రిలయన్స్ జియో.. ఇండియన్ టెలికం ఇండస్ట్రీ రూపురేఖలనే మార్చేసిన పేరు. యూజర్లకు చుక్కలు చూపిస్తున్న మొబైల్ టారిఫ్ ధరలను నేలకు దించిన పేరు. సెప్టెంబర్ నుంచి రోజుకో కొత్త ఆఫర్ తో ఫ్రీ కాల్స్, డేటా సర్వీసులతో కోట్ల మంది కస్టమర్లను సంపాదించుకున్న జియో.. సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్, జియో ధనాధన్ ఆఫర్స్ కూడా ఇంచుమించుగా జులై 15నాటికి క్లోజ్ అయిపోతాయి. ఆ తర్వాత జియో యూజర్లకు ఎలాంటి ఆఫర్లు ఉంటాయన్నది ఆసక్తికరం.
జియో సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్ వ్యాలిడిటీ జులై 15తో ముగియనుంది. ఆ తర్వాత జియో యూజర్లకు అందుబాటులో ఉన్నవి 309, 509 రూపాయల ప్లాన్లు.
* 309 రూపాయలతో రీఛార్జి చేయించుకుంటే నెలరోజులపాటు రోజూ 1జీబీ 4జీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ వస్తుంది.
* అదే 509 రూపాయలతో రీఛార్జి చేయించుకుంటే నెలరోజులపాటు రోజూ 2జీబీ 4జీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ వస్తుంది. ఈ రీఛార్జిలు చేయించుకుంటే జులై 15న సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్ ముగియగానే ఈ టారిఫ్ ఆటోమేటిక్‌గా స్టార్టవుతుంది.
జియో ధనాధన్ ఆఫర్ వేయించుకున్నవారికి 84 రోజుల తర్వాత ఆఫర్ పూర్తవుతుంది. అంటే ఇంచుమించుగా అది కూడా జులై లోగానే పూర్తవుతుంది.
కొత్త ఆఫర్లు..
నెలకు 300 లేదా 500 రీఛార్జి చేయించుకోవాలంటే చాలా మంది యూజర్లు వెనక్కి తగ్గుతారు. అదీకాక పోటీ కంపెనీలు ఇదే స్థాయిలో ఆఫర్లు ఇస్తున్నాయి కాబట్టి చాలా మంది జియోను వదిలేసే అవకాశం ఉంది. అందుకే జియో మళ్లీ ఏదైనా ఆఫర్ ప్రకటించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. జియో ధనాధన్ యూజర్లకు కొత్త ఆఫర్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక రెండో ఆప్షన్ రాబోయేది ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఆపేరుతో ఫెస్టివ్ ఆఫర్ ప్రకటించే అవకాశం కూడా ఉంది. సెప్టెంబర్ 5 జియో ఫస్ట్ యానివర్సరీ వస్తుంది. ఆ పేరుతో యానివర్సరీ ఆఫర్‌ను కూడా ప్రకటించొచ్చు. అధికారికంగా ప్రకటించకపోయినా జియో వీటి గురించి సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు సమాచారం.