ఇది టెలికాం యుగం.. మనం ఎన్నో రకాల మొబైల్ నెట్ వర్కులు వాడుతుంటాం. ఆఫర్లను బట్టి మన మొబైల్ టైపును బట్టి నెట్ వర్కులను ఎంచుకుంటాం. అయితే మొబైల్ నెట్ వర్కులు చాలా కాలంగా వాడుతున్నా వాటి గురించి చాలామందికి అన్ని విషయాలూ తెలియవు. ఏదొక సందేహం వెంటాడుతూనే ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా కొన్ని కొత్త విషయాలు తెలియవు. మరి మొబైల్ నెట్ వర్కులపై ఉండే ఇలాంటి అపోహలు ఏంటి? వాటిని ఎలా తొలగించుకోవాలో చూద్దామా..
అలా ఉంటే సిగ్నల్ ఉన్నట్లా?
మీ సెల్ ఫోన్లో నెట్వర్క్ సరిగా ఉందో లేదో తెలుసుకోవాలంటే సిగ్నల్ ఎన్ని గీతలు ఉందో చూడడం పరిపాటి. గీతలు (బార్స్) తక్కువగా ఉంటే సిగ్నల్ లేదని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి బార్స్ తక్కువగా ఉన్నంత మాత్రన సిగ్నల్ సరిగా ఉన్నట్లు కాదు. ఒకే నెట్వర్కు కు సంబంధించిన రెండు ఫోన్లను పక్క పక్కనే ఉంచినా కూడా సిగ్నల్ ఒకేలా ఉంటుందనే గ్యారెంటీ లేదు. ధీినికి కారణం మీ ఫోన్ మోడల్ కూడా కారణం అయి ఉండొచ్చు.
నెట్వర్క్ బూస్టర్
నెట్ వర్క్ క్వాలిటీ పెంచాలంటే బూస్టర్లను యూజ్ చేస్తుంటారు చాలా మంది. కానీ మీ నెట్వర్క్ క్వాలిటీ పెంచాలంటే మీరేమి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. స్టిక్కర్లను అంటించాల్సిన అవసరం అంతకంటే లేదు.ఇవన్నీ కేవలం జిమ్మక్కులు మాత్రమే. దీని వల్ల మీ ఫోన్ పై భాగం పాడవడం తప్ప వేరే ఉపయోగం ఏమీ ఉండదు.
ఆకాశానికి చూపిస్తే..
చాలామంది ఫోన్ సిగ్నల్ కోసం ఆకాశం వైపు ఫోన్ ని చూపిస్తూ ఉంటారు. దీని వల్ల సిగ్నల్ బాగా వస్తుందని అనుకుంటారు. కానీ ఇదంతా మన భ్రమే. నిజానికి ఇలా ఆకాశం వైపు చూపిస్తే సెల్ సిగ్నల్ రావడం జరగదు. మన సెల్ ఫోన్ సెల్ టవర్ కు ఎంత దూరంలో ఉంటుందనేదే కీలకం.
ఫ్లయిట్ మోడ్ లో పెడితే..
చాలామంది ఛార్జింగ్ బాగా కావాలంటే ఫ్లయిట్ మోడ్ లో పెట్టాలని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు కేవలం అపోహ మాత్రమే. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వల్ల తప్ప ఫ్లయిట్ మోడ్ లాంటి వాటి వల్ల మాత్రమే ఛార్జింగ్ పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.