జియో వచ్చాక డేటా చౌకయిపోయింది. కేబీల్లో, ఎంబీల్లో లెక్కలేసి డేటా వాడుకునే ఇండియన్ మొబైల్ ఫోన్ యూజర్లు ఇప్పుడు జీబీల్లో డేటా వాడుతున్నారంటే అది జియో మహిమే. జియో పోటీని తట్టుకోవడానికి ఇతర కంపెనీలూ ధరలు తగ్గించాయి. ఇండియాలో స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లు గడిచిన రెండేళ్లలో భారీగా పెరగడానికి ఇలా జియోనే కారణమైంది. జియోలో ఎక్కువ ప్రీపెయిడ్ ప్లాన్స్ రోజుకు 1.5, 2జీబీ 4జీ డేటాను ఫ్రీగా ఇస్తున్నాయి. వీటి విలువ 350 నుంచి 500 రూపాయలలోపు ఉంది. కానీ రోజూ 50, 60 జీబీ డేటా కనీసం వాడుకునే వారికి కూడా ప్లాన్స్ తీసుకొచ్చింది. వీటిలో వచ్చే ఫ్రీ డేటాను చూస్తే వీటిని బాహుబలి రీఛార్జి ప్యాక్స్ అనాలి. అలాంటి రీఛార్జి ప్లాన్స్ మీకోసం..
జియో 999 ప్యాక్
999 రూపాయలతో రీఛార్జి చేసుకుంటే రోజుకు 60 జీబీ 4జీ డేటా ఇస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ. వ్యాలిడిటీ 90 రోజులు. అంటే రోజుకు 11 రూపాయలతో రోజుకు 60 జీబీ డేటా వస్తుందన్నమాట.
జియో 1999 ప్యాక్
1999 రూపాయలతో రీఛార్జి చేసుకుంటే రోజుకు 125 జీబీ 4జీ డేటా ఇస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ. వ్యాలిడిటీ 180 రోజులు. రోజుకు 11 రూపాయలతో 125 జీబీ డేటా వాడుకోవచ్చు.
జియో 4999 ప్యాక్
4999 రూపాయలతో రీఛార్జి చేసుకుంటే రోజుకు 350 జీబీ 4జీ డేటా ఇస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ. వ్యాలిడిటీ 360 రోజులు. దీనిలో రోజుకు 14 రూపాయలతో ఏడాదిపాటు రోజుకు ఏకంగా 350 జీబీ డేటా వాడుకోవచ్చు.
జియో 9999 ప్యాక్
3999 రూపాయలతో రీఛార్జి చేసుకుంటే రోజుకు 750 జీబీ 4జీ డేటా ఇస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ. వ్యాలిడిటీ 360 రోజులు. అంటే ఈ ప్యాక్‌లో ఒక జీబీ డేటా మీకు 3 పైసలు పడుతుంది.