రిలయన్స్ జియో చందాదారులకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసింది. ఈ మేరకు ఎంపిక చేసిన 16 ప్లాన్లపై జియో యాజమాన్యం 100 శాతం క్యాష్‌బ్యాక్ ఇవ్వనుంది. ఈ ఆసక్తికరమైన ప్లాన్లు రూ.149 నుంచి మొదలై ఏడాది చెల్లుబాటుతో రూ.9,999దాకా ఉన్నాయి. ఇంతకూ ఆ 16 ప్లాన్ల వివరాలేమిటి? ఈ క్యాష్‌బ్యాక్ బంపర్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడం ఎలా? అనుకుంటున్నారా.. జియో ప్రకటించిన 16 ప్లాన్లు ఇలా ఉన్నాయి-
అవేమిటంటే.... రూ 149, రూ.198, రూ.299, రూ.349, రూ.398, రూ.399. రూ.448, రూ.449, రూ.498, రూ.509, రూ.799, రూ.999, రూ.1699, రూ.1999, రూ.4999, రూ.9999. ఈ ప్లాన్లలో విశేషం ఏమిటంటారా.... వీటిని దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రయోజనాలు ప్రాతిపదికగా జియో రూపొందించింది.
ఆ వివరాల్లోకి వెళితే... రూ.149తో రీచార్జి చేసుకుంటే రోజుకు 1.5జీబీ వంతున 28 రోజులపాటు డేటాను వాడుకోవచ్చు. ఇక రూ.198తో రోజుకు 2 జీబీ, 28 రోజుల చెల్లుబాటు; రూ.299తో రోజుకు 3 జీబీ, 28 రోజుల చెల్లుబాటు; రూ.349తో 1.5 జీబీ, 70 రోజుల చెల్లుబాటు; రూ.398తో రోజుకు 2 జీబీ, 70 రోజుల చెల్లుబాటు; రూ.399తో రోజుకు 1.5జీబీ, 84 రోజుల చెల్లుబాటు; రూ.448తో రోజుకు 2 జీబీ, 84 రోజుల చెల్లుబాటు; రూ.449తో రోజుకు 1.5 జీబీ, 91 రోజుల చెల్లుబాటు; రూ.498తో రోజుకు 2 జీబీ, 91 రోజుల చెల్లుబాటు; రూ.509తో రోజుకు 4 జీబీ, 28 రోజుల చెల్లుబాటు; రూ.799తో రోజుకు 5 జీబీ, 28 రోజుల చెల్లుబాటు; రూ.999తో రోజుకు 60 జీబీ, 90 రోజుల చెల్లుబాటు; రూ.1,699తో రోజుకు 1.5 జీబీ, 365 రోజుల చెల్లుబాటు; రూ.1,999తో రోజుకు 125 జీబీ, 180 రోజుల చెల్లుబాటు; రూ.9,999తో రోజుకు 750 జీబీ, 365 రోజుల చెల్లుబాటు గడువుంటుంది.
క్యాష్‌బ్యాక్ పొందడానికి ప్రత్యేక నిబంధనలున్నాయా?
దీపావళి పండుగను పురస్కరించుకుని జియో ప్రకటించిన ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందుకోవాలంటే మీరు 2018 అక్టోబరు 18 నుంచి నవంబరు 30వ తేదీలోగా పైన పేర్కొన్న ప్లాన్లలో దేనితోనైనా మీ మొబైల్‌ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఏడాది డిసెంబరు 31తో క్యాష్‌బ్యాక్ కూపన్ల గడువు తీరిపోతుంది. కాబట్టి ఆ తేదీలోగా వాటిని ఉపయోగించుకోవాలి.
సూక్ష్మ అక్షరాల్లో ఆఫర్ నిబంధనలు
వినియోగదారులు- పైన చెప్పిన రీచార్జి విలువలతో దేనితోనైనా గడువులోగా రీచార్జి చేసుకున్నట్లయితే రిలయన్స్ జియో నుంచి వారికి ఆ విలువ మేరకు కూపన్లు అందుతాయి. వీటిని రిలయెన్స్ డిజిటల్ స్టోర్‌లో వస్తువులు/సేవల కొనుగోళ్లలో వినియోగించుకోవచ్చు. అయితే, కొనుగోళ్ల విలువ కనీసం రూ.5వేలు ఉన్నపుడే అవి చెల్లుబాటవుతాయి... అలాగే రెండు కూపన్లను ఒకేసారి వాడటానికి వీల్లేదు.
కూపన్లను ఎక్కడెక్కడ వాడకూడదంటే...
క్యాష్‌బ్యాక్ ఆఫర్‌కింద పొందిన కూపన్లను రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లోనే వినియోగించినా కింద పేర్కొన్న నాలుగు రకాల వస్తుసేవల కొనుగోళ్లకు మాత్రం వాడుకునే వీల్లేదు...
• క్లియర్ ట్రిప్ గిఫ్ట్ వోచర్లు/గిఫ్ట్ కార్డులు, KFC, Book My Show, Google Play & Google
• SEAGATE, WESTERN DIGITAL, SONY & LENOVO హార్డ్ డిస్కులు
• శామ్‌సంగ్ టాబ్లెట్లు
• శామ్‌సంగ్, షియోమీ ఫోన్లు