• తాజా వార్తలు

జియోలో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్స్‌లో మీకు న‌ప్పే ప్లాన్ ఏమిటో తెలుసుకోవాల‌నుకుంటున్నారా?

రిల‌య‌న్స్ జియో ఇండియ‌న్ మొబైల్ రంగంలో ఇప్పుడో పెద్ద భాగ‌స్వామి.  క్వాలిటీ స‌ర్వీస్‌..చీప్ రేట్‌లో ఇవ్వ‌డ‌మే జియో విజ‌య ర‌హ‌స్యం. ఇప్ప‌టికీ జియోతో పోటీప‌డే ప్రీపెయిడ్ ప్లాన్స్ మిగిలిన మొబైల్ నెట్‌వ‌ర్క్‌లు ఇవ్వ‌డం లేద‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం జియోలో ఉన్న అన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ వివ‌రాలు మీకోసం ఒకేచోట ఇస్తున్నాం. అంతేకాదు ఇందులో మీ అవ‌స‌రాల‌కు న‌ప్పే ప్లాన్ ఏమిటో కూడా విశ్లేషించాం. ఓసారి చూడండి.

జియో 19 ప్యాక్
ఒక్క‌రోజు జియో వాడి చూద్దామ‌నుకుంటున్నారా? అయితే ఈ ప్రీపెయిడ్ ప్యాక్ మీకోస‌మే. కేవ‌లం 19 రూపాయ‌ల‌తో రీఛార్జి చేసుకుంటే  ఒక రోజంతా కాల్స్ మాట్లాడుకోవ‌చ్చు. 0.5 జీబీ 4జీ డేటా, 20 ఎస్ఎంఎస్‌లు కూడా  ఫ్రీ.  

జియో 52 ప్యాక్
52 రూపాయ‌ల‌తో రీఛార్జి చేసుకుంటే  ఏడు రోజుల‌పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకొఓవ‌చ్చు. రోజుకు 0.15 జీబీ 4జీ డేటా  ఫ్రీ.  70 ఎస్ఎంస్‌లు కూడా ఉచితం. వ్యాలిడిటీ వారం రోజులు.

జియో 98 ప్యాక్
28 రోజుల వ్యాలిడిటీతో వ‌చ్చిన ప్రీపెయిడ్ ప్లాన్స్‌లో ఇదే అత్యంత చ‌వ‌కైంది. 98 రూపాయ‌ల‌తో రీఛార్జి చేసుకుంటే  28 రోజుల‌పాటు అన్‌లిమిటెడ్ వాయిస్‌ కాల్స్ చేసుకోవ‌చ్చు.  మొత్తంగా 28 రోజుల‌కు క‌లిపి 2జీబీ 4జీ డేటా, 300 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ.  కాల్స్ ఎక్కువ‌గానూ, నెట్‌తో పెద్ద‌గా ప‌నిలేద‌నుకునే సాధార‌ణ యూజ‌ర్లంద‌రికీ బాగా న‌ప్పే ప్రీపెయిడ్ ప్లాన్ ఇది.

జియో 149 ప్యాక్
అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తోపాటు రోజూ ఎక్కువ డేటా కూడా కావాల‌నుకుంటే ఈ ప్యాక్ మంచి ఆప్ష‌న్‌. 149 రూపాయ‌ల‌తో రీఛార్జి చేసుకుంటే  రోజుకు 1.5 జీబీ 4జీ డేటా  ఇస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్‌ కాల్స్ ఫ్రీ.  మొత్తంగా 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం.  వ్యాలిడిటీ 28 రోజులు.  

జియో 251 ప్యాక్
జియో సిమ్‌తో కేవ‌లం నెట్ మాత్ర‌మే వాడుకోవాల‌నుకుంటే ఈ ప్లాన్ మీకు మంచి ఆప్ష‌న్‌.  251 రూపాయ‌ల‌తో రీఛార్జి చేసుకుంటే  రోజుకు 2 జీబీ 4జీ డేటా  ఇస్తుంది. వాయిస్‌ కాల్స్, ఎస్ఎంఎస్‌లు ఏవీ రావు.  వ్యాలిడిటీ 51 రోజులు.  

జియో 299 ప్యాక్
అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తోపాటు రోజూ భారీగా డేటా ఇచ్చే ప్లాన్ ఇది. 299 రూపాయ‌ల‌తో రీఛార్జి చేసుకుంటే  రోజుకు 3 జీబీ 4జీ డేటా  ఇస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్‌ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ.  వ్యాలిడిటీ 28 రోజులు.  

జియో 349 ప్యాక్
349 రూపాయ‌ల‌తో రీఛార్జి చేసుకుంటే  రోజుకు 1.5 జీబీ 4జీ డేటా  ఇస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్‌ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ.  వ్యాలిడిటీ 70 రోజులు.  

జియో 398 ప్యాక్
398 రూపాయ‌ల‌తో రీఛార్జి చేసుకుంటే  రోజుకు 2 జీబీ 4జీ డేటా  ఇస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్‌ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ.  వ్యాలిడిటీ 70 రోజులు.  ఇది జియోలో బాగా పాపుల‌ర‌యిన రీఛార్జి ప్లాన్‌. 

జియో 399 ప్యాక్
డేటా కొద్దిగా త‌క్కువైనా వాలిడిటీ ఎక్కువ రోజులు రావాల‌నుకుంటే ఈ ప్లాన్ తీసుకోవ‌చ్చు. 399 రూపాయ‌ల‌తో రీఛార్జి చేసుకుంటే  రోజుకు 1.5 జీబీ 4జీ డేటా  ఇస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్‌ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ.  వ్యాలిడిటీ 84 రోజులు.  ఇది కూడా జియోలో బాగా పాపుల‌ర‌యిన రీఛార్జి ప్లాన్‌. 

జియో 448 ప్యాక్
డేటా, కాల్స్ కూడా ఎక్కువే వాడేవారికి మంచి ఆప్ష‌న్ ఈ ప్లాన్‌.  448 రూపాయ‌ల‌తో రీఛార్జి చేసుకుంటే  రోజుకు 2 జీబీ 4జీ డేటా  ఇస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్‌ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ.  వ్యాలిడిటీ 84 రోజులు.  

జియో 498 ప్యాక్
498 రూపాయ‌ల‌తో రీఛార్జి చేసుకుంటే  రోజుకు 2 జీబీ 4జీ డేటా  ఇస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్‌ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ.  వ్యాలిడిటీ 91 రోజులు.  

జియో 509 ప్యాక్
వ్యాలిడిటీ త‌క్కువైనా ప‌ర్లేదు డేటా భారీగా కావాల‌నుకునేవారి కోసం తీసుకొచ్చిన ప్యాక్ ఇది. 509 రూపాయ‌ల‌తో రీఛార్జి చేసుకుంటే  రోజుకు 4 జీబీ 4జీ డేటా  ఇస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్‌ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ.  వ్యాలిడిటీ 28 రోజులే కావ‌డంతో ఈ ప్లాన్ యూజ‌ర్‌కు అంత లాభం కాదు.

జియో 799 ప్యాక్
ఇది కూడా పైన చెప్పుకున్న లాంటి ప్లానే.  799 రూపాయ‌ల‌తో రీఛార్జి చేసుకుంటే  రోజుకు 5 జీబీ 4జీ డేటా  ఇస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్‌ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ.  వ్యాలిడిటీ 28 రోజులే ఉండ‌డంతో ఇది కూడా యూజ‌ర్‌కు వేస్ట్ అనే చెప్పాలి. 

జన రంజకమైన వార్తలు