విదేశాలకు వెళ్లినప్పుడు కూడా మన ఫోన్ నెంబర్ అక్కడ వాడుకోవాలంటే రోమింగ్ ప్లాన్ తీసుకోవాలి. వీటి ఖరీదు ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేది. కంపెనీల మధ్య పోటీతోకొంత తగ్గినా ఇప్పటికీ ఎక్కువగానే ఉంది. అయితే సొంతవాళ్లతో, ఆఫీస్, బిజినెస్ పనుల నిమిత్తం నిత్యం కాంటాక్ట్‌లో ఉండాల్సినవాళ్లకు ఈ ఇంటర్నేషనల్ ప్రీపెయిడ్ రోమింగ్ ప్లాన్స్ చాలా ఉపయోగంగా ఉంటాయి. అయితే ఏయే దేశాల్లో ఈ రోమింగ్ ప్లాన్స్ పనిచేస్తాయో ముందుగానే మీ నెట్‌వర్క్ వెబ్‌సైట్‌ను గానీ లేదా కాల్ సెంటర్‌కుగానీ ఫోన్ చేసి తెలుసుకోవాలి.
ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రోమింగ్ ప్లాన్స్
మీరు విదేశాలకు వెళ్లినప్పుడు కూడా మీ ఎయిర్‌టెల్ నెంబర్ వాడుకోవాలంటే ఇంటర్నేషనల్ రోమింగ్ తీసుకోవాలి. ఇంటర్నేషనల్ రోమింగ్‌కు కూడా ఎయిర్ టెల్‌లో ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్స్ తీసుకుంటే ఆస్ట్రేలియా, బంగ్లాదే్, సింగపూర్, మలేషియా, శ్రీలంక తదితర దేశాలకు వెళ్లినా మీరు ఈ నెంబర్‌తో మీ ఫ్రెండ్స్, బంధువులతో కనెక్ట్ అయి ఉండొచ్చు.
ఎయిర్‌టెల్ 649 రోమింగ్ ప్లాన్
649 రూపాయల ఎయిర్‌టెల్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకుంటే ఒక రోజంతా ఫ్రీగా ఇన్‌కమింగ్ కాల్స్ పొందవచ్చు. అలాగే 100 నిముషాల పాటు అక్కడ నుంచి ఇండియాకు లేదా లోకల్‌గా కాల్స్ మాట్లాడుకోవచ్చు. 500 ఎంబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఫ్రీ. దీని వ్యాలిడిటీ ఒక్కరోజు మాత్రమే.
ఎయిర్‌టెల్ 2999 రోమింగ్ ప్లాన్
బిజినెస్ లేదా ఆఫీస్ పనుల మీద వెళ్లి వారం పది రోజులు విదేశాల్లో ఉండేవారికి బాగా ఉపయోగపడే ప్రీపెయిడ్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్ ఇది. 2999 రూపాయలతో ఈ ప్లాన్ తీసుకుంటే 10 రోజులపాటు ఫ్రీగా ఇన్‌కమింగ్ కాల్స్ పొందవచ్చు. అలాగే 250 నిముషాల పాటు అక్కడ నుంచి ఇండియాకు లేదా లోకల్‌గా కాల్స్ మాట్లాడుకోవచ్చు. 3జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఫ్రీ. దీని వ్యాలిడిటీ 10 రోజులు.
ఎయిర్‌టెల్ 3999 రోమింగ్ ప్లాన్
బిజినెస్ లేదా ఆఫీస్ పనుల మీద విదేశాలకు వెళ్లేవారు, లేదంటే ఉద్యోగాలు చేస్తున్న పిల్లల దగ్గరకు వెళ్లేవారు, నెల రోజులు వెకేషన్‌కు వెళ్లేవారు ఈ ప్లాన్ తీసుకుంటే ఇండియాలో ఉన్న బంధుమిత్రులతో టచ్‌లో ఉండొచ్చు. 3999 రూపాయలతో ఈ ప్లాన్ తీసుకుంటే 30 రోజులపాటు ఫ్రీగా ఇన్‌కమింగ్ కాల్స్ పొందవచ్చు. అలాగే 500 నిముషాల పాటు అక్కడ నుంచి ఇండియాకు లేదా లోకల్‌గా కాల్స్ మాట్లాడుకోవచ్చు. అంటే రోజుకు 50 నిముషాలన్నమాట. 5జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఫ్రీ. దీని వ్యాలిడిటీ 30 రోజులు.
వొడాఫోన్ ప్రీపెయిడ్ రోమింగ్ ప్లాన్స్
వొడాఫోన్‌తో ఇంటర్నేషనల్ రోమింగ్‌లో కూడా కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు. అవుట్ గోయింగ్ కాల్స్ చేయొచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రీపెయిడ్ రోమింగ్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్రీపెయిడ్ రోమింగ్ ప్లాన్స్ యూఎస్, యూఏఈ, సింగపూర్, థాయిలాండ్, మలేసియా, యూకే, న్యూజిలాండ్ వంటి 20 దేశాల్లో పనిచేస్తాయి.
41 రూపాయల రోమింగ్ ప్యాక్
దీని వ్యాలిడిటీ 28 రోజులు. రోమింగ్, హోం అవుట్ గోయింట్ కాల్స్ దీంతో సెకన్‌కు 1 పైసాకి చేసుకోవచ్చు.
