ఇది ఆఫర్ల కాలం. జియో పుణ్యమా అని టెలికాం కంపెనీలు ఆఫర్లు వెల్లవెత్తిస్తున్నాయి. అవి ఒకదానితో ఒకటి పోటీపడుతూ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఒకరోజు ఎయిర్‌టెల్ మా ఆఫర్ ఇదీ అని ప్రకటిస్తే ఆ రాత్రికి రాత్రే ఇడియా మరో ఆఫర్ ప్రకటిస్తోంది. ఆఫర్లకు దూరంగా ఉండి సంప్రదాయబద్ధంగా కొనసాగే బీఎస్ఎన్ఎల్ కూడా రంగంలోకి దిగింది. జియోకు పోటీగా భారీగా ఆఫర్లు ప్రకటించింది. తాజాగా ఐడియా తమ వినియోగదారుల కోసం 10 జీబీ ఆఫర్‌ను ప్రకటించింది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లను చేజారిపోనియకుండా చేసుకోవడం కోసం ఈ టెలికాం సంస్థ ప్రతి నెల 10 జీబీ డేటా ఇస్తున్నట్లు చెప్పింది. ఐతే దీని కోసం వినియోగదారులు నామినల్‌గా రూ.100 కట్టాలని షరతు పెట్టింది. ఈ ఆఫర్ కేవలం యాప్ ద్వారానే సద్వినియోగం అవుతుందని ఐడియా పేర్కొంది.
మూడు నెలలకు..
జియో సమ్మర్ ఆఫర్ రూ.303కు పోటీగానే ఐడియా ఈ కొత్త ఆఫర్‌తో ముందుకొచ్చినట్లు టెలికాం నిపుణులు అంటున్నారు. జియో సమ్మర్ ఆఫర్ ప్రకారం ప్రతిరోజూ 1 జీబీ డేటా ఫ్రీకాల్స్ పొందొచ్చు. ఇది మూడు నెలలకు వర్తిస్తుంది. అంటే నెలకు రూ.100 వినియోగదారుల దగ్గర నుంచి జియో వసూలు చేస్తోంది ట్రాయ్ నిబంధనల ప్రకారం జియో సమ్మర్ ఆఫర్‌ను రద్దు చేసింది. ఇప్పటికే ప్రైమ్‌లో సభ్యులుగా చేరి రూ.303 కట్టిన వినియోగదారులక మాత్రమే ఈ ఆఫర్‌ను వర్తింప చేస్తామని.. తాజాగా రూ.303 కడితే ఆఫర్ వర్తించదని చెప్పింది
పోటీని తట్టుకునేందుకే..
.
ఈ నేపథ్యంలో నిరాశతో ఉన్న వినియోగదారులను ఆకర్షించడానికే ఐడియా కొత్త పథకం ప్రవేశపెట్టింది. దీంతో రూ.303 కట్టని వినియోగదారులు ఐడియా వైపు మళ్లుతారనేది ఆ సంస్థ వ్యూహం. తొలి మూడు నెలలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని ఆ తర్వాత 1జీబీ డేటాను ఇదే రుసుముతో పొందచ్చని ఆ సంస్థ పేర్కొంది. ఏది ఏమైనా టెలికాం సంస్థల మధ్యపోటీ వల్ల వినియోగదారులకు లాభమే జరిగేలా ఉంది. ఐతే తమకు ఆ నెట్‌వర్క్ వాడితే లాభదాయకమే.. ఎంత మొత్తం కడితే లాభపడతామో గ్రహించి ముందుకెళ్లాలని టెలికాం నిపుణులు సూచిస్తున్నారు.