• తాజా వార్తలు

వొడాఫోన్ ప్రీపెయిడ్ ప్లాన్ల‌లో మీకు సూట‌య్యే ప్లాన్ ఏంటో  తెలుసా?

మీరు ఎక్క‌డికి వెళ్లినా మీ వెన్నంటి వ‌చ్చే నెట్‌వ‌ర్క్ (Where ever you go our network follows) అంటూ ఓ కుక్క‌పిల్లతో వ‌చ్చిన హ‌చ్ మొబైల్ నెట్‌వ‌ర్క్ యాడ్ గుర్తుందా?  ఎయిర్‌టెల్‌, ఐడియాలు భారీ రేట్ల‌తో యూజ‌ర్ల‌ను కంగారుపెడుతున్న టైమ్‌లో కాస్త చౌక ధ‌ర‌ల్లో మొబైల్ సేవ‌లందించింది. త‌ర్వాత దాన్ని బ్రిటిష్ కంపెనీ వొడాఫోన్ కొనేసింది.  ఇప్పుడు వొడాఫోన్‌కు దేశంలో దాదాపు 20 కోట్ల మంది క‌స్ట‌మ‌ర్లున్నారు.  ఇండియాతోపాటు 26 దేశాల్లో నెట్‌వ‌ర్క్‌ను ఆప‌రేట్ చేస్తున్న వొడాఫోన్ 57 దేశాల్లో భాగస్వాముల‌తో క‌లిసి నెట్‌వ‌ర్క్ అందిస్తోంది.  అలాంటి వొడాఫోన్‌లో ఉన్న అన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ వివ‌రాల‌న్నీ ఒకేచోట ఇస్తున్నాం.

వొడాఫోన్ ప్రీపెయిడ్ ఇంట‌ర్నెట్ ప్లాన్స్‌

వొడాఫోన్ 31 రూపాయ‌ల డేటా రీఛార్జి ప్లాన్‌
31 రూపాయ‌ల‌తో రీఛార్జి చేయించుకుంటే 150 ఎంబీ డేటా వ‌స్తుంది.  నెట్‌వ‌ర్క్ ల‌భ్య‌త‌ను బ‌ట్టి 2జీ, 3జీ, 4జీల్లో ఏదో ఒక‌టి క‌నెక్ట్ అవుతుంది. వ్యాలిడిటీ 28 రోజులు. 150 ఎంబీని జియో వ‌చ్చాక మ‌నం 5 నిముషాల్లో వాడేస్తున్నాం. అదీ  దాన్ని ఏకంగా 28 రోజులు వాడుకోవ‌డ‌మంటే ఈ ప్యాక్ ఎంత ఉప‌యోగ‌ప‌డుతుందో అర్ధం చేసుకోవ‌చ్చు. 

వొడాఫోన్ 37 రూపాయ‌ల డేటా రీఛార్జి ప్లాన్‌
37 రూపాయ‌ల‌తో రీఛార్జి చేయించుకుంటే  375 ఎంబీ డేటా వ‌స్తుంది.  నెట్‌వ‌ర్క్ ల‌భ్య‌త‌ను బ‌ట్టి 2జీ, 3జీ, 4జీల్లో ఏదో ఒక‌టి క‌నెక్ట్ అవుతుంది. వ్యాలిడిటీ 5 రోజులు. 375 ఎంబీని 5 రోజులు కాబ‌ట్టి డేటాను ఆచితూచి వాడుకునేవారికి కాస్త ప‌నికొచ్చే అవ‌కాశ‌ముంది.

వొడాఫోన్ 46 రూపాయ‌ల డేటా రీఛార్జి ప్లాన్‌
పై రెండింటితో పోల్చితే ఇది కాస్త బెట‌ర్‌.  46 రూపాయ‌ల‌తో రీఛార్జి చేయించుకుంటే 500 ఎంబీ డేటా వ‌స్తుంది.  నెట్‌వ‌ర్క్ ల‌భ్య‌త‌ను బ‌ట్టి 2జీ, 3జీ, 4జీల్లో ఏదో ఒక‌టి క‌నెక్ట్ అవుతుంది. వ్యాలిడిటీ 7  రోజులు.

వొడాఫోన్ 95 రూపాయ‌ల డేటా రీఛార్జి ప్లాన్‌
ప్ర‌స్తుత స్మార్ట్ ఫోన్ యూజ‌ర్ల‌కు ఉప‌యోగ‌ప‌డే కనీస ప్యాక్ ఇది. 95 రూపాయ‌ల‌తో రీఛార్జి చేయించుకుంటే 1జీబీ డేటా వ‌స్తుంది.  నెట్‌వ‌ర్క్ ల‌భ్య‌త‌ను బ‌ట్టి 2జీ, 3జీ, 4జీల్లో ఏదో ఒక‌టి క‌నెక్ట్ అవుతుంది. వ్యాలిడిటీ 28 రోజులు. 

వొడాఫోన్ 149 రూపాయ‌ల డేటా రీఛార్జి ప్లాన్‌
149 రూపాయ‌ల‌తో రీఛార్జి చేయించుకుంటే 1.5 జీబీ డేటా వ‌స్తుంది.  నెట్‌వ‌ర్క్ ల‌భ్య‌త‌ను బ‌ట్టి 2జీ, 3జీ, 4జీల్లో ఏదో ఒక‌టి క‌నెక్ట్ అవుతుంది. వ్యాలిడిటీ 28 రోజులు. రోజులో కాసేపు ఫేస్‌బుక్, వాట్సాప్ చూసేవాళ్ల‌కు ఇది స‌రిపోవ‌చ్చు. కానీ ఇదే ధ‌ర పెడితే రిల‌య‌న్స్ జియోలో నెల రోజులపాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌, రోజుకు 1జీబీ డేటా 28 రోజుల‌పాటు వ‌స్తుంది. 

