• తాజా వార్తలు

హైస్పీడ్ మొబైల్ డాటా టారిఫ్ చవకైనప్పుడు ఖరీదైన బ్రాడ్ బ్యాండ్ నెట్ అవసరమా?

బీఎస్సెన్నెల్ రూ.444 ప్లాను గురించి తెలుసు కదా... రోజుకు 4జీబీ చొప్పున 90 రోజుల పాటు 360 జీబీ వస్తుంది. మరి ఇలాంటి డాటా ప్యాక్ లు ఉన్నప్పుడు ఊరికే బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ కోసం భారీగా వెచ్చించాల్సిన అవసరం ఉందా? ఈ బీఎస్సెన్నెల్ ప్లాన్ తో డాటా అత్యంత చవకగా మారిపోయింది. ఇప్పుడున్న జియో రేటు కంటే కూడా ఇందులో డాటా మరింత చవగ్గా వస్తోంది.
బీఎస్సెన్నెల్ రూ.444 ప్లానులో 1జీబీ డాటా కేవలం రూ.1.23 ధరకే దొరుకుతోంది. జియో డాటా ప్లాన్లు చూసుకుంటే 1 జీబీ రూ.11.04 పడుతోంది. ఎయిర్ టెల్ రూ.499 ప్లాన్లో చూసుకుంటే రూ.5.70 పడుతోంది. బీఎస్సెన్నెల్ కు మిగతా టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు మధ్య డాటా ధరల్లో భారీ వ్యత్యాసం ఉంది.
మరో వైపు తెలుగు రాష్ర్టాల్లో బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ల ధరలు కూడా ఇంతకంటే ఎక్కువే ఉన్నాయి. బేసిక్ ప్లాన్లలో వేగం తక్కువ ఉంటుంది. ఇందులోనూ ప్లానును బట్టే వేగం ఉంటుంది. రూ.500, రూ.400 వంటి ప్లాన్లలో 2 ఎంబీపీఎస్ , 4 ఎంబీపీఎస్ కు మించి వేగం ఉండదు. అదే బీఎస్సెన్నెల్ 4జీ వేగం అధికంగా ఉంటుంది. మరిన్ని ధర నుంచి వేగం వరకు ఇన్ని అనుకూలతలు ఉన్నప్పుడు ఈ ఆఫర్ బెటరా... బ్రాడ్ బ్యాండ్లు బెటరా అన్నది ఆలోచించుకోవాల్సిందే. ముఖ్యంగా డొమెస్టిక్ యూజర్లు ఇప్పటికే చాలామంది కనెక్షన్లు వదులుకుంటున్నారు.

జన రంజకమైన వార్తలు