• తాజా వార్తలు

జియో సెలబ్రేషన్ ప్యాక్‌ ద్వారా ఉచిత డేటాను అందుకోండి 

దేశీయ టెలికాం మార్కెట్లో ముచ్చెమటలు పట్టిస్తున్న రిలయన్స్ జియో మళ్లీ సరికొత్తగా మార్కెట్లోకి దూసుకువచ్చింది. గత ఏడాది సెప్టెంబర్‌లో రిలయన్స్ జియో రెండో వార్షికోత్సవం సందర్భంగా సెలబ్రేషన్ ఆఫర్‌ను ప్రకటించిన జియో.. తాజాగా ఇదే ఆఫర్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చింది. 

జియో సెలబ్రేషన్ ప్యాక్ ప్రకారం.. యూజర్లకు రోజుకు 2జీబీ డేటాను ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్ నేటి నుంచి నుంచి మార్చి 17 వరకు జియో ప్రైమ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. జియో యూజర్లు ఈ ఆఫర్‌తో రోజుకు 2 జీబీ డేటా అంటే మూడు రోజుల వరకు 6 జీబీ డేటాను ఉచితంగా పొందొచ్చు. ఈ ఆఫర్‌తో కేవలం డేటా మాత్రమే ఉచితంగా వస్తుంది. 

యూజర్లు మైజియో యాప్‌లోకి వెళ్లి.. మై ప్లాన్స్ సెక్షన్‌లో కరెంట్ ప్లాన్‌ను ఎంపిక చేసుకుంటే.. అందులో జియో సెలబ్రేషన్ ప్యాక్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్‌ను పొందొచ్చు. అయితే.. ఈ ఆఫర్ అందరికీ కనిపించదు. ప్రస్తుతానికి ఎంపిక చేసిన యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. తర్వాత మరికొంతమంది యూజర్లకు ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు జియో ప్రకటించింది.

జన రంజకమైన వార్తలు