియో వచ్చిన తరువాత అన్ని సంస్థల ఆదాయం గణనీయంగా తగ్గినా బీఎస్సెన్నెల్ వార్షిక ఆదాయ వృద్ధిలో మాత్రం కేవలం 2.5 శాతమే తగ్గుదల నమోదైంది. 2016-17 సెకండ్ క్వార్టర్ తో పోల్చినప్పుడు నాలుగో క్వార్టర్లో 2.5 శాతం తగ్గుదల నమోదైంది. అతి తక్కువ నష్టాలతో బయటపడుతూ జియోను బీఎస్సెన్నెల్ ఎలా ఎదుర్కోగలిందా అంటే అందుకు కారణం వినియోగదారులే ప్రధానంగా గుర్తించి బీఎస్సెన్నెల్ తీసుకొచ్చిన అయిదు కీలక ఆఫర్లే.
రిలయన్సు జియో 2016 సెప్టెంబరులో మొదలు కాగా ఆ సంస్థ ఉచిత 4జీ సేవల దెబ్బకు మిగతా సంస్థలన్నీ బిత్తర పోయాయి. కానీ , బీఎస్సెన్నెల్ మాత్రం తాము తమ టారిఫ్ ప్లాన్లతో జియోకు సమానంగా తమ వినియోగదారులను ఆకట్టుకుంటామని తెలిపింది. అప్పటి నుంచి డాటా సెంట్రిక్ ఆఫర్ల మోత మోగించింది.
ఇవీ ఆ ఆఫర్లు...
1) ఎస్టీవీ 339
ఈ ఆఫర్ లో బీఎస్సెన్నెల్ రోజుకు 2జీబీ డాటా అందించింది. అన్ లిమిటెడ్ నెట్ కాలింగ్ ప్రకటించింది. ఆఫ్ నెట్ కాల్స్ 25 నిమిషాలు ఫ్రీగా ఇచ్చింది. బీఎస్సెన్నెల్ కు మంచి ఆదరణ ఉన్న కేరళలో ఈ ఆఫర్ బాగా వర్కవుట్ అయింది. అక్కడ ఒక్క మార్చి 19 రోజున ఏకంగా 408 టీబీ డాటాను అక్కడి బీఎస్సెన్నెల్ వినియోగదారులు కంజ్యూమ్ చేశారంటే ఈ ఆఫర్ ఎంతగా ప్రజల్లోకి వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
2) ఎస్టీవీ333
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని ప్లాన్లలోనూ ఇదే అత్యుత్తమమైంది. రోజుకు 3 జీబీ చొప్పున 90 రోజుల పాటు ఉచిత డాటా ఇందులో వస్తుంది. ఇందులో వాయిస్ కాల్స్ ఉండవు.
3) ఎయిర్ టెల్ 399, ఐడియా 447 ప్లాన్ లను టార్గెట్ చేస్తూ బీఎస్సెన్నెల్ ప్రవేశపెట్టిన ఈ ప్లాను బాగా వర్కవుట్ అయింది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్... పది వారాల పాటు రోజుకు 1జీబీ ఫ్రీ డాటా ను ఎయిర్ టెల్, ఐడియాలు ఇవ్వగా బీఎస్సెన్నెల్ వారిని మించిపోతూ బీఎస్సెన్నెల్ 71 రోజుల పాటు రోజుకు 2జీబీ డాటా ఇచ్చింది. అంతేకాదు.. బీఎస్సెన్నెల్ నుంచి బీఎస్సెన్నెల్ కు 3 వేల నిమిషాలు... ఇతర నెట్ వర్కులకు 1800 నిమిషాల వాయిస్ కాల్స్ ఇచ్చింది.
4) 1099 ప్లాన్
జియో రావడానికి ముందే బీఎస్సెన్నెల్ రానున్న పోటీని గుర్తించి అప్పటికే ఉన్న ఈ ప్లానులో మార్పులు చేసింది. అంతకుముందు 60 రోజుల పాటు రోజుకు 9జీబీ డాటా ఉండే ఈ ప్లానును మార్చి 30 రోజుల పాటు అన్ లిమిటెడ్ డాటా ఇచ్చింది.
5) 144 కాలింగ్ ప్లాన్
2017 ప్రారంభంలో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రతి రోజూ మొదటి 30 నిమిషాలు దేశంలో ఎక్కడికైనా, ఏ నెట్ వర్కుకైనా ఫ్రీ కాలింగ్ 180 రోజులకు ఇచ్చారు. ఇందులో 300 ఎంబీ డాటా ఆఫర్ కూడా ఉంది.