రిలయన్స్ జియోను తట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్న ఎయిర్ టెల్ ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. డోంగిల్ సహాయంతో డాటా వాడేవారి కోసం కొత్త ఆఫర్ తో ముందుకొచ్చింది.
నెల రోజుల కాలపరిమితితో..
కేవలం రూ.499కే 35 జీబీ 4జీ డేటాను అందిస్తున్నట్టు ప్రకటించింది. దీని కాలపరిమితి నెల రోజులు. కాగా, గతంలో రూ.3 వేలు ఉన్న ఎయిర్‌టెల్ డోంగిల్‌ను ప్రస్తుతం రూ.1500కే అందిస్తున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించింది.
వెబ్ సైట్ ద్వారా మాత్రమే
అయితే ఇది ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేసిన వారికి మాత్రమే పరిమితం. మరోవైపు ఎయిర్‌టెల్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను ఇటీవల సంస్థ మరో మూడు నెలలు పొడిగించిన సంగతి తెలిసిందే. దీంతో పోస్ట్ పెయిడ్ యూజర్లకు మరో మూడు నెలలపాటు నెలకు 10 జీబీ చొప్పున ఉచిత డేటా లభిస్తుంది.