• తాజా వార్తలు

BSNL అభినందన్ ప్లాన్ గురించి ఎవరికైనా తెలుసా ? 

ప్రభుత్వ రంగం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ ప్రైవేట్ టెలికం కంపెనీలకు పోటీ ఇస్తూనే దూసుకువెళుతోంది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వంటి కంపెనీల నుంచి తీవ్రమైన పోటీ ఎదురుకావడంతో తన ప్లాన్లను సవరిస్తూ కస్టమర్లను నిలుపుకునేందుకు, కొత్త యూజర్లను పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తన అభినందన్ ప్రిపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను సవరించింది. ఇప్పుడు యూజర్లకు ఎక్కువ డేటా అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా ఇకపై రోజుకు 1 జీబీ డేటా కాకుండా 1.5 జీబీ డేటా పొందొచ్చు.

బీఎస్ఎన్‌ఎల్ తన ప్లాన్ అప్‌గ్రేడ్‌తో జియో రూ.149 ప్లాన్‌కు పోటీ ఇచ్చింది. జియో రూ.149 ప్లాన్ కూడా రోజుకు 1.5 జీబీ డేటా అందిస్తోంది. 151 అభినందన్ ప్లాన్ వాలిడిటీ 24 రోజులు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. అపరిమిత కాలింగ్ సదుపాయం ఉంది.  ఇకపోతే రిలయన్స్ జియో రూ.149 ప్లాన్‌లో అపరిమిత కాలింగ్ సదుపాయం ఉంది. ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. అలాగే రోజుకు 1.5 జీబీ పొందొచ్చు. జియో యాప్స్ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

ఎయిర్‌టెల్‌ రూ.149ల ప్రీపెయిడ్‌ ప్లాన్‌పై ఇపుడు 2జీబీ 2జీబీ/3జీబీడేటాను ఆఫర్‌ చేస్తోంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 28రోజులు. రూ. 2.68కు జీబీ డేటా చొప్పున మొత్తం 56 జీబీ డేటాను కస్టమర్లకు అందిస్తోంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. అయితే పరిమితమైన చందాదారులకు కుమాత్రమే అందుబాటు ఉన్నట్టు తెలుస్తోంది.

జన రంజకమైన వార్తలు