ఇండియాలో నెంబర్‌వన్ టెలికం నెట్‌వర్క్ ఎయిర్‌టెల్. అంతేకాదు ప్రపంచంలోనే మూడో అతి పెద్ద టెలికం నెట్‌వర్క్. 2జీ, 3జీ, 4జీ, 4జీ LTE నెట్‌వర్క్‌లు కలిగి ఉన్న ఎయిర్‌టెల్ ఎన్నో పోస్ట్‌పెయిడ్, ప్రీ పెయిడ్ ప్లాన్స్ అందిస్తుంది. ఎయిర్‌టెల్ అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్స్ అన్నింటి గురించి చెప్పే ఆర్టికల్ ఇది.
ఎయిర్‌టెల్ డేటా ప్లాన్స్
ఎయిర్‌టెల్‌లో ప్రత్యేకంగా ఇంటర్నెట్ డేటా కోసమే ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఎక్కువగా 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చినవే. అవేంటో చూడండి.
ఎయిర్‌టెల్ 53 రూపాయల డేటా రీఛార్జి
53 రూపాయలతో ఎయిర్‌టెల్ డేటా రీఛార్జి చేయించుకుంటే 75 ఎంబీ డేటా వస్తుంది. దీనికి ఎలాంటి వ్యాలిడిటీ పిరియడ్ లేదు. అంటే ఇప్పటికే మీకు డేటా ప్లాన్ ఉండి, అందులో డేటా అయిపోతే యాడ్ ఆన్ ప్యాక్‌గా మాత్రమే ఇది పనికివస్తుంది. 53 రూపాయలతో 75 ఎంబీ డేటా అంటే ఇది చాలా కాస్ట్ కాబట్టి దీన్ని వేయించుకునేవాళ్లు చాలా చాలా తక్కువ.
ఎయిర్‌టెల్ 248 రూపాయల డేటా రీఛార్జి
248 రూపాయలతో ఈ డేటా ప్లాన్ తీసుకుంటే రోజూ 1జీబీ 3జీ / 4జీ డేటా వస్తుంది. వ్యాలిడిటీ 28 రోజులు.
ఎయిర్‌టెల్ 255 రూపాయల డేటా రీఛార్జి
255 రూపాయలతో ఈ డేటా ప్లాన్ తీసుకుంటే రోజూ 1.5 జీబీ 3జీ / 4జీ డేటా వస్తుంది. వ్యాలిడిటీ 28 రోజులు.
ఎయిర్‌టెల్ 398 రూపాయల డేటా రీఛార్జి
398 రూపాయలతో ఈ డేటా ప్లాన్ తీసుకుంటే రోజూ 5జీబీ 3జీ / 4జీ డేటా వస్తుంది. వ్యాలిడిటీ 28 రోజులు.
ఎయిర్‌టెల్ 992 రూపాయల డేటా రీఛార్జి
398 రూపాయలతో ఈ డేటా ప్లాన్ తీసుకుంటే రోజూ 10 జీబీ 3జీ / 4జీ డేటా వస్తుంది. వ్యాలిడిటీ 28 రోజులు.
ఇంకా మీ రీజియన్‌లో ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ఇంటర్నెట్ డేటా ప్లాన్స్ గురించి తెలుసుకోవాలంటే మీ ఎయిర్‌టెల్ నెంబర్ నుంచి *567# డయల్ చేయండి.
ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్ ప్లాన్స్
రిలయన్స్ జియో వచ్చిన తర్వాత అన్ని కంపెనీలూ అన్ని లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లాన్స్ తీసుకురావడం తప్పనిసరయింది. అలా ఎయిర్‌టెల్ కూడా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో కొన్నిప్లాన్స్ ప్రవేశపెట్టింది. వాటి వివరాలు
ఎయిర్‌టెల్ 199 ప్యాక్
199 రూపాయలతో రీఛార్జి చేయించుకుంటే 28 రోజులపాటు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ మాట్లాడుకోవచ్చు. రోమింగ్‌లోనూ అవుట్‌గోయింగ్, ఇన్‌కమింగ్ కాల్స్ అన్‌లిమిటెడ్ ఫ్రీ. రోజుకు 100 ఎస్ఎంస్‌లు, 1.4జీబీ 3జీ/ 4జీ డేటా కూడా ఉచితం.
ఎయిర్‌టెల్ 399 ప్యాక్
399 రూపాయలతో రీఛార్జి చేయించుకుంటే 70 రోజులపాటు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ మాట్లాడుకోవచ్చు. రోమింగ్‌లోనూ అవుట్‌గోయింగ్, ఇన్‌కమింగ్ కాల్స్ అన్‌లిమిటెడ్ ఫ్రీ. రోజుకు 100 ఎస్ఎంస్‌లు, 1.4జీబీ 3జీ/ 4జీ డేటా కూడా ఉచితం.
ఎయిర్‌టెల్ 448 ప్యాక్
448 రూపాయలతో రీఛార్జి చేయించుకుంటే 82 రోజులపాటు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ మాట్లాడుకోవచ్చు. రోమింగ్‌లోనూ అవుట్‌గోయింగ్, ఇన్‌కమింగ్ కాల్స్ అన్‌లిమిటెడ్ ఫ్రీ. రోజుకు 100 ఎస్ఎంస్‌లు, 1.4జీబీ 3జీ/ 4జీ డేటా కూడా ఉచితం.
ఎయిర్‌టెల్ 509 ప్యాక్
509 రూపాయలతో రీఛార్జి చేయించుకుంటే 90 రోజులపాటు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ మాట్లాడుకోవచ్చు. రోమింగ్‌లోనూ అవుట్‌గోయింగ్, ఇన్‌కమింగ్ కాల్స్ అన్‌లిమిటెడ్ ఫ్రీ. రోజుకు 100 ఎస్ఎంస్‌లు, 1.4జీబీ 3జీ/ 4జీ డేటా కూడా ఉచితం.