కొత్త ఏడాది వచ్చేసింది.. మనమే కాదు అన్ని కంపెనీలు కూడా కొత్త కొత్త ప్లాన్లతో బరిలో దిగుతున్నాయి. కొత్త సంవత్సరం కొత్తగా వచ్చేస్తున్నాయి టెలిఫోన్ కంపెనీలు. కొత్త కొత్త టారిఫ్‌లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా లాంటి మెగా కంపెనీలు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లతో వచ్చాయి. మరి కొత్త సంవత్సరం వచ్చిన ఈ కొత్త ఈ ప్లాన్లలో బెస్ట్ ఏమిటో చూద్దామా..
బెస్ట్ వన్‌మంత్ ప్లాన్స్
జియో రూ.199 ప్లాన్స్
వినియోగదారులను ఆకట్టుకోవడంలో జియో ముందంజలో ఉంటుంది. దీనిలో భాగంగానే రోజుకు 1.5 జీబీతో మంత్లీ ప్రిపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది మొత్తంగాఆ 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీ డేటాతో మొత్తం 42 జీబీ డేటాను జియో అందిస్తుంది. ఈ ప్లాన్‌లో జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. నాన్‌జియో కాల్స్‌కు 1000 నిమిషాల ఎఫ్‌యూపీ ఉంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లతో పాటు కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ యాప్స్ పొందొచ్చు.
జియో రూ.249 ప్లాన్
ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2 జీబీ డేటా పొందొచ్చు. జియో ప్రిపెయిడ్ ప్లాన్ ద్వారా 56 జీబీ..28 రోజుల పాటు రోజుకు 2 జీబీ చొప్పున అందుకోవచ్చు. ఈ ప్లాన్‌లో జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. నాన్ జియో కాల్స్ కోసం 1000 మినిట్స్ ఎఫ్‌యూపీ ఉంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అన్ని జియో యాప్‌లకు యాక్సెస్ ఉంది.
ఎయిర్‌టెల్ రూ.249 డేటా
బేసిక్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ ప్లాన్ బాగా వర్కౌట్ అవుతుంది. ఫేస్‌బుక్, వాట్సప్ లాంటి వాటిని ఉపయోగించుకోవడానికి అవసరమైన డేటాను రూ.249 డేటా అందిస్తుంది. ఈ ఎయిర్‌టెల్ ప్లాన్ ప్రకారం 1.5 జీబీ రోజుకు లభిస్తుంది. 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తున్నాయి. ఈ కాల్స్ ఏ నెట్‌వర్క్‌కు అయినా ఫ్రీగా చేసుకోవచ్చు. వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్, యాప్ ప్రిమియం, ఫాస్టాగ్ ద్వారా రూ.100 క్యాష్ బ్యాక్ లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి.
వొడాఫోన్ రూ.249 ప్లాన్
ఈ వొడాఫోన్ ప్లాన్ ద్వారా రోజుకు 1.5 జీబీ డేటా పొందొచ్చు. అంతేకాక ఏ నెట్‌వర్క్‌కు అయినా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకునే సదుపాయం ఉంది. వొడాఫోన్ ప్లే, జీ5 యాప్స్‌కు 28 రోజుల పాటు ఉచితంగా సబ్‌స్క్రిప్షన్ చేసుకోవచ్చు. రూ.299 ప్లాన్‌లోనూ దాదాపు ఇవే ఆఫర్లు ఉన్నాయి. కాకపోతే రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది.
మూడు నెలల ప్లాన్లు ఇవే
జియో రూ.555 ప్లాన్
జియో రూ.599 ప్లాన్
ఎయిర్‌టెల్ రూ.598 ప్లాన్
ఎయిర్‌టెల్ రూ.698 ప్లాన్
వొడాఫోన్ రూ.699 ప్లాన్
బెస్ట్ వన్ ఇయర్ ప్లాన్స్
జియో రూ.2199 ప్లాన్
ఎయిర్‌టెల్ రూ.2398 ప్లాన్
వొడాఫోన్ రూ.2399 ప్లాన్