• తాజా వార్తలు

బీఎస్‌ఎన్‌ఎల్‌ మరో కొత్త ఆఫర్‌

జియోను తట్టుకుని నిలిచిన ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ మరో ఆఫర్ తో ముందుకొచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రీపెయిడ్‌ మొబైల్‌ సర్వీసులపై కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్‌ ''బీఎస్‌ఎన్‌ఎల్‌ సిక్సర్‌-666'' కింద అపరిమిత కాలింగ్‌, రోజుకు 2జీబీ డేటాను అందిస్తారు. 
    డేటా, వాయిస్‌ రెండు అవసరమున్న కస్టమర్ల ​కోసం ఈ కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చామని,  ఈ ప్లాన్‌ కింద ఏ నెట్‌వర్క్‌కైనా 60 రోజుల పాటు వాయిస్‌ కాలింగ్‌ చేసుకోవచ్చని బీఎస్సెన్నెల్ ప్రకటించింది. అంతేకాక డేటాను కూడా వాడుకోవచ్చని చెప్పింది. ఈ 60 రోజుల తర్వాత ఇప్పటికే ఎంతో ఆకర్షణీయంగా వినియోగంలో ఉన్న  ''దిల్‌ కోల్‌ కే బోల్‌-349'', ''ట్రిపుల్‌ ఏస్‌-333'', బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకా-444'' వంటి డేటా ప్లాన్స్‌ను కస్టమర్లకు అందుబాటులో ఉంచుతారు.
    కాగా అన్ని సెగ్మంట్ల మొబైల్‌ కస్టమర్లకు నాణ్యమైన సర్వీసులను, సరసమైన ధరల్లో అందించడమే లక్ష్యంగా బీఎస్సెన్నెల్ ప్లానులు ప్రకటిస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకా-444 కింద ఇప్పటికే ఈ టెలికాం రోజుకు 4జీబీ డేటాను 90 రోజుల పాటు అందిస్తోంది. కొత్త ప్రమోషనల్‌ ఆఫర్‌ ట్రిపుల్‌​ ఏస్‌-333 కింద రోజుకు 3జీబీ డేటాను 90 రోజుల పాటు వినియోగించుకోవచ్చు. 
 

జన రంజకమైన వార్తలు