• తాజా వార్తలు

కొత్త వాలంటరీ ఈకెవైసీ ఆధార్ బేస్డ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా పని చేయనుంది?

కొత్త వాలంటరీ ఈకేవైసీ ఆధార్ బేస్డ్ వెరిఫికేషన్ ప్రాసెస్ తో....టెల్కోలు దూకుడు పెంచాయి. మొబైల్ సిమ్ కార్డ్ పొందడానికి టెలికాం ఆపరేటర్లు ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానంలో భారీ మార్పులు జరిగాయి. టెలికాం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా వంటి సంస్థలు.....ఈ కొత్త వాలంటరీ ఈకైవైసీ ఆధార్ బేస్డ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ను ప్రారంభించాయి. ఇక నుంచి యూజర్లు ఈ విధానం ద్వారా సిమ్ కార్డులు తీసుకోవాలని కూడా చెప్పాయి. అంతేకాదు తమ ఏజెంట్లకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాయి. 

QRకోడ్ కంటే ID ఫ్రూఫ్ బెట్టర్ ఆప్షన్....

ఆధార్ బేస్డ్ కస్టమర్ వెరిఫికేషన్ అనేది పెద్ద టెలికోలకు ఎక్కువ ఆధాయాన్ని తెచ్చిపెడుతుంది. ప్రత్యేకంగా గ్రామీణ మార్కెట్లో కొత్త కస్టమర్ లు ఎక్కువగా ఉంటారని క్రిసిల్ ఇండియా పరిశోధన డైరెక్టర్ హెటర్ గాంధీ తెలిపారు. ఆధార్ హ్యాండ్ సెట్ సబ్సిడీని గుర్తించే ముందు ప్రత్యేకంగా గ్రామీణ మార్కెట్లో ప్రీపెయిడ్ కస్టమర్లను ధృవీకరించడానికి టెలికాంలకు ఈజీగా ఉంటుందన్నారు. 
ముకేష్ అంబానీ నేత్రుత్వంలోని టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్...4జి ఫీచర్ ఫోన్, జీయోఫోన్ గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతం అయ్యింది. చాలామంది సబ్ స్క్రైబర్లు 4జి కుటుంబంలో చేరారు. భారతదేశ సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రాజన్ మాథ్యూస్ మాట్లాడుతూ...వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్ టెల్, రియలన్స్ జియో వంటి పెద్ద టెలికాం సంస్థలు ఈ కొత్త వాలంటరీ ఆధార్ బేస్డ్ వెరిఫికేషన్ ప్రాసెస్ పై ఆధారపడ్డాయని తెలిపారు. 

యూజర్ల కోసం వాలంటరీ eKYC ప్రాసెస్ ...
బ్యాంక్ అకౌంట్ తెరిచినప్పుడు లేదా కొత్త అనుసంధానాన్ని కొనుగోలు చేసేటప్పుడు యూజర్ తప్పనిసరిగా ఆధార్ను ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే వినియోగదారులకు ఆధార్ను ఇకెవైఈ ప్రక్రియను పూర్తిచేయడానికి వాలంటరీ ఆధార్ ను ఉపయోగించుకోవడానికి అనుమతించే ఆర్డినెన్సును మంత్రివర్గం గతవారం జారీ చేసింది. ఆధార్ ద్వారా  ధృవీకరణ ప్రక్రియ అనేది షార్ట్ ప్రక్రియగా ఉన్నందున, కస్టమర్ 
ఒక షార్ట్ ప్రొసెస్ లో ఉన్నందున, కస్టమర్ అన్ బోర్డింగ్ ప్రాసెస్ ను వేగవంతం చేస్తుందని SBICAP సెక్యూరిటీస్ కో హెడ్ రాజీశ్ శర్మ చెప్పారు. ఇది క్యూఆర్ కోడ్ తో పాటు ఐడి ఫ్రూఫ్ కంటే బెటర్ గా ఉంటుందని చెప్పారు. 

జన రంజకమైన వార్తలు