• తాజా వార్తలు

జియో ఫోన్ రీఛార్జి వ‌ర్సెస్ జియో ఆల్ ఇన్ వ‌న్ ప్లాన్స్‌.. ఏమిటీ వ్య‌త్యాసాలు?

ఇప్ప‌టి వ‌ర‌కు జియో నుంచి చేసే కాల్స్ అన్నీ ఉచితంగానే వెళ్లేవి. ఇంట‌ర్ క‌నెక్ట్ యూసేజ్ ఛార్జి కింద ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు జియో నుంచి చేసే కాల్స్‌కు నిమిషానికి 6 పైస‌లు ఛార్జి  చేస్తుండ‌టంతో ఇప్పుడు జియో యూజ‌ర్ల‌కు కొత్త చిక్కొచ్చిపడింది.  ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న జియో ప్లాన్స్‌లో ఇతర నెట్‌వ‌ర్క్‌ల‌కు కాల్ చేయ‌డానికి ప్ర‌త్యేకంగా అమౌంట్ ఏమీ ఉండ‌దు. అంటే జియో యూజ‌ర్ ఇప్పుడు ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు కాల్ చేయాలంటే మ‌ళ్లీ ఎంతోకొంత రీఛార్జి చేయించుకోవాలి. ఇందుకోసం జియో ఆల్ ఇన్ వ‌న్ ప్లాన్స్‌ను తీసుకొ్చ్చింది.  రూ.75, 125, 155, 185 రూపాయ‌ల ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. వీటికి ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న జియో ప్లాన్స్‌కు మ‌ధ్య‌లో ఉన్న తేడా ఏమిటో చూద్దాం.

జియో ఆల్ ఇన్ వన్75 ప్లాన్ వ‌ర్సెస్ జియో రూ.49 ప్లాన్‌
ఇప్ప‌టి వ‌ర‌కు జియోలో రూ.49 బేస్ ప్యాక్ ఉండేది. దీనిలో 28 రోజుల వ్యాలిడిటీతో జియో నుంచి జియోకు ల్యాండ్ లైన్‌కు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవ‌చ్చు. మొత్తంగా 1జీబీ డేటా ఇస్తారు. 50 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ.  అయితే జియో నుంచి ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు కాల్ చేయ‌డానికి ఎలాంటి ఫ్రీ టాక్‌టైం లేదు.  అంటే ఈ ప్యాక్‌లో ఉంటే మీరు ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు కాల్ చేసుకోవాలంటే 10, 20, 30 ఇలా టాక్‌టైం కొనుక్కోవాలి. 
జియో ఆల్ ఇన్ వన్ 75 రూపాయ‌ల ప్లాన్‌ను లేటెస్ట్‌గా లాంచ్ చేసింది. దీని వ్యాలిడిటీ 28 రోజులు. అన్‌లిమిటెడ్ జియో టు జియో  వాయిస్ కాల్స్‌, ల్యాండ్ లైన్ కాల్స్ ఉచితం. 50 ఎస్ఎంస్‌లు కూడా ఫ్రీ.  దీంతోపాటు  రోజుకు 0.1 జీబీ అంటే 100 ఎంబీ డేటా,  జియో నుంచి ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు కాల్ చేయ‌డానికి 500 ఫ్రీ మినిట్స్ ఉంటాయి.  

జియో 125 ఆల్ ఇన్‌వ‌న్ ప్లాన్ వ‌ర్సెస్ జియో రూ.99 ప్లాన్‌
జియోలో రూ.99 ప్యాక్ కూడా ఉంది. దీనిలో 28 రోజుల వ్యాలిడిటీతో జియో నుంచి జియోకు ల్యాండ్ లైన్‌కు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవ‌చ్చు.  300 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ.  రోజుకు 0.5 జీబీ డేటా ఇస్తారు. అయితే జియో నుంచి ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు కాల్ చేయ‌డానికి ఎలాంటి ఫ్రీ టాక్‌టైం లేదు.   
కొత్త‌గా లాంచ్ చేసిన జియో ఆల్ ఇన్ వన్ 125 రూపాయ‌ల ప్లాన్‌లో వ్యాలిడిటీ 28 రోజులు. అన్‌లిమిటెడ్ జియో టు జియో  వాయిస్ కాల్స్‌, ల్యాండ్ లైన్ కాల్స్ ఉచితం. 300 ఎస్ఎంస్‌లు  ఫ్రీ.  దీంతోపాటు  రోజుకు 0.5 జీబీ డేటా ఉచితం. 28 రోజుల‌కు క‌లిపి  జియో నుంచి ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు కాల్ చేయ‌డానికి 500 ఫ్రీ మినిట్స్ ఉంటాయి.  

జియో 155 ఆల్ ఇన్‌వ‌న్ ప్లాన్ వ‌ర్సెస్ జియో రూ.153 ప్లాన్‌
జియో  రూ.153 ప్యాక్ కూడా ఉంది. దీనిలో 28 రోజుల వ్యాలిడిటీతో జియో నుంచి జియోకు ల్యాండ్ లైన్‌కు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవ‌చ్చు.  రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 1.5 జీబీ డేటా ఫ్రీ.  అయితే జియో నుంచి ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు కాల్ చేయ‌డానికి ఎలాంటి ఫ్రీ టాక్‌టైం లేదు.   
కొత్త‌గా లాంచ్ చేసిన జియో ఆల్ ఇన్ వన్ 155 రూపాయ‌ల ప్లాన్‌లో వ్యాలిడిటీ 28 రోజులు. అన్‌లిమిటెడ్ జియో టు జియో  వాయిస్ కాల్స్‌, ల్యాండ్ లైన్ కాల్స్ ఉచితం. దీంతోపాటు  రోజుకు 1 జీబీ డేటా, 100 ఎస్ఎంస్‌లు  ఫ్రీ.  ఉచితం. 28 రోజుల‌కు క‌లిపి  జియో నుంచి ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు కాల్ చేయ‌డానికి 500 ఫ్రీ మినిట్స్ ఉంటాయి.  

జియో ఆల్ ఇన్ వ‌న్ 185 ప్యాక్‌
వీటితోపాటు 185 రూపాయ‌ల జియో ఆల్ ఇన్ వ‌న్ ప్లాన్‌ను కూడా లాంచ్ చేసింది.  వ్యాలిడిటీ 28 రోజులు. అన్‌లిమిటెడ్ జియో టు జియో  వాయిస్ కాల్స్‌, ల్యాండ్ లైన్ కాల్స్ ఉచితం. దీంతోపాటు  రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎంస్‌లు  ఫ్రీ.  ఉచితం. 28 రోజుల‌కు క‌లిపి  జియో నుంచి ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు కాల్ చేయ‌డానికి 500 ఫ్రీ మినిట్స్ ఉంటాయి.  దీంతో పోటీప‌డే పాత ప్లాన్సేవీ జియోలో లేవు. 

జన రంజకమైన వార్తలు