• తాజా వార్తలు

ఏమిటీ ఎయిర్‌టెల్ థ్యాంక్స్‌

రిల‌యన్స్ జియో, ఎయిర్‌టెల్ మ‌ధ్య పోటీ తీవ్ర‌మ‌వుతోంది. జియో ప్రైమ్ మెంబ‌ర్ షిప్‌కి పోటీగా ఎయిర్‌టెల్ కూడా మ‌రో కొత్త ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఏడాదికి రూ.99 చెల్లించి జియో ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌లో స‌భ్య‌త్వం పొందితే.. త‌ర్వాతి సంవ‌త్స‌రం ఉచితంగా పొడిగిస్తారు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ కూడా `ఎయిర్‌టెల్ థ్యాంక్స్‌(Airtel Thanks)` పేరిట జియోకు కౌంట‌ర్ ఇచ్చేలా మెంబ‌ర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇది కూడా జియో ప్రైమ్‌లానే ఇన్వైట్ ఓన్లీ ప్రోగ్రామ్‌. రీచార్జ్ ప్యాక్‌ల ఆధారంగా పోస్ట్‌పెయిడ్‌, ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబ‌ర్ల‌ను ఎక్కువ‌కాలం అసోసియేట్ అయ్యేలా చేస్తుంది. ప్ర‌స్తుతానికి ఈ మెంబ‌ర్‌షిప్ ప్రోగ్రామ్ ఉచితంగా ఎయిర్‌టెల్ అందిస్తున్నా.. భ‌విష్య‌త్‌లో పెయిడ్ మెంబ‌ర్‌షిప్‌గా మార్చ‌బోతోంది. 

దీని ప్ర‌యోజ‌నాలు..
ఈ మెంబ‌ర్‌షిప్‌లో స‌భ్యులుగా చేరిన వారికి సెలెక్టివ్‌ రీచార్జ్‌ల‌పై 100 శాతం క్యాష్ బ్యాక్ అందిస్తుంది. దీంతో పాటు ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఉచితంగా ఏడాదిపాటు పొందుతారు. హ్యాండ్ సెట్ దెబ్బ‌తిన్నా, మొబైల్ సెక్యూరిటీ, ఫ్రీ యాడ్‌-ఆన్ క‌నెక్ష‌న్స్ వంటి అద‌న‌పు ప్ర‌యోజ‌నాలు కూడా అందుతాయి. ఎయిర్‌టెల్ టీవీ, వింక్ మ్యూజిక్ యాప్ స‌బ్‌స్క్రిప్ష‌న్ కూడా చేసుకోవ‌చ్చు. 

మై ఎయిర్‌టెల్ యాప్‌లో
ఈ ఉచిత ప్ర‌యోజ‌నాల‌న్నీ కొంద‌రికి మాత్ర‌మే వ‌ర్తిస్తాయి. అంతేగాక‌ వ్య‌క్తికీ వ్య‌క్తికీ మారుతుంటాయి. మీరు ఎయిర్‌టెల్ మెంబ‌ర్ అవునా కాదా అని `మై ఎయిర్‌టెల్` యాప్ ద్వారా తెలుసుకోవ‌చ్చు. యాప్ ఓపెన్ చేస్తే.. You are a premier member అనే మెసేజ్ క‌నిపిస్తుంది. వీరికి ఈ ఏఏ సౌక‌ర్యాలు వ‌ర్తిస్తాయో ఇందులో ఉంటాయి. 

ఒకే చోట ఎన్నో సౌక‌ర్యాలు
ఒకే వేదిక ద్వారా అన్ని సౌక‌ర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఎయిర్‌టెల్ దీనిని ప్ర‌వేశ‌పెట్టింది. ఉదాహ‌ర‌ణ‌కు రూ.499 పోస్ట్ పెయిడ్‌ ప్లాన్‌లో భాగ‌మైతే.. ఉచితంగా ఎయిర్‌టెల్ టీవీ, వింక్ మ్యూజిక్‌, అమెజాన్ ప్రైమ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితంగా పొందుతారు. వీటితో పాటు కంపెనీ నుంచి ఉచిత హ్యాండ్‌సెట్ ప్రొటెక్ష‌న్ ల‌భిస్తుంది. రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో భాగ‌స్వాములుగా ఉంటే.. రూ.499కి అప్‌గ్రేడ్ అయ్యి ఉచితంగా సౌక‌ర్యాలు పొంద‌వ‌చ్చు. మొబైల్‌కి రీచార్జ్ చేసిన వాటిని బ‌ట్టి ఇవ‌న్నీ ఆధార‌ప‌డి ఉంటాయి. ఒక‌వేళ ప్లాన్ డౌన్‌గ్రేడ్ లేదా ప్లాన్ మార్చుకుంటే ఈ ప్లాన్స్‌లో మార్పులు చేర్పులు ఉంటాయి. 

రూ.51 అమెజాన్ పే గిఫ్ట్ కార్డు
ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్ క‌స్ట‌మ‌ర్ల కోసం ఎయిర్‌టెల్ కొన్ని కాంబో ప్లాన్స్ తీసుకొచ్చింది. రూ.100 కంటే ఎక్కువ రీచార్జ్‌ల‌పై రూ.51 అమెజాన్ పే గిఫ్ట్ కార్డుతో పాటు పోస్ట్‌పెయిడ్ కస్ట‌మ‌ర్ల‌కు ఇన్ఫినిటీ ప్లాన్ ప్ర‌వేశ‌పెట్టింది. మై ఎయిర్ టెల్ యాప్‌లో పైన క‌నిపించే ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బ్యాన‌ర్‌ని రీడిమ్ చేసుకుని రూ.51 అమెజాన్ పే ని రీడిమ్ చేసుకోవ‌చ్చు. ఇది ప్ర‌వేశ‌పెట్టిన ఐదు రోజుల్లోనే 10 ల‌క్ష‌ల మంది దీనిని రీడిమ్ చేసుకున్నార‌ని ఎయిర్‌టెల్ తెలిపింది. 

జన రంజకమైన వార్తలు