• తాజా వార్తలు

రిలయన్స్ జియో యూజర్లకు క్రికెట్ డేటా ఆఫర్లు 

రిలయన్స్ జియో అభిమానులకు సరికొత్తగా డేటా ప్యాక్ లను కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో యూజర్లకు అత్యంత తక్కువ ధరలో ఎక్కువ డేటా అందించే విధంగా అదిరిపోయే రీచార్జ్ ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. జియో క్రికెట్ సీజన్ డేటా ప్యాక్ పేరుతో ఈ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

యూజర్లు జియో క్రికెట్ డేటా ప్లాన్ పొందాలంటే రూ.251తో రీచార్జ్ చేసుకోవాలి. ఇందులో రోజుకు 2 జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 51 రోజులు. అంటే రూ.251తో రీచార్జ్ చేసుకుంటే 102 జీబీ డేటా వస్తుంది. దీంతో యూజర్లు టీ20 మ్యాచ్‌లు ఉచితంగా వీక్షించొచ్చని కంపెనీ తెలిపింది.

రూ.251 జియో క్రికెట్ సీజన్ ప్యాక్‌తో యూజర్లు మరిన్ని ఇతర ప్రయోజనాలను కూడా పొందొచ్చు. ఎక్స్‌క్లూజివ్ వాల్‌పేపర్స్, అలాగే ఫేవరేట్ టీమ్ లోగోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మైజియో యాప్‌లోని కూపన్స్ సెక్షన్‌లోకి వెళ్లి యూజర్లు ఈ బెనిఫిట్లను పొందవచ్చు.

ఇంకో ఆసక్తిర అంశం ఏంటంటే ఫెవరేట్ టీమ్‌తో సెల్ఫీ దిగే అవకాశం కూడా ఈ ఆఫర్లో అందుబాటులో ఉంది. అలాగే మ్యాచ్ టికెట్లను గెలుచుకోవచ్చు. మ్యాచ్ టాస్ సమయంలో గ్రౌండ్‌లోకి వెళ్లి ఎంజాయ్ చేయవచ్చు. దీంతో పాటుగా టీమ్ జెర్సీ, క్యాప్స్, బ్యాట్స్ గెలుచుకోవచ్చు. 

టీ20 మ్యాచ్ జరిగేటప్పుడు యూజర్లు జియో క్రికెట్ ప్లే అలాంగ్‌లో పార్టిసిపేట్ చేయవచ్చు.  ఈ గేమ్ లో బాల్ బాల్‌కు ఏమౌతుంది అనేది ముందుగానే అంచనా వేయగలగాలి. మన అంచనా నిజమైతే పాయింట్లు వస్తాయి. ఎవరైతే ఎక్కువ పాయింట్లు గెలుచుకుంటారో వారికి అదిరిపోయే బహుమతులు లభిస్తాయి. 

జన రంజకమైన వార్తలు