• తాజా వార్తలు

డాటాప్లాన్లలో రూ.500 లోపు బెస్టు ప్లాన్లు ఇవే..

ఇండియన్ టెలికాం ఇండస్ర్టీ పెద్ద టర్ను తీసుకుంది. ఇప్పుడంతా కాల్స్, ఎస్సెమ్మెస్ అని చూడకుండా డాటానే చూస్తున్నారు. దీంతో టెలికాం సంస్థలన్నీ డాటా ప్లాన్లు, ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకే ప్రయత్నం చేస్తున్నాయి. ఆఫర్లన్నీ డాటా చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇండియాలో రూ.500 లోపు ఉన్న బెస్టు డాటా ప్లాన్లేంటో చూద్దాం.
ఎయిర్ టెల్ రూ.499 ప్లాన్
పోస్టు పెయిడ్ లో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న ఎయిర్ టెల్ రూ.499 మైప్లాన్ ఇన్ఫినిటీ ప్లాన్ అన్నిటిలోకి ఉత్తమమైనదని చెప్పుకోవాలి. ఇందులో అన్ లిమిటెడ్ లోకల్ కాల్స్, రోమింగ్ ఫ్రీ ఇన్ కమింగ్ కాల్స్ ఉంటాయి. దీంతో పాటు 3000 ఎస్సెమ్మెస్ లు, ఒక బిల్ సైకిల్ లో 5జీబీ 4జీ డాటా ఉంటాయి. అయితే... కొత్తగా ఎయిర్ టెల్ లోకి వచ్చినవారికి మరో 10 జీబీ చొప్పున అదనంగా మూడు నెలల పాటు డాటా ఇస్తారు.
ఆర్ కామ్ 499
సరికొత్తగా అనౌన్స్ చేసిన ప్లాన్ ఇది. జల్సా అన్ లిమిటెడ్ 499 ప్లాన్ పేరిట ప్రవేశపెట్టిన దీనిలో ఫ్రీ ఇన్ కమింగ్, అవుట్ కమింగ్ రోమింగ్ కాల్స్ ఉంటాయి. 3 వేల ఎస్సెమ్మెస్ లు నెలకు ఫ్రీగా పంపించుకోవచ్చు. ఇది కేవలం ఆర్ కామ్ 4జీ సర్కిళ్లకు మాత్రమే పరిమితం.
ఐడియా 499
అన్ లిమిటెడ్ లోకల్, నేషనల్, రోమింగ్ ఇన్ కమింగ్ కాల్స్ ఉంటాయి. రోజుకు 100 చొప్పున నెలకు 3 వేల ఫ్రీ ఎస్సెమ్మెస్. నెలకు 5జీబీ డాటా కూడా ఉంటుంది.
వొడాఫోన్ రెడ్ 499 అన్ లిమిటెడ్
ఇందులో అన్ని లోకల్ , ఎస్టీడీ కాల్స్ ఉచితం. బిల్ సైకిల్ కు 5జీబీ డాటా, 100 ఎస్సెమ్మెస్ ఉంటాయి. కొత్త వారికి నెలకు 10 జీబీ చొప్పున మూడు నెలల పాటు ఇస్తారు.
ఆర్ కామ్ 333
ఇది కూడా కొత్తగా వచ్చిన ప్లాన్. నెలంతా అన్ లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. రోమింగ్ లో ఇన్ కమింగ్ ఫ్రీ. నెలకు 30 జీబీ డాటా, 100 ఎస్సెమ్మెస్ లు ఉంటాయి.

జన రంజకమైన వార్తలు