తన చౌక టారిఫ్‌లతో టెలికం రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది జియో. ఇప్పుడు ధరల పెరుగుదలలోనూ అదే దూకుడుతో వెళ్లింది. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు ఛార్జ్ విధించడం, టారిఫ్ పెంచడం వీటన్నింటిలో కూడా జియోనే ఫస్ట్. అయితే జియో కొత్త ప్లాన్స్ వల్ల యూజర్లకు ఏమైనా లాభాలున్నాయా? లేకుంటే ఇంతకు ముందున్నవే మంచి ప్లాన్సా అనే విశ్లేషణ మీకోసం..
జియో 199 ప్లాన్ వర్సెస్ జియో 149 ప్లాన్
మొన్నటి వరకు నడిచిన 149 రూపాయల ప్లాన్‌ను ఇప్పుడు జియో 199 రూపాయలకు పెంచింది. రెండింటి వ్యాలిడిటీ 28 రోజులే. రోజుకు 1.5 జీబీ చొప్పున 28 రోజులకు మొత్తం 42 జీబీ డేటా ఇస్తుంది. ఈ లెక్కన 149 రూపాయల ప్లాన్‌లో ఒక్కో జీబీ డేటా రూ.3.53 పైసలు పడితే 199 ప్లాన్‌లో రూ. 4.75 పైసలు పడుతుంది. రెండు ప్లాన్స్‌లోనూ జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్ ఫ్రీ. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. అయితే 149 ప్లాన్‌లో ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు ఛార్జి పడేది. 199 ప్లాన్‌లో ఇతర నెట్‌వర్క్‌లకు చేసుకోవడానికి 1000 నిముషాలు ఫ్రీగా ఇచ్చారు. ఓవరాల్‌గా చూస్తే కొత్త ప్లాన్ వల్ల పెద్దగా నష్టమేమీ లేదు.
జియో 249 ప్లాన్ వర్సెస్ జియో 222 ప్లాన్
మొన్నటి వరకు 222 రూపాయల ధర ఉన్న ప్లాన్‌ను ఇప్పుడు జియో 249 రూపాయలకు పెంచింది. రెండింటి వ్యాలిడిటీ 28 రోజులే. రోజుకు 2 జీబీ చొప్పున 28 రోజులకు మొత్తం 56 జీబీ డేటా ఇస్తుంది. ఈ లెక్కన 222 రూపాయల ప్లాన్‌లో ఒక్కో జీబీ డేటా రూ.4.40 పైసలు పడితే 199 ప్లాన్‌లో రూ. 4.45 పైసలు పడుతుంది. రెండు ప్లాన్స్‌లోనూ జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్ ఫ్రీ. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. అయితే 222 ప్లాన్‌లో ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు ఛార్జి పడేది. 249 ప్లాన్‌లో ఇతర నెట్‌వర్క్‌లకు చేసుకోవడానికి 1000 నిముషాలు ఫ్రీగా ఇచ్చారు. ఓవరాల్‌గా చూస్తే కొత్త ప్లానే బెటర్ అనిపిస్తుంది.
జియో 349 ప్లాన్ వర్సెస్ జియో 299 ప్లాన్
రోజుకు 3జీబీ డేటా ఇచ్చే ప్లాన్ ఇది. మొన్నటి వరకు నడిచిన 299 రూపాయలు ఉండేది. ఇప్పుడు 349 రూపాయలకు పెంచింది. రెండింటి వ్యాలిడిటీ 28 రోజులే. రోజుకు 3 జీబీ చొప్పున 28 రోజులకు మొత్తం 84 జీబీ డేటా ఇస్తుంది. ఈ లెక్కన 299 రూపాయల ప్లాన్‌లో ఒక్కో జీబీ డేటా రూ.3.55 పైసలు పడితే 349 ప్లాన్‌లో రూ. 4.15 పైసలు పడుతుంది. రెండు ప్లాన్స్‌లోనూ జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్ ఫ్రీ. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. అయితే 299 ప్లాన్‌లో ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు ఛార్జి పడేది. 349 ప్లాన్‌లో ఇతర నెట్‌వర్క్‌లకు చేసుకోవడానికి 1000 నిముషాలు ఫ్రీగా ఇచ్చారు. మొత్తంగా 50 రూపాయల ధర పెరిగింది. కానీ ఇతర నెట్‌వర్క్‌లకు 100 నిముషాల ఫ్రీ టాక్‌టైం ఇవ్వడం వల్ల రెండు ప్లాన్స్ దాదాపు సమానమైన ధరకే వచ్చినట్లు.
