• తాజా వార్తలు

ఎయిర్‌టెల్ డీటీహెచ్ ధర తగ్గింది , ఓ సారి చెక్ చేసుకోండి

దేశీయ టెలికం రంగంలో దూసుకుపోతున్న భారతీ ఎయిర్‌టెల్  డీటీహెచ్ విభాగంలో కూడా దూసుకుపోయేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా  ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది. అందుకే తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ధరలను తగ్గిస్తూ వస్తోంది. 

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ తగ్గింపు ఆఫర్‌లో భాగంగా హెచ్‌డీ, ఎస్‌బీ సెట్ టాప్ బాక్స్‌లపై రూ.200 తగ్గింపు పొందొచ్చు. దీంతో కొత్తగా ఎయిర్‌టెల్ డీటీహెచ్ కనెక్షన్ తీసుకోవాలని భావించే వారికి ఇది మంచి శుభవార్త కానుంది. కంపెనీ అలాగే ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ టీవీ బాక్స్‌ ధర కూడా తగ్గించింది. ఇప్పుడు ఇది రూ.3,499కే అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా ఒక నెల ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ఇకపోతే టాటా స్కై కూడా తన సెట్ టాప్ బాక్స్‌ల ధర తగ్గించిన విషయం తెలిసిందే.

కాగా ఎయిర్‌టెల్ తన సబ్‌స్క్రైబర్లకు ఉచిత డేటా ప్రయోజనాలు అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. 
రూ.399, రూ.448, రూ.499 ప్రిపెయిడ్ యూజర్లకు అదరపు డేటా ప్రయోజనం పొందొచ్చు. అయితే దీని కోసం సంబంధిత యూజర్లు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఉదాహరణకు రూ.399 ప్లాన్‌లో యూజర్‌కు రోజుకు 1 జీబీ డేటా లభిస్తుంది. ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. అదే ఈ యూజర్ ఎయిర్‌టెల్ థ్యాంక్స్ మొబైల్ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకుంటే రోజుకు 1.4 జీబీ డేటా పొందొచ్చు. ప్లాన్ వాలిడిటీ 84 రోజులే ఉంటుంది. రూ.448, రూ.499 ప్లాన్లకు కూడా ఇదే వర్తిస్తుంది.

జన రంజకమైన వార్తలు