భారత టెలికాం రంగంలో ఇటీవల కాలంలో చాలా వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా రీఛార్జ్ టారీఫ్‌లు మార్చిన టెలికాం సంస్థలు.. కాల్ లిమిట్‌ను కూడా రిమూవ్ చేశాయి. ప్రధాన నెట్వర్క్‌లుఅయిన ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా కాల్ లిమిట్‌ను తీసేశాయ్.. మరి ఈ నెట్‌వర్క్‌లు ఎందుకు ఇలా చేశాయి. దీని వెనుక మర్మం ఏమిటి?
అప్పుడు ప్రిపెయిడ్..ఇప్పుడు కాల్ లిమిట్
డిసెంబర్ నెల ఆరంభంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా కొత్త ప్రిపెయిడ్ ప్లాన్లు అమల్లోకి తెచ్చాయి. గత ప్లాన్లతో పోల్చుకుంటే ఈ కొత్త ప్లాన్లు చాలా రేటు ఎక్కువ. ఇదే కాక వేరే నెట్‌వర్క్‌లకు కాల్ చేయాలంటే చాలా నిబంధనలు కూడా పెట్టాయి ఈ సంస్థలు. ఒకే నెట్‌వర్క్‌కు కాల్ చేసుకుంటే అన్‌లిమిటెడ్ ఆఫర్ వర్తిస్తుందని...బయట నెట్‌వర్క్‌లకు ప్రత్యేక ఛార్జ్‌లు పడతాయని ఆ సంస్థలు తెలిపాయి. ఈ మేరకు ఫెయిర్ యూసేజ్ పాలసీ (ఎఫ్‌యూపీ)ని అమల్లోకి తీసుకొచ్చాయి. ఆఫ్‌నెట్ కాల్స్‌కు ఇప్పుడు ఎఫ్‌యూపీని రిమూవ్ చేశాయి. తమ ప్యాక్‌లను అన్‌లిమిటెడ్‌గా ప్రకటించిన ఈ మూడు టెలికాం సంస్థలు..డైలీ డేటా బెనిఫిట్స్, అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా ఇచ్చాయి.
ఏమిటి దీని అర్థం?
ఇప్పుడు వినియోగదారులు లాభ పడ్డారా లేక నష్టపోయారా తెలియని స్థితి ఉంది. ప్రిపెయిడ్ ప్యాక్ రేట్లను బాగా పెంచిన టెలికాం కంపెనీలు.. కాల్స్ మీద ఎఫ్‌యూపీ లిమిట్‌ని రిమూవ్ చేయడం పెద్ద షాకే. ఎందుకంటే మనం ఇతర నెట్వర్క్‌కు కాల్ చేసినపుడు ఒక దశ వరకు ఈ ప్రిపెయిడ్ ప్యాక్ లిమిట్ వర్తిస్తుంది. ఆ లిమిట్ దాటాక అదనంగా ఛార్జీలు పడతాయి. అది కూడా నిమిషానికి 6 పైసల చొప్పున ఈ అదనపు ఛార్జీలు వేయనున్నాయి ఈ టెలికాం కంపెనీలు. అంటే వొడాఫోన్ టూ వొడాఫోన్ కాల్స్ ఉచితం. కానీ వొడాఫోన్ నుంచి ఎయిర్‌టెల్‌కు ఒక దశ వరకు మాత్రమే కాల్స్ ఉచితం అనే విషయాన్ని వినియోగదారులు గుర్తించాలి. కొన్ని నెట్వర్క్‌లలో హైయ్యర్ ఎఫ్‌యూపీ (3000 నిమిషాలు, 84 రోజులకు) కూడా అందుబాటులో ఉన్నాయి.