జియో రాకతో టెలికాం రంగంలో ఏర్పడిన కాంపిటీషన్ రోజురోజుకూ పెరుగేతోంది. యూజర్లను ఆకట్టుకునేందుకు మిగతా టెలికం ప్రొవైడర్లు ఆఫర్ల
వర్షం కురిపిస్తున్నాయి. లేటెస్ట్‌గా ఐడియా సెల్యులార్ తన యూజర్లకు బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ప్రీపెయిడ్ కస్టమర్లు 396 రూపాయలతో
రీఛార్జ్ చేసుకుంటే 70జీబీ డేటా ఇస్తోంది. దీన్ని 70 రోజులపాటు వాడుకోవచ్చు.
3వేల నిముషాలపాటు ఫ్రీ కాల్స్
ఈ రీఛార్జితో డేటాతో పాటు 3వేల నిమిషాల లోకల్, ఎస్టీడీ కాల్స్ కూడా ఐడియా ఫ్రీగా అందిస్తోంది. ఈ ఫ్రీ కాల్స్‌ను ఇతర నెట్‌వర్క్‌లకు కూడా
కాల్స్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. రోజులో 300 నిమిషాలు, వారానికి 1,200 నిమిషాలు మాత్రమే వినియోగించుకునేలా సీలింగ్ పెట్టింది. ఆ
లిమిట్ దాటితే కాల్‌కు నిముషానికి 30 పైసలు ఛార్జి పడుతుంది. డేటాకు కూడా రోజుకు 1జీబీ మాత్రమే వాడుకొనేలా లిమిట్ పెట్టారు.
జియోకు పోటీగానే..
ఆరు నెలలపాటు ఫ్రీ కాల్స్, డేటా ఇచ్చిన రిలయన్స్ జియో ఇప్పుడు 309 రూపాయలతో రీఛార్జి చేయించుకున్నవారికి మూడు నెలలపాటుయ
డేటా, ఫ్రీ కాల్స్ ఇస్తోంది. దీనికి పోటీగా తమ యూజర్ల కోసం ఐడియా ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది.