ఒకవైపు ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి, మరోవైపు పెంచిన ఛార్జీలు చూసి కస్టమర్లు ఎక్కడ తమ నెట్‌వర్క్ వదిలి వేరే నెట్‌వర్క్‌కి వెళ్లిపోతారో అనే భయం టెలికం కంపెనీలను నిద్ర పోనివ్వడం లేదు. అందుకే ఓ పక్క ఛార్జీలు పెంచుతూనే మరోవైపు కస్టమర్లను ఏదోరకంగా మెప్పించడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. లైవ్ టీవీ ప్రోగ్రామ్‌లు, వీడియో స్ట్రీమింగ్ సర్వీసులు అందిస్తున్నాయి. ఇప్పుడు ఇంకో వినూత్న ప్రయత్నాన్ని ఎయిర్‌టెల్ మొదలుపెట్టింది. తమ దగ్గర సెలక్టెడ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ తీసుకున్నవారికి జీవిత భీమా (లైఫ్ ఇన్సూరెన్స్) ఇస్తోంది.
4 లక్షల వరకు ఇన్సూరెన్స్
సెలెక్టెడ్ ప్లాన్స్ మీద 4 లక్షల రూపాయల వరకు లైఫ్ ఇన్సూరెన్స్‌ను ఎయిర్‌టెల్ అందిస్తోంది. ఆ ప్లాన్స్ వివరాలు, అందులో ఉండే బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం
ఎయిర్‌టెల్ 179 ప్లాన్
179 రూపాయలతో ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జి చేయిస్తే 28 రోజులపాటు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.
* 28 రోజులకు కలిపి 2జీబీ 4జీ డేటా ఫ్రీ
* 300 ఎస్ఎంఎస్‌లు ఉచితం
* ఈ బెనిఫిట్సన్నీ సాధారణంగా 149 రూపాయల ప్లాన్‌లోనే వస్తాయి. అదే 179 రూపాయలతో రీఛార్జి చేసుకుంటే ఆ మిగిలిన 30 రూపాయలతో 2 లక్షల రూపాయల హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తుంది.
ఎయిర్‌టెల్ 279 ప్లాన్
279 రూపాయలతో ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జి చేయిస్తే 28 రోజులపాటు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.
* రోజుకు 1.5 జీబీ 4జీ డేటా ఫ్రీ
* రోజుక 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం
* ఈ బెనిఫిట్సన్నీ సాధారణంగా 249 రూపాయల ప్లాన్‌లోనే వస్తాయి. అదే 279 రూపాయలతో రీఛార్జి చేసుకుంటే ఆ మిగిలిన 30 రూపాయలతో 4 లక్షల రూపాయల హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తుంది.
* ఈ రెండు ప్లాన్స్‌లోన వింక్ మ్యూజిక్ సర్వీస్, షా అకాడమీలో 4 వారాల కోర్సు కూడా ఫ్రీ.
ఇన్సూరెన్స్ రూల్స్ ఏమిటంటే..
* ఈ ఇన్సూరెన్స్ పొందాలంటే కస్టమర్ వయసు 18 నుంచి 54 సంవత్సరాల మధ్య ఉండాలి.
* ఇది పేపర్ లెస్ ఇన్సూరెన్స్. కాబట్టి కస్టమర్ ఎలాంటి డాక్యుమెంట్స్ ఫిల్ చేయక్కర్లేదు
* ఇన్సూరెన్స్ పాలనీ యాక్టివేట్ కాగాగనే పాలసీ సర్టిఫికెట్ మీకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది.