ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ సర్వీసులతోపాటు సెల్యులర్, బ్రాడ్‌బ్యాండ్ సేవలు కూడా అందిస్తోంది. దాదాపు 20 ఏళ్ల నుంచి సెల్యులర్ సర్వీసులు అందిస్తున్నా బీఎస్ఎన్ఎల్ అర్బన్ ఏరియాల్లో ఇప్పటికీ వెనకబడే ఉంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా మారుమూల గ్రామాలు, తండాల్లో కూడా మంచి నెట్‌వర్క్ ఉండడం బీఎస్ఎన్ఎల్ ప్రత్యేకత అని చెప్పాలి. దాదాపు 10 కోట్ల మంది యూజర్లున్న బీఎస్ఎన్ఎల్‌లో ఉన్న అన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్, డేటా ప్లాన్స్ వివరాలు మీకోసం..
బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ డేటా రీఛార్జి ప్లాన్స్
బీఎస్ఎన్ఎల్ 98 రూపాయల డేటా రీఛార్జి
ఈ ప్లాన్‌లో ఎలాంటి కాలింగ్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉండవు. కేవలం రోజుకు 1.5 జీబీ డేటా వస్తుంది. వ్యాలిడిటీ 26 రోజులు. ఇంటర్నెట్ కోసమే బీఎస్ఎన్ఎల్ సిమ్ వాడుకోవాలనుకుంటే ఇది మంచి ప్లాన్.
బీఎస్ఎన్ఎల్ 143 రూపాయల డేటా రీఛార్జి
బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ ప్లాన్స్‌లో ఇది ఒకటి. 143 రూపాయలతో రీఛార్జి చేసుకంటే రోజుకు 1జీబీ డేటా వస్తుంది. వ్యాలిడిటీ ఏకంగా 90 రోజులు.
బీఎస్ఎన్ఎల్ 333 రూపాయల డేటా రీఛార్జి
ఎక్కువ డేటా అవసరమనుకుంటే ఈ ప్లాన్ మంచి ఛాయిస్. 333 రూపాయలతో రీఛార్జి చేసుకుటే రోజుకు 3 జీబీ డేటా వస్తుంది. వ్యాలిడిటీ 90 రోజులు.
బీఎస్ఎన్ఎల్ 444 రూపాయల డేటా రీఛార్జి
444 రూపాయలతో రీఛార్జి చేసుకుటే రోజుకు 4 జీబీ డేటా వస్తుంది. వ్యాలిడిటీ 90 రోజులు.
బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్ ప్లాన్స్
అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తోపాటు డేటా, ఫ్రీ ఎస్ఎంఎస్‌లు కావాలనుకుంటే బీఎస్ఎన్ఎల్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్యాక్ తీసుకోవాలి.
బీఎస్ఎన్ఎల్ 99 రూపాయల ప్లాన్
బీఎస్ఎన్ఎల్ ఫోన్ వాడుతున్న యూజర్లందరికీ అత్యంత చౌకయిన రీఛార్జి ప్లాన్ ఇది. కేవలం 99 రూపాయలతో రీఛార్జి చేసుకుంటే అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. రోమింగ్‌లో కూడా వాడుకోవచ్చు. ఇందులో ఫ్రీ కాలర్ ట్యూన్స్ కూడా ఉంటాయి. అయితే ఎలాంటి డేటా ఇవ్వరు. వ్యాలిడిటీ 26 రోజులు. డేటా వాడుకోని, ఫీచర్ ఫోన్లు మాత్రమే వాడేవారికి ఈ ప్లాన్ చాలా ఉపయోగం. అయితే ఢిల్లీ, ముంబయి బేస్డ్ బీఎస్ఎన్ఎల్ యూజర్లకు మాత్రం ఈ ప్లాన్‌లో ఫ్రీ కాల్స్ చేసుకోలేం.
బీఎస్ఎన్ఎల్ 187 రూపాయల ప్లాన్
అన్‌లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాల్స్‌తోపాటు డేటా కూడా కావాలనుకుంటే ఈ ప్లాన్ వాడుకోవచ్చు. 187 రూపాయలతో రీఛార్జి చేసుకుంటే అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. రోమింగ్‌లో కూడా వాడుకోవచ్చు. ఇందులో ఫ్రీ కాలర్ ట్యూన్స్ కూడా ఉంటాయి. రోజుకు 1 జీబీ డేటా కూడా ఇస్తారు. వ్యాలిడిటీ 28 రోజులు.
బీఎస్ఎన్ఎల్ 258 రూపాయల ప్లాన్
ఎక్కువ డేటా కావాలనుకునేవారికి ఈ రీఛార్జి ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది. 258 రూపాయలతో రీఛార్జి చేసుకుంటే అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. రోమింగ్‌లో కూడా వాడుకోవచ్చు. ఇందులో ఫ్రీ కాలర్ ట్యూన్స్ కూడా ఉంటాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, రోజుకు 3 జీబీ డేటా కూడా ఇస్తారు. వ్యాలిడిటీ 51 రోజులు.
బీఎస్ఎన్ఎల్ 319 రూపాయల ప్లాన్
ఇది సేమ్ 99 రూపాయల ప్లాన్ లాంటిదే. 319 రూపాయలతో రీఛార్జి చేసుకుంటే అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. రోమింగ్‌లో కూడా వాడుకోవచ్చు. అయితే ఫ్రీ కాలర్ ట్యూన్స్, డేటా ఇవ్వరు. వ్యాలిడిటీ 90 రోజులు. డేటా వాడుకోని, ఫీచర్ ఫోన్లు మాత్రమే వాడేవారికి ఈ ప్లాన్ చాలా ఉపయోగం. అఅయితే ఢిల్లీ, ముంబయి బేస్డ్ బీఎస్ఎన్ఎల్ యూజర్లకు మాత్రం ఈ ప్లాన్‌లో ఫ్రీ కాల్స్ చేసుకోలేం.
బీఎస్ఎన్ఎల్ 349 రూపాయల ప్లాన్
349 రూపాయలతో రీఛార్జి చేసుకుంటే అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. రోమింగ్‌లో కూడా వాడుకోవచ్చు. రోజుకు1 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ. వ్యాలిడిటీ 54 రోజులు. అయితే ఢిల్లీ, ముంబయి బేస్డ్ బీఎస్ఎన్ఎల్ యూజర్లకు మాత్రం ఈ ప్లాన్‌లో ఫ్రీ కాల్స్ చేసుకోలేం.
బీఎస్ఎన్ఎల్ 666 రూపాయల ప్లాన్
666 రూపాయలతో రీఛార్జి చేసుకుంటే అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. రోమింగ్‌లో కూడా వాడుకోవచ్చు. రోజుకు 2 జీబీ డేటా కూడా ఇస్తారు. వ్యాలిడిటీ 60 రోజులు.