• తాజా వార్తలు

అమెజాన్ ప్రైమ్ ఏడాది పాటు ఉచితంగా పొందడమెలా ? ఐడియా కస్టమర్లు మాత్రమే

టెలికాం సంస్థ ఐడియా త‌న పోస్ట్‌పెయిడ్ క‌స్ట‌మ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ను అందిస్తున్న‌ది. రూ.399 లేదా ఆపైన విలువ గ‌ల నిర్వానా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను వాడుతున్న క‌స్ట‌మ‌ర్లు ఇప్పుడు ఏడాది కాల‌వ్య‌వ‌ధి గ‌ల అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌ను ఉచితంగా పొంద‌వ‌చ్చు. 

అందుకు గాను ఐడియా పోస్ట్‌పెయిడ్ క‌స్ట‌మ‌ర్లు ఐడియా మూవీస్ అండ్ టీవీ యాప్‌ను యాప్‌స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని త‌మ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయాలి. త‌రువాత మొబైల్ నంబర్‌ను ఎంట‌ర్ చేసి ఓటీపీ ద్వారా క‌న్‌ఫాం చేయాలి. అనంతరం వ‌చ్చే అమెజాన్ ఆఫ‌ర్‌ను ఎంచుకోవాలి. దీంతో క‌స్ట‌మ‌ర్ల‌కు ఏడాది పాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్ షిప్ ల‌భిస్తుంది..! మాములుగా అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్  పొందాలంటే ఏడాదికి రూ.999 చెల్లించాలి. 

ఐడియా సెల్యులర్ తన రూ.389 ప్లాన్‌ను సవరించిన సంగతి అందరికీ తెలిసిందే. రిలయన్స్ జియోను ఎదుర్కొనేందుకు ‘నిర్వాణ పోస్టు పెయిడ్ ప్లాన్’లో భాగంగా అందిస్తున్న మొత్తం 8 రీచార్జ్ ప్యాక్‌‌లలో అదనంగా మరింత డేటాను అందిస్తున్నట్టు తెలిపింది. రూ.499, రూ.649, రూ.999 ,రూ.389, రూ.1,299, రూ.1,699, రూ.1,999, రూ.2,999 ప్లాన్లను సవరించింది. 

గతంలో రూ.389 ప్లాన్ కింద అపరిమిత లోకల్/ఎస్టీడీ, రోమింగ్ కాల్స్‌తో పాటు నెలకు రూ.20 జీబీ డేటా అందించగా ఇప్పుడు దానిని 20 జీబీకి పెంచింది. రూ.1299 ప్లాన్‌లో గతంలో 85 జీబీ అందించగా ఇప్పుడు దానిని 100 జీబీకి పెంచింది. అలాగే రూ.1,6999 ప్లాన్‌లో 150 జీబీ, రూ.1,999 ప్లాన్‌లో 200 జీబీ, రూ.2,999 ప్లాన్‌లో 300 జీబీ అందిస్తోంది.

జన రంజకమైన వార్తలు