వొడాఫోన్ 175 రూపాయ‌ల డేటా రీఛార్జి ప్లాన్‌
175 రూపాయ‌ల‌తో రీఛార్జి చేయించుకుంటే 2 జీబీ డేటా వ‌స్తుంది.   2జీ, 3జీ, 4జీల్లో ఏదో ఒక‌టి క‌నెక్ట్ అవుతుంది. వ్యాలిడిటీ 28 రోజులు. ఈ డ‌బ్బులు పెడితే జియోలో 28 రోజుల‌కు  రోజూ 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ కూడా వ‌స్తాయి. 

వొడాఫోన్ 255 రూపాయ‌ల డేటా రీఛార్జి ప్లాన్‌
255 రూపాయ‌ల‌తో రీఛార్జి చేయించుకుంటే 3జీబీ డేటా వ‌స్తుంది.   2జీ, 3జీ, 4జీల్లో ఏదో ఒక‌టి క‌నెక్ట్ అవుతుంది. వ్యాలిడిటీ 28 రోజులు.  జియోలో 251 రూపాయ‌లతో రీఛార్జి చేసుకుంటే 51 రోజుల‌పాటు ఏకంగా రోజుకు 2జీబీ 4జీ డేటా వ‌స్తుంది.
మొత్తంగా చెప్పాలంటే వొడాఫోన్ ఓన్లీ డేటా రీఛార్జి ప్లాన్స్‌తో పెద్ద‌గా ఉప‌యోగం లేద‌ని టెలికం మార్కెట్ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.  వీటితే కంపేర్ చేస్తే వొడాఫోన్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో కూడిన బండిల్డ్ ప్లాన్స్ ఉప‌యోగం. వాటి వివ‌రాలు కూడా చూద్దాం.

వొడాఫోన్ అన్‌లిమిటెడ్  ప్లాన్స్‌
వొడాఫోన్ 198 ప్లాన్‌

198 రూపాయ‌ల‌తో రీఛార్జి చేయించుకుంటే 28 రోజుల‌పాటు అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్ ఫ్రీ. అలాగే రోమింగ్‌లో కూడా అన్‌లిమిటెడ్ ఇన్‌క‌మింగ్‌, ఔట్‌గోయింగ్ ఫ్రీ.  రోజుకు 100 లోక‌ల్‌, నేష‌న‌ల్ ఎస్ఎంస్‌లు కూడా ఉచితం. దీనితోపాటు రోజుకు 1.4 జీబీ 3జీ/ 4జీబీ డేటా కూడా వ‌స్తుంది. 

వొడాఫోన్ 399 ప్లాన్‌
399 రూపాయ‌ల‌తో రీఛార్జి చేయించుకుంటే 70 రోజుల‌పాటు అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్ ఫ్రీ. అలాగే రోమింగ్‌లో కూడా అన్‌లిమిటెడ్ ఇన్‌క‌మింగ్‌, ఔట్‌గోయింగ్ ఫ్రీ.  రోజుకు 100 లోక‌ల్‌, నేష‌న‌ల్ ఎస్ఎంస్‌లు కూడా ఉచితం. దీనితోపాటు రోజుకు 1.4 జీబీ 3జీ/ 4జీబీ డేటా కూడా వ‌స్తుంది. 

వొడాఫోన్ 458 ప్లాన్‌
458 రూపాయ‌ల‌తో రీఛార్జి చేయించుకుంటే 84  రోజుల‌పాటు అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్ ఫ్రీ. అలాగే రోమింగ్‌లో కూడా అన్‌లిమిటెడ్ ఇన్‌క‌మింగ్‌, ఔట్‌గోయింగ్ ఫ్రీ.  రోజుకు 100 లోక‌ల్‌, నేష‌న‌ల్ ఎస్ఎంస్‌లు కూడా ఉచితం. దీనితోపాటు రోజుకు 1.4 జీబీ 3జీ/ 4జీబీ డేటా కూడా వ‌స్తుంది. 

వొడాఫోన్ 509 ప్లాన్‌
509 రూపాయ‌ల‌తో రీఛార్జి చేయించుకుంటే 91 రోజుల‌పాటు అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్ ఫ్రీ. అలాగే రోమింగ్‌లో కూడా అన్‌లిమిటెడ్ ఇన్‌క‌మింగ్‌, ఔట్‌గోయింగ్ ఫ్రీ.  రోజుకు 100 లోక‌ల్‌, నేష‌న‌ల్ ఎస్ఎంస్‌లు కూడా ఉచితం. దీనితోపాటు రోజుకు 1.4 జీబీ 3జీ/ 4జీబీ డేటా కూడా వ‌స్తుంది. 

ఇవ‌న్నీ జియో ప్లాన్స్‌కు ద‌గ్గ‌రగానే ఉన్నాయి. అయితే జియోలో టారిఫ్ రేట్ పెరిగేకొద్దీ డేటా కూడా పెరుగుతుంది. కానీ ఇక్క‌డ అన్నింటికీ స్టాండ‌ర్డ్‌గా ఒకేలా 1.4 జీబీ రోజూవారీ డేటా ఇస్తున్నారు. 
 

జన రంజకమైన వార్తలు