బీఎస్‌ఎన్‌ఎల్ పోస్ట్ పెయిడ్ మొబైల్‌ను వాడుతున్న వారికి ఇంతకు ముందు కన్నా 8 రెట్ల అదనపు మొబైల్ డేటా లభించనుంది. కొత్త ఆఫర్ ప్రకారం రూ.99 ప్లాన్‌కు 250 ఎంబీ డేటాను అందిస్తున్నారు. గతంలో ఈ ప్లాన్‌కు ఎలాంటి డేటా ఉండేది కాదు. ఇక రూ.225 ప్లాన్‌లో ఉన్న వారికి గతంలో 200 ఎంబీ డేటాను అందించగా ఇప్పుడు దాన్ని 1 జీబీకి పెంచారు. రూ.325 ప్లాన్‌లో ఉన్నవారికి గతంలో 250 ఎంబీ డేటా మాత్రమే ఇవ్వగా, ఇప్పుడు దాన్ని 2జీబీకి పెంచారు. ఇక రూ.725 ప్లాన్‌లో ఉన్నవారికి గతంలో 1 జీబీ డేటా మాత్రమే ఇచ్చారు. కాగా ఇప్పుడు దాన్ని 5 జీబీకి పెంచారు. ఇక ప్రీపెయిడ్ యూజర్ల కోసం సిక్సర్ 666 ప్లాన్ అందుబాటులో ఉంది. వారు రూ.666తో రీచార్జి చేసుకుంటే 129 జీబీ డేటా వస్తుంది. దీనికి వాలిడిటీ 60 రోజులుగా ఉంది.
అయితే... కొన్ని ప్లాన్లలో ఇప్పటికీ పోటీ సంస్థల కంటే తక్కువ డాటా వస్తోంది. రూ.99కి ప్రత్యర్థి కంపెనీలు 600 ఎంబీ వరకు 4జీ డేటాను అందిస్తున్నాయి. ఇక రూ.228 ప్లాన్‌లో 750 ఎంబీ డేటా వస్తుండగా, రూ.349 ప్లాన్‌లో రోజుకు 1జీబీ డేటాను 4జీ యూజర్లకు అందిస్తున్నాయి. ఇక రూ.799 ప్లాన్ వేసుకుంటే రోజుకు 1.5 జీబీ డేటాను 4జీ యూజర్లకు అందిస్తున్నారు.
ఇతర కంపెనీలకు చెందిన పోస్ట్ పెయిడ్ యూజర్లకు రూ.799 ప్లాన్‌లో ఏకంగా 10 జీబీ వరకు డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తున్నాయి. మరి బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించిన ఈ ఆఫర్లు కొత్తగా వినియోగదారులను సంపాదించిపెడాతయో లేదో చూడాలి.