• తాజా వార్తలు

జియో సమ్మర్ ఆఫర్ బ్రేక్ కు కారణం ఇదీ..

జియో ప్రకటించిన సమ్మర్ ఆఫర్ వినియోగదారులకు ఎంతో ఊరటనిచ్చింది. కానీ... టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా దాన్ని నిలిపివేయాలని సూచించడంతో రిలయన్సు జియో దాన్ని వెనక్కు తీసుకుంది. ఇదంతా తెలిసిన విషయమే.. కానీ, ట్రాయ్ ఎందుకు ఇలాంటి సూచన చేసింది? నిలిపివేయడానికి కారణం ఏంటన్నది చూస్తే నిబంధనల ఉల్లంఘనే కారణమని అర్థమవుతోంది. ట్రాయ్ కూడా అదేమాట చెబుతోంది.
ఏమాత్రం సంతృప్తి చెందని ట్రాయ్
నిబంధనలకు అనుగుణంగా లేనందునే సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ ఆఫర్‌ ఉపసంహరించాలని రిలయన్స్‌ జియోను ఆదేశించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ఛైర్మన్‌ వెల్లడించారు. ఈ పథకం గురించి ఈ నెల 1వ తేదీనే జియోను వివరాలు అడిగామని.. దీనిపై చర్చించేందుకు ఈనెల 5న వారిని ఆహ్వానించాయపిజజ ఈ పథకం నిబంధనలకు అనుగుణంగా ఎలా ఉందో వెల్లడించాలని కోరామని.. అయితే జియో వివరణ సంతృప్తికరంగా లేదని ట్రాయ్ వర్గాలు చెబుతున్నాయి. ‘గతంలో జియో సేవల ఆరంభంలో, ప్రచార ప్రణాళిక కింద ఉచితంగా సేవలు అందించారు. అనంతరం కొన్ని మార్పులతో మార్చి 31 వరకు కొనసాగించారు. ఇప్పుడు సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ ఆఫర్‌ కింద ప్రస్తుత టారిఫ్‌ పథకాలకే ప్రత్యేక ప్రోత్సాహకంగా ఇస్తున్నామని జియో తెలిపింది. ప్రస్తుత నిబంధనావళికి ఇది అనుగుణంగా లేదు’ అని ట్రాయ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇప్పటికే ఈ ఆఫర్‌కు రుసుము చెల్లించిన వారికి, పథక ప్రయోజనాలు జూన్‌ ఆఖరు వరకు వర్తిస్తాయని ట్రాయ్‌ స్పష్టత ఇచ్చింది. సాధ్యమైనంత త్వరగా ఈ పథకాన్ని జియో ఉపసంహరించాలని సూచించింది. అయితే ఈనెల 15 వరకు సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ కొనసాగే వీలు లేదని స్పష్టం చేసింది.
ట్రాయ్ ది మెతక వైఖరా?
కాగా ఇతర టెలికాం సంస్థలు జియో విషయంలో ట్రాయ్ అనుసరించిన వైఖరిపై ఇంకా కాస్త గుర్రుగానే ఉన్నాయట. ఆఫర్ వెనక్కు తీసుకోవాలని చెప్పడంపై సంతోషంగానే ఉన్నా కూడా ట్రాయ్ తన పూర్తి అధికారాలు వినియోగించలేదన్నది వాటి వాదన. ట్రాయ్ కేవలం జియోను సూచించిందే కానీ ఆదేశాలు జారీ చేయలేదని వారు గుర్తు చేస్తున్నారు. రిలయన్స్ జియో విషయంలో ఎందుకింత మెతగ్గా వ్యవహరిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

జన రంజకమైన వార్తలు