సెల్‌ఫోన్ సిగ్నల్స్.. ఫోన్ వాడే వాళ్లందరికి దీని గురించి బాగా తెలుసు. ఎందుకంటే ఈ విషయంలో అందరూ ఇబ్బందికి గురవుతారు. కావాల్సిన సమయాల్లో సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఎన్నో. దీనికి ఏదో ఒక నెట్‌వర్క్ కారణమని మనమంతా అనుకుంటాం.. ఆ నెట్‌వర్క్ ఇంతేరా అని తిట్టుకుంటాం! కానీ నెట్‌వర్క్ మాత్రమే మన సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను ప్రభావితం చేయదు. దీనికి ఎన్నో సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. మన కంటికి కనిపించని ఎన్నో రీజన్స్ దాగున్నాయి.
మీకు.. సెల్ టవర్కు మధ్య దూరం
సెల్ టవర్ దగ్గరగా ఉంటే మీకు సిగ్నల్ విషయంలో ఢోకా ఉండదు. అదే దూరంగా ఉంటే కచ్చితంగా సిగ్నల్స్ విషయంలో తేడాలు ఉంటాయి. ఎందుకంటే సెల్‌ఫోన్‌లో ఉండే రేడియో తరంగాలు ట్రావెలింగ్ చేస్తూ ఉంటాయి. వాటికి ఏమైనా అవరోధాలు ఎదురైతే డీవియేట్ అవుతాయి. వాతావరణ మార్పులకు అనుగుణంగా ఈ డీవియేషన్ ఉంటుంది. పవర్‌ఫుల్ ట్రాన్స్‌మీటర్ ద్వారా వచ్చే సిగ్నల్స్ బలం ఎక్కువగా ఉంటుంది. కానీ కొంచెం వీక్‌గా ఉండే ట్రాన్స్‌మీటర్ ద్వారా వచ్చే సిగ్నల్స్ వేరేగా ఉంటాయి. మోడ్రన్ స్మార్ట్‌ఫోన్లకు సిగ్నల్స్ పంపాలంటే ట్రాన్స్‌మీటర్లు ఎంత శక్తివంతంగా ఉండాలో ఆలోచించుకోండి. టవర్‌కు 45 మైళ్ల దూరంలో ఉన్న ఫోన్లకు కూడా సిగ్నల్స్ బాగానే వస్తాయి. అయితే దూరం పెరిగే కొద్దీ సిగ్నల్స్‌లో తేడాలుంటాయి.
అవరోధాలు ఎదురైతే అంతే..
రేడియో తరంగాలు సాధారణంగా సెల్ టవర్ నుంచి మీ ఫోన్‌కు నేరుగా చేరతాయి. కానీ వాటికి ఏమైనా అడ్డంకులు ఉంటే మాత్రం మన సెల్‌ఫోన్ సిగ్నల్స్‌లో మాత్రం హెచ్చు తగ్గలు తప్పనిసరిగా ఉంటాయి. అంటే కొన్ని ప్రాంతాల్లో కొండలు ఉంటాయి. కొండకు ఇవతలి వైపు సిగ్నల్స్ బాగానే ఉంటాయి కొండపై కూడా బాగానే ఉంటాయి. కానీ కొండకు అవతలి వైపు వెళితే మాత్రం సిగ్నల్స్ అందవు. దీనికి కారణం రేడియో తరంగాలకు అవరోధం ఏర్పడడమే. ఇలా బలమైన అవరోధాలు ఉన్న సమయంలో మనకు సిగ్నల్స్ డిస్టర్బ్ అవుతాయి.
వాతావరణం కూడా...
మన సెల్‌ఫోన్ సిగ్నల్స్‌పై వాతావారణ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఎలాంటి వర్షం లేకుండా మబ్బులు నిర్మలంగా ఉన్నప్పుడు సెల్‌ఫోన్ సిగ్నల్స్ బ్రహ్మాండంగా వస్తాయి. అదే వర్షం పడుతున్నప్పుడు, ఈదురు గాలులు వీస్తున్నప్పుడు, లేదా దట్టమైన పొగమంచు కమ్మినప్పుడు సిగ్నల్స్ డ్రాప్ అయిపోతాయి. ఈ తేడాలను మీ స్పష్టంగా గమనించొచ్చు. థండర్ స్ట్రామ్ ఉన్నప్పుడు రేడియో తరంగాలు వాటి నుంచి చొచ్చకుని వెళ్లలేవు. విపరీతమైన వర్షం ఉన్నప్పుడు కూడా ఇదే కారణంతో సిగ్నల్స్ పడిపోతాయి.