ప్రకృతి అందాలతో పర్యాటకులను పరవశింపచేసిన కేరళ ఇప్పుడు ఎటు చూసినా హృదయవిదారకంగా కనిపిస్తోంది. వందల మంది ప్రాణాలు కోల్పోగా కొన్ని లక్షల మంది నిరాశ్రయులై సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. మరోవైపు తమవారి ఆచూకీ కోసం కేరళలోనూ, దేశ విదేశాల్లోనూ ఉన్న వారి బంధుమిత్రులు తల్లడిల్లిపోతున్నారు. ఇలాంటి వారికి సమాచారం అందిపుచ్చుకోవడానికి మన టెలికం కంపెనీలు కూడా సాయం చేస్తున్నాయి.
బిల్ కట్టకపోయినా సర్వీస్
పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు బిల్ కట్టకపోయినా సర్వీస్‌ను కొనసాగిస్తున్నాయి. ప్రీపెయిడ్ యూజర్లకు టైమ్ అయిపోయినా కాల్స్ వెళ్లేలా ఏర్పాట్లు చేశాయి. మొత్తం మీద కేరళలో ఉన్న ప్రజలు బయటిప్రపంచంతో సంబంధాలు కోల్పోకుండా తాము చేయగలిగినంతా చేస్తున్నాయి. అత్యవసరంగా కావాలంటే టాక్ టైమ్ క్రెడిట్ ఇస్తున్నాయి. సమాచారం షేర్ చేసుకోవడానికి డేటాను ఫ్రీగా ఇస్తున్నాయి.
ఎయిర్‌టెల్
* టాక్‌టైమ్ లేని ప్రీ పెయిడ్ యూజర్లకు 30రూపాయల వరకు క్రెడిట్ ఇస్తుంది. కేరళలోని ఎయిర్‌టెల్ ప్రీ పెయిడ్ యూజర్ల అకౌంట్‌లో బ్యాలన్స్ లేకపోతే ఆటోమేటిగ్గా 30 రూపాయలు ఆటోమేటిగ్గా యాడ్ చేస్తుంది.
* యూజర్లందరికీ వారం రోజుల వ్యాలిడిటీతో 1జీబీ డేటాను ఫ్రీగా ఇచ్చింది.
* పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు బిల్ పేమెంట్ డేట్‌ను ఎక్స్‌టెన్షన్ ఇచ్చింది.
* బాధిత ప్రజలు ఫ్రీ కాల్స్, వైఫై వాడుకోవడానికి వీలుగా ఐదు రిలీఫ్ సెంటర్స్‌లో వీశాట్‌ను ఏర్పాటు చేసింది.
* 10 రోజులుగా విద్యుత్ లేక సెల్ ఫోన్స్‌లో ఛార్జింగ్ లేక సమాచారం అందక అవస్థలు పడుతున్నవారు ఛార్జింగ్ చేసుకోవడానికి, ఫ్రీ కాల్స్ చేసుకోవడానికి త్రి సూర్, కాలికట్, మలప్పుర, కొట్టాయం, కన్నూర్, త్రివేండ్రం, ఎర్నాకులంల్లో ఎయిర్‌టెల్ తన ఫ్లాగ్‌షిప్ స్టోర్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఐడియా
భారీ వర్షాలు, వరదల కారణంగా గల్లంతయిన వారిని వెతికిపట్టుకునేందుకు ఐడియా ఓ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇలాంటివారు ఐడియా సబ్‌స్క్రైబర్లు అయితే 1948 అని టోల్‌ఫ్రీ నెంబర్‌కి కాల్ చేస్తే ఆ పర్సన్ లొకేషన్‌ను ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తుంది. అంతేకాదు టాక్‌టైమ్ లేని కస్టమర్లు 150150#కి డయల్ చేస్తే 10 రూపాయల టాక్‌టైమ్ క్రెడిట్ వెంటనే ఇస్తారు. కేరళలోని యూజర్లందరికీ వారం రోజుల వ్యాలిడిటీతో 1జీబీ డేటాను ఫ్రీగా ఇచ్చారు.
జియో
రిలయన్స్ జియో కూడా కేరళలోని యూజర్లకు కాంప్లిమెంటరీ ప్యాక్‌ను ఇచ్చింది. వారం రోజులపాటు అన్‌లిమిటెడ్ కాల్స్, డేటాను యూజర్లు వాడుకోవచ్చు.