56 రూపాయల రోమింగ్ ప్యాక్
దీని వ్యాలిడిటీ 28 రోజులు. ఇండియాలో ఎక్కడికెళ్లినా ఇన్‌కమింగ్ ఫ్రీ.
575 రూపాయల రోమింగ్ ప్యాక్
దీని వ్యాలిడిటీ ఒక్క రోజు మాత్రమే. ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు ఫ్రీ. 100 నిముషాలపాటు అవుట్ గోయింగ్ కాల్స్ కూడా ఫ్రీ. దీంతోపాటు 1జీబీ ఇంటర్నెట్ డేటా కూడా ఫ్రీ. అత్యవసరంగా కాల్స్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు ఈ ప్యాక్ రీఛార్జి చేయించుకుని వాడుకోవచ్చు. అంతే తప్ప ఎక్కువ రోజులు ఉండేవారికి సూటబుల్ కాదు.
673 రూపాయల రోమింగ్ ప్యాక్
దీని వ్యాలిడిటీ 10 రోజులు. ఇన్‌కమింగ్ కాల్స్ నిముషానికి 39 రూపాయలు, డేటా ఒక ఎంబీకి 39 రూపాయలు, మీరు వెళ్లిన దేశంలో అవుట్ గోయింగ్ కాల్‌కు నిముషానికి 19.5 రూపాయలు, బయటి దేశాలకు అయితే 39 రూపాయలు ఒక నిముషానికి ఛార్జ్ చేస్తుంది. అంతే కాదు మీరు ఒక ఎస్ఎంఎస్ రిసీవ్ చేసుకున్నా ఏకంగా 15 రూపాయలు ఛార్జి పడుతుంది. పెద్ద వ్యాపారవేత్తలు, కీలకమైన ఆఫీస్ వ్యవహారాల మీద విదేశాలకు వెళ్లే ఉన్నతాధికారులకు తప్ప సాధారణంగా వెకేషన్‌కు విదేశాలకువెళ్లేవారికి ఈ ప్యాక్ తీసుకుంటే బిల్లు పేలిపోవడం ఖాయం.
1151 రూపాయల రోమింగ్ ప్యాక్
దీని వ్యాలిడిటీ 2 రోజులు. ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు ఫ్రీ. 100 నిముషాలపాటు అవుట్ గోయింగ్ కాల్స్ కూడా ఫ్రీ. దీంతోపాటు 1జీబీ ఇంటర్నెట్ డేటా కూడా ఫ్రీ.
1684 రూపాయల రోమింగ్ ప్యాక్
దీని వ్యాలిడిటీ 30 రోజులు. 30 నిముషాలపాటు ఇన్‌కమింగ్ కాల్స్ ఫ్రీ. ఇది ఒక్కటి తప్ప ఈ ప్లాన్ కూడా భారీగా బిల్ చేయడం ఖాయం. ఇన్‌కమింగ్ కాల్స్ నిముషానికి 39 రూపాయలు, డేటా ఒక ఎంబీకి 39 రూపాయలు, మీరు వెళ్లిన దేశంలో అవుట్ గోయింగ్ కాల్‌కు నిముషానికి 19.5 రూపాయలు, బయటి దేశాలకు అయితే 39 రూపాయలు ఒక నిముషానికి ఛార్జ్ చేస్తుంది. అంతే కాదు మీరు ఒక ఎస్ఎంఎస్ రిసీవ్ చేసుకున్నా ఏకంగా 15 రూపాయలు ఛార్జి పడుతుంది.
1725 రూపాయల రోమింగ్ ప్యాక్
దీని వ్యాలిడిటీ 3రోజులు. ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు ఫ్రీ. 150 నిముషాలపాటు అవుట్ గోయింగ్ కాల్స్ కూడా ఫ్రీ. దీంతోపాటు 1జీబీ ఇంటర్నెట్ డేటా కూడా ఫ్రీ.
2301 రూపాయల రోమింగ్ ప్యాక్
దీని వ్యాలిడిటీ 4 రోజులు. ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు ఫ్రీ. 200 నిముషాలపాటు అవుట్ గోయింగ్ కాల్స్ కూడా ఫ్రీ. దీంతోపాటు 1జీబీ ఇంటర్నెట్ డేటా కూడా ఫ్రీ.
2875 రూపాయల రోమింగ్ ప్యాక్
దీని వ్యాలిడిటీ 7 రోజులు. ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు ఫ్రీ. 200 నిముషాలపాటు అవుట్ గోయింగ్ కాల్స్ కూడా ఫ్రీ. దీంతోపాటు 1జీబీ ఇంటర్నెట్ డేటా కూడా ఫ్రీ.
4025 రూపాయల రోమింగ్ ప్యాక్
దీని వ్యాలిడిటీ 10 రోజులు. ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు ఫ్రీ. 300 నిముషాలపాటు అవుట్ గోయింగ్ కాల్స్ కూడా ఫ్రీ. దీంతోపాటు 1జీబీ ఇంటర్నెట్ డేటా కూడా ఫ్రీ.
5751 రూపాయల రోమింగ్ ప్యాక్
దీని వ్యాలిడిటీ 28 రోజులు. ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు ఫ్రీ. 300 నిముషాలపాటు అవుట్ గోయింగ్ కాల్స్ కూడా ఫ్రీ. దీంతోపాటు 15 జీబీ ఇంటర్నెట్ డేటా కూడా ఫ్రీ.