భారత టెలికాం రంగంలో మునుపు ఎప్పుడూ లేనంత పోటీ నెలకొని ఉంది. జియో అడుగుపెట్టిన నాటి నుంచి పోటీ తీవ్ర రూపం దాల్చింది. ఒకప్పుడు మార్కెట్లో తిరుగులేని ఎయిర్‌టెల్, ఐడియా ఇప్పుడు దిగొచ్చి మరీ టారిఫ్‌లు తగ్గించాయి. అంతేకాక దీర్ఘ కాలిక ప్లాన్లనూ ఆకట్టుకునేలా ఇస్తున్నాయి. మరి అతి చవకైన దీర్ఘ కాలిక ప్లాన్‌ను ఏ నెట్‌వర్క్ అందిస్తుందో తెలుసుకుందామా!
ఎయిర్‌టెల్ ప్రిపెయిడ్ రీచార్జ్ ప్లాన్లు
ఎయిర్‌టెల్ అందిస్తున్న రీచార్జ్ ప్రిపెయిడ్ ప్లాన్ ధర రూ.1498. ఇది 365 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంది. ఇది 4జీ డేటా బెనిఫిట్‌తో 24 జీబీ అందిస్తోంది. దీనిలోనే అన్‌లిమిటెడ్ ఆన్ నెట్, ఆఫ్ నెట్ కాలింగ్ కూడా దీనిలో ఉంది. 3600 ఎస్ఎంఎస్ సదుపాయం కూడా ఆ ప్లాన్ అందిస్తోంది. వింక్ మ్యూజిక్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్రిమియం లాంటి కాంప్లిమెంటరీ ఆఫర్లు కూడా దీనిలో ఉన్నాయి. ఇందులో ఉన్న మరో ప్లాన్ రూ.2398. దీని ద్వారా రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందొచ్చు.
వొడాఫోన్-ఐడియా ప్రిపెయిడ్ ప్లాన్లు
వొడాఫోన్‌లో ఉన్న ప్రిపెయిడ్ ప్లాన్ ధర రూ.1499. ఇది ఓవరాల్‌గా 24 జీబీ డేటాను అందిస్తుంది. దీని ద్వారా 360 ఎస్ఎంఎస్‌లు పొందొచ్చు. అన్‌లిమిటెడ్ ఆన్ నెట్, ఆఫ్ నెట్ సదుపాయాన్ని పొందొచ్చు. రూ.499 విలువ గల వొడాఫోన్ ప్లే సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందొచ్చు. అంతేకాక రూ.999 విలువైన జీ5 సబ్‌స్క్రిప్షన్‌ను కూడా కాంప్లిమెంటరీగా పొందే అవకాశం ఉంది.
రిలయన్స్ జియో ప్రిపెయిడ్ ప్లాన్
అన్నిటికంటే ఆకర్షణీయమైన ప్లాన్ ఇది. దీని ద్వారా రూ.1299 ధరకు 24 జీబీ 4జీ డేటా లభిస్తుంది. ఏడాది పాటు దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీనిలో 3600 ఎస్ఎంఎస్‌లు కూడా పొందచ్చు. కాంప్లిమెంటరీగా జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందే వీలుంది. అంతేకాకుండా ఆన్ నెట్ కాలింగ్, ఆఫ్ నెట్ కాలింగ్ ఉంది. ఎఫ్‌యూపీ 12000 నిమిషాల వరకు ఉపయోగించుకునే అవకాశం ఉంది.