• తాజా వార్తలు

ట్రాయ్ కొత్త ఎంఎన్‌పీ రూల్స్ పాటించిన‌వాళ్లు ఏమంటున్నారు?

మ‌నం వాడుతున్న మొబైల్ నెట్‌వ‌ర్క్‌ న‌చ్చ‌న‌ప్పుడు మార్చుకునే హ‌క్కు ఉంటుంది. మొన్న‌టి వ‌ర‌కు ఇది చాలా కష్ట‌మైన విష‌య‌మే అయినా టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా దీన్ని చాలా సుల‌భం చేసేసింది. జ‌స్ట్ చిన్నఎస్ఎంఎస్ ద్వారా ఈ ప్రాసెస్ ద్వారా దీన్ని స్టార్ట్ చేయ‌చ్చు. అయితే మొబైల్ పోర్ట్‌బిలిటీ కోసం ట్రాయ్ కొత్త నిబంధ‌న‌ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. అయితే ఈ కొత్త మొబైల్ నంబ‌ర్ పోర్ట్‌బిలిటీ (ఎంఎన్‌పీ) నిబంధ‌నలు ప్ర‌కారం మొబైల్ నెట్‌వ‌ర్క్ మార్చుకోవ‌డం ఎలా?

చాలా సుల‌భం
ఇప్పుడు నెట్‌వ‌ర్క్ మార్చుకోవ‌డం చాలా సుల‌భం. ఇందుకోసం ముందుగా మ‌న‌కు సంబంధించిన మొబైల్ నంబ‌ర్ నుంచి పోర్ట్ అని మెసేజ్ టైప్ చేసి 1900 నంబ‌ర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. ఇలా చేయ‌డం ద్వారా మీకో యూనిక్ పోర్టింగ్ కోడ్ (యూపీసీ) నంబ‌ర్ వస్తుంది. మీ మొబైల్ నంబ‌ర్ పోర్టింగ్‌కు అనుకూలంగా లేక‌పోతే త‌ప్ప‌.. మీకు త‌ప్ప‌కుండా యూనిక్ పోర్టింగ్ కోడ్ ల‌భిస్తుంది. అయితే మీరు పోర్ట్ చేయాలనుకుంటే ముందుగా మీ నంబ‌ర్‌పై ఉన్న ఔట్ స్టాండింగ్ డ్యూస్‌ని క్లియ‌ర్ చేయాల్సి ఉంటుంది.  అంతేకాదు కాల్‌, మెసేజ్ చేయ‌డానికి కొంత రీఛార్జ్ కూడా చేయాల్సి ఉంటుంది. 

నాలుగు రోజుల వ్యాలిడిటీ
మ‌నం జ‌న‌రేట్ చేసిన యూనిక్ పోర్టింగ్ కోడ్ (యూపీసీ) నంబ‌ర్ కేవ‌లం నాలుగు రోజుల వ్యాలిడిటీనే ఉంటుంది.  ఈ కోడ్ వ‌చ్చాక మీకు ద‌గ్గ‌ర‌ల్లోని మీ నెట్‌వ‌ర్క్‌కు సంబంధించిన క‌స్ట‌మ‌ర్‌కేర్ సెంట‌ర్‌కు వెళ్లి క‌స్ట‌మ‌ర్ అక్విజేష‌న్ ఫామ్ డాక్యుమెంట్స్ స‌బ్‌మిట్ చేయాలి. ఈ డాక్యుమెంట్లు ఫిల్ చేయానికి మీకు యూపీసీతో పాటు ఆధార్ కార్డు కూడా కావాలి.  వ‌న్‌టైమ్ పాస్‌వ‌ర్డ్ రావ‌డానికి ఒక ఆల్ట్రనేటివ్ నెంబ‌ర్ కూడా ఇవ్వాలి. మీకు రెండో సిమ్ ఉంటే ఒకే లేదా స్నేహితులు లేదా కుటుంబ స‌భ్యుల నంబ‌ర్ ఇవ్వొచ్చు. పొర‌పాటున మీరు ఈ పోర్టింగ్ రిక్వ‌స్ట్ ఇచ్చినా.. లేదా మ‌న‌సు మ‌ర్చుకున్నా వెంట‌నే క్యాన్సిల్ అని మెసేజ్ టైప్ చేసి 1900 నంబ‌ర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. 

జన రంజకమైన వార్తలు