జియో 444 ప్లాన్ వర్సెస్ జియో 333 ప్లాన్
56 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్ ఇవి. మొన్నటివరకు 333 రూపాయలుగా ఉన్న ప్లాన్‌ను ఇప్పుడు ఏకంగా 111 రూపాయలు పెంచి 444 రూపాయలు చేశారు. రోజుకు 2 జీబీ చొప్పున 56 రోజులకు మొత్తం 112 జీబీ డేటా ఇస్తుంది. ఈ లెక్కన 333 రూపాయల ప్లాన్‌లో ఒక్కో జీబీ డేటా రూ.2.96 పైసలు పడితే 444 ప్లాన్‌లో రూ. 3.97 పైసలు పడుతుంది. రెండు ప్లాన్స్‌లోనూ జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్ ఫ్రీ. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. అయితే 333 ప్లాన్‌లో ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు ఛార్జి పడేది. 444 ప్లాన్‌లో ఇతర నెట్‌వర్క్‌లకు చేసుకోవడానికి 2000 నిముషాలు ఫ్రీగా ఇచ్చారు. ఇతర నెట్‌వర్క్‌లకు ఎక్కువ కాల్స్ చేసేవాళ్లకు ఉపయోగం. జియో యూజర్లకే ఎక్కువ కాల్స్ చేసుకునేవాళ్లకు మాత్రమే 111 రూపాయల భారం పడినట్లే.
జియో 599 ప్లాన్ వర్సెస్ జియో 444 ప్లాన్
84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్ ఇవి. మొన్నటివరకు 444 రూపాయలుగా ఉన్న ప్లాన్‌ను ఇప్పుడు ఏకంగా 155 రూపాయలు పెంచి 599 రూపాయలు చేశారు. రోజుకు 2 జీబీ చొప్పున 84 రోజులకు మొత్తం 168 జీబీ డేటా ఇస్తుంది. ఈ లెక్కన 444 రూపాయల ప్లాన్‌లో ఒక్కో జీబీ డేటా రూ.2.64 పైసలు పడితే 599 ప్లాన్‌లో రూ. 3.56 పైసలు పడుతుంది. రెండు ప్లాన్స్‌లోనూ జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్ ఫ్రీ. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. అయితే 444 ప్లాన్‌లో ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు ఛార్జి పడేది. 599 ప్లాన్‌లో ఇతర నెట్‌వర్క్‌లకు చేసుకోవడానికి 3000 నిముషాలు ఫ్రీగా ఇచ్చారు. ఇది కూడా ఇతర నెట్‌వర్క్‌లకు ఎక్కువ కాల్స్ చేసేవాళ్లకు ఉపయోగం. జియో యూజర్లకే ఎక్కువ కాల్స్ చేసుకునేవాళ్లకు మాత్రమే 155 రూపాయల బాదుడే.
జియో 2199 ప్లాన్ వర్సెస్ జియో 1799 ప్లాన్
ఏడాది ప్యాక్ ఇది. మొన్నటివరకు 333 రోజుల ప్యాక్1799 రూపాయలు ఉండేది. ఇప్పుడు 365 రోజుల ప్యాక్‌ను 2199 చేశారు. అంటే ఏకంగా 400 రూపాయలు పెంచేశారు. రోజుకు 2 జీబీ చొప్పున డేటా వస్తుంది. 1799 రూపాయల ప్లాన్‌లో ఒక్కో జీబీ డేటా రూ.2.67 పైసలు పడితే 599 ప్లాన్‌లో రూ.4.01 పైసలు పడుతుంది. రెండు ప్లాన్స్‌లోనూ జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్ ఫ్రీ. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. అయితే 1799 ప్లాన్‌లో ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు ఛార్జి పడేది. 2199 ప్లాన్‌లో ఇతర నెట్‌వర్క్‌లకు చేసుకోవడానికి 12000 నిముషాలు ఫ్రీగా ఇచ్చారు. ఇతర నెట్‌వర్క్‌లకు ఎక్కువ కాల్స్ చేసేవాళ్లకు ఉపయోగం. జియో యూజర్లకే ఎక్కువ కాల్స్ చేసుకునేవాళ్లకు మాత్రమే 400 అదనపు భారమే.