టెక్నాలజీ బోల్డంత మారిపోయింది. ఒకప్పుడు ఇన్‌కమింగ్‌కు కూడా నిమిషానికి 7 రూపాయలు వసూలు చేసిన టెల్కోలు ఇప్పుడు రోమింగ్ కాల్స్ కూడా ఫ్రీగా చేసుకోమని వెంటపడుతున్నాయి. కానీ ఇంటర్నేషనల్ కాల్స్ రేట్లు మాత్రం ఇప్పటికీ భారీగానే ఉన్నాయి. అయితే టెక్నాలజీ పుణ్యమాని ఇంటర్నేషనల్ కాల్స్ కూడా తక్కువ రేట్లకు చేసుకునే ఆప్షన్స్ వచ్చాయి. వాటిపై ఓ లుక్కేయండి మరి..
వైబర్ (Viber)
వైబర్ యాప్ ప్లే స్టోర్లో ఫ్రీగా లభిస్తుంది. ఇద్దరూ వైబర్ యూజర్లు అయితే ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. వైబర్ యూజ్ చేయలేని ల్యాండ్‌లైన్ వంటి ఫోన్లకు అయితే చాలా ప్రీపెయిడ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. చౌక ధరల్లోనే ఇంటర్నేషనల్ కాల్స్ మాట్లాడుడకోచ్చు. వీడియో కాలింగ్ హై క్వాలిటీతో చేసుకోవచ్చు. కన్వినెంట్‌గా, ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. కస్టమర్ సర్వీస్ బాగుంటుందని యూజర్లు చెబుతున్నారు.
ఫేస్‌బుక్ మెసెంజర్ (Facebook Messenger)
మీరు ఫేస్ బుక్ యూజ్ చేస్తుంటే మీ ఫేస్‌బుక్ మెసెంజర్‌తో చాటింగ్ కూడా చేస్తుంటారు. అయితే ఈ యాప్‌తో ఇంటర్నేషనల్ కాల్స్ కూడా చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు. మీరూ, అవతలి వ్యక్తి మంచి ఇంటర్నెట్ కనెక్టివిటీలో ఉన్నంత వరకు ఇంటర్నేషనల్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. చాటింగ్‌కు ఇది చాలా కూల్ యాప్. పర్సనల్ యూజ్‌కు మంచి ఆప్షన్. యూసేజ్ కూడా ఈజీనే. అయితే మెసేజ్‌లు డిలీట్ చేయడం కొద్దిగా కష్టం.
స్కైప్ (Skype)
నెట్ ద్వారా వీడియో కాల్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు స్కైప్. వీడియో కాలింగ్‌తోపాటు ఇన్‌స్టంట్ మెసేజింగ్ ఇది చాలా మంచి ఆప్షన్. ఈ యాప్‌తో మొబైల్, ల్యాండ్ ఫోన్లకు కూడా కాల్ చేసుకోవచ్చు. స్కైప్ నుంచి స్కైప్‌కు కాల్స్ ఫ్రీ. యాప్ కొద్దిగా పెద్ద సైజ్‌లో ఉండడం ఒక్కటే ఇందులో కొంత ప్రాబ్లం. మిగతా పెర్‌ఫార్మెన్స్ విషయంలో చూసుకోవక్కర్లేదు.
డింగ్‌టోన్ (Dingtone)
ఇది మిగిలిన యాప్స్ కంటే డిఫరెంట్. చిన్నప్పుడు మీరు వాకీటాకీల ఆటాడుకున్నట్లు ఇన్‌స్ట్ంట్ వాయిస్ చాటింగ్ చేయొచ్చు. ఫ్రీ వెర్షన్‌లో యాడ్స్ హెడేక్ ఉంది. పెయిడ్ వెర్షన్‌లో అయితే మీరు కాల్స్‌ను బ్లాక్, ఫార్వర్డ్ కూడా చేయొచ్చు. మీ ఫోన్‌కు సెకండ్ లేదా థర్డ్ లైన్‌ను కూడా యాడ్ చేయొచ్చు. ఫ్యామిలీ అంతా మాట్లాడుకోవడానికి ఇది మంచి యాప్. వీడియోలు చూసి, ఆఫర్స్ కంప్లీట్ చేసి క్రెడిట్స్ పొందొచ్చు. వీటితోనే మీరు కాల్స్ చేసుకోవచ్చు. డబ్బులు చేతిలోంచి ఖర్చుపెట్టాల్సిన పని లేదు. ఎక్కువ మంది వైఫై వాడుతున్న ఏరియాల్లో కాల్ కట్టవుతుండడం ఒక్కటే లోపం.
వాట్స్ కాల్ ( WhatsCall)
కాలింగ్, టెక్స్టింగ్‌కు ప్రైవేట్ నెంబర్ కావాలంటే వాట్స్ కాల్ వాడుకోవచ్చు. ఈ ఆండ్రాయిడ్ యాప్‌తో ఇంటర్నేషనల్ కాల్స్, మెసేజ్‌లు ఫ్‌రీగా చూసుకోవచ్చు. యాడ్స్ చూసి లేదా వీల్ స్పిన్ తిప్పి క్రెడిట్స్ సంపాదించుకుని వాటితో కాల్స్ చేసుకోవచ్చు. మంచి యాప్. అయితే ఫొటో సెండింగ్ కష్